Site icon NTV Telugu

Off The Record: తెలంగాణలో పాగా కోసం బీజేపీ ప్రత్యేక వ్యూహాలు!

Bjp

Bjp

Off The Record: తెలంగాణలో కాషాయ స్కెచ్‌ డిఫరెంట్‌గా ఉండబోతోందా? ఈసారి ఎలాగైనా పాగా వేయాలనుకుంటున్న కమలనాధులు ప్రత్యేక వ్యూహాలకు పదును పెడుతున్నారా? ఆ దిశగా ఇప్పటికే ఆపరేషన్‌ స్టార్ట్‌ అయిపోయిందా? ఇంతకీ ఏంటా ఆపరేషన్‌? టార్గెట్‌ చేసుకోబోతున్న సామాజికవర్గాలు ఏవి?

Read Also: Pooja Pal: యూపీ సీఎం యోగిని పొగిడితే, ఎమ్మెల్యేను ఏం చేశారో తెలుసా?

తెలంగాణలో ఏ పార్టీ అయినా… అధికారంలోకి రావడానికి రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాలు చాలా ముఖ్యం. ఇక్కడ 19 ఎస్సీ, 12 ఎస్టీ రిజర్వ్‌డ్‌ అసెంబ్లీ సెగ్మెంట్స్‌ ఉన్నాయి. ఈసారి పునర్విభజన జరిగితే… ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. మొత్తం 119 అసెంబ్లీ నియోజక వర్గాలకు గాను పవర్‌లోకి రావడానికి 60 సీట్లు మ్యాజిక్‌ ఫిగర్‌. అంటే, ఆ లెక్కన చూసుకున్నప్పుడు రాష్ట్రంలో అధికారం దక్కించుకోవడానికి కావలసిన మెజారిటీలో సగం సీట్లు రిజర్వ్‌డ్‌ స్థానాలే ఉన్నాయి. సరిగ్గా ఇక్కడే సరికొత్త సమీకరణలకు తెరలేపాలని అనుకుంటోందట బీజేపీ. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనాసరే.. తెలంగాణలో జెండా పాతాలని భావిస్తున్న బీజేపీ నాయకత్వం ఇప్పటి నుంచే… ఈ రిజర్వ్‌డ్‌ సీట్ల మీద ఫోకస్‌ చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. అందులో భాగంగానే.. ఆయా నియోజకవర్గాల్లో ఇప్పటి నుంచే బలమైన నేతల్ని తయారు చేయాలని భావిస్తోందట.

Read Also: Youth Awardees Meet President: రాష్ట్రపతిని కలిసిన యువజన అవార్డు గ్రహీతలు..

అయితే, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గంలో కూడా గెలవలేకపోయింది కమలం పార్టీ. ఇక ఆయా సెగ్మెంట్స్‌లో పట్టులేకుండా అధికారం చేజిక్కించుకోవడం సాధ్యం కాదని భావించిన పార్టీ పెద్దలు అదే టార్గెట్‌తో వ్యూహచరన చేస్తున్నట్టు సమాచారం. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అచ్చంపేట బీఆర్‌ఎస్‌ నేత గువ్వల బాలరాజును ఇటీవల కమలం గూటికి చేర్చుకోవడం అందులో భాగమేనని అంటున్నారు. ఎస్సీనియోజకవర్గాలైన చెన్నూర్‌, బెల్లంపల్లి, జుక్కల్‌, ధర్మపురి, చొప్పదండి, మానకొండూరు, అందోల్‌… ఇలా అన్ని చోట్ల ఇప్పటికే పార్టీకి బలమైన నేతలు ఉంటే సరే, లేదంటే గెలుపు గుర్రాలను లాక్కోవాలన్నది కాషాయ వ్యూహంగా తెలుస్తోంది. ముందే సర్వే చేసుకుని బలమైన నేతలు ఇతర పార్టీలో ఉంటే వాళ్ళను రప్పించేందుకు స్కెచ్‌ వేస్తున్నట్టు తెలుస్తోంది.

Read Also: Hydra: సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు.. క్లారిటీ ఇచ్చిన హైడ్రా…

కాగా, ఇందులో భాగంగానే ఇటీవల తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవడం ఎలా అన్న అంశంపై జరిగిన కీలక చర్చలో ఎస్టీ, ఎస్టీ నియోజకవర్గాల అంశం తెరపైకి వచ్చింది. అందుకే కమలం ఆపరేషన్‌ ప్రారంభించిందట. ఇంకా ఎన్నికలకు సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే ఆయా నియోజకవర్గాలల్లో బలమైన దళిత, గిరిజన, ఆదివాసీ నాయకత్వాన్ని తయారుచేసుకునేందుకు బిజెపి రంగం సిద్ధం చేసుకుంటోందట. అది ఎంతవరకు ఫలిస్తుందో ఎంతమంది దళిత, గిరిజన నేతలు కాషాయ కండువా కప్పుకుంటారో చూడాలి.

Exit mobile version