Site icon NTV Telugu

Off The Record: కాంగ్రెస్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకం ఆలస్యం వెనుక మర్మం?

T Congress

T Congress

Off The Record: అది అంతేనా… ఇక వదిలేశారా..? నడుస్తోంది కదా అని నడిపించేస్తున్నారా..? లేక ఎవరికి ఇవ్వాలో అర్ధంగాక గందరగోళంలో ఉన్నారా? వర్కింగ్‌ ప్రెసిడెంట్స్‌ విషయమై తెలంగాణ కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది? నియామకం ఎందుకు ఆలస్యం అవుతోంది?

Read Also: Off The Record: దశాబ్దం తర్వాత ఆ బడా నేతలను ప్రోటోకాలే కలిపిందా?

పోస్ట్‌ ఏదైనా… ప్రోగ్రామ్‌ ఏదైనా సరే… కాంగ్రెస్‌ పార్టీలో వాయిదాల పద్ధతి మాత్రం కామన్‌ అన్నట్టుగా ఉంది. పార్టీ పదవుల నుంచి మొదలుకుని… నామినేటెడ్ పోస్ట్‌ల దాకా… అన్నిటి విషయాల్లో ఇదే తంతు నడుస్తోంది. అసలు పీసీసీ కమిటీ వేయడానికే ఏడాది పట్టింది. దాన్ని కూడా పూర్తిస్థాయిలో వేయకుండానే ముగించేశారు. కమిటీలో ఇంకా భర్తీ చేయని పదవులు ఉన్నట్టో .. లేనట్టో కూడా ఎవరికీ అంతు చిక్కదు. అదిగో ఇదిగో అంటూ టైమ్ పాస్ చేస్తున్నారు తప్ప ఎక్కడా క్లారిటీ ఇవ్వడంలేదని మండి పడుతున్నారు ఆశావహులు. కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్స్‌ నియామకంపై అప్పట్లో చాలా హడావుడి జరిగింది. అప్పుడే జాబితా విడుదల అవుతుందనేలా షో చేశారు.

Read Also: Deva Katta: ఆదికి ఆయన కథకి ఓ బిగ్ సెల్యూట్!

అయితే, పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి… ఇలా అగ్రనేతలంతా హస్తినలో కుస్తీ పట్టారు. కానీ ఇప్పటి వరకు జాబితా బయటకు రాలేదు. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్ లను నియమించింది పార్టీ. కానీ మహేష్ గౌడ్‌ని పిసిసి చీఫ్ గా నియమించిన తరువాత ఏడాదికి ప్రధాన కార్యదర్శి… ఉపాధ్యక్ష పదవులు భర్తీ అయ్యాయి. కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులకు మాత్రం ఇప్పటిదాకా అతీగతీ లేదు. సామాజిక సమీకరణల లెక్కలు వేస్తూ…. ఎస్సీ అయితే మాదిగలకు ఇవ్వాలని… ఓసీ కోటాలో రెడ్డికి ఒకటి, మైనార్టీలకు ఒకటి, ఎస్టీలకు ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ అంటూ లెక్కలేశారు. మాజీ MLA సంపత్, ఎస్టీ విభాగం చైర్మన్ బెల్లయ్య నాయక్ పేర్లపై చర్చించారు కూడా.

Read Also: Prabhas-JR NTR-Ram Charan : ప్రభాస్, రామ్ చరణ్‌, ఎన్టీఆర్.. బాలీవుడ్ డ్యామేజ్..

కాగా, మైనార్టీ నుండి గట్టిగా ఆశిస్తున్న ఓ నాయకుడి పేరు పై విస్తృత చర్చ జరిగింది. కానీ ఇన్ఛార్జ్‌ స్థాయిలో అడ్డుకట్ట వేశారనే ప్రచారం సాగింది. ఇంత జరిగినా… ఇప్పటికీ ఒక నిర్ణయం తీసుకోకపోవడం ఏంటన్నది బిగ్‌ క్వశ్చన్‌. నలుగురు కీలక నాయకులకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు ఇవ్వడానికి పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నారా..? లేదంటే అసలు ఆ పదవులు ఎందుకులే అని వదిలేశారా అంటూ ఇప్పుడు కొత్తగా అనుమానాలు వస్తున్నాయట పార్టీ వర్గాలకు. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవుల భర్తీ అన్న సంగతిని పార్టీ పెద్దలు మర్చిపోయారన్న టాక్ వినిపిస్తోంది. వర్కింగ్ ప్రెసిడెంట్స్‌తో పాటు… ప్రచార కమిటీ చైర్మన్ నియామకం కూడా అలాగే పెండింగ్ లో ఉంది. ఇలా పార్టీలో పదవుల భర్తీ లాంటి అంశాన్ని అధిష్టానం పక్కన పెట్టిందా..? రాష్ట్ర నాయకులు తమకు పదవులు వచ్చాయి కదా.. అని మిగిలిన వారి గురించి ఆలోచించడం మానేశారా అన్న చర్చ జరుగుతోంది. పదవులు భర్తీ చేయకుండా ఖాళీగా పెట్టుకుంటే ప్రయోజనం ఏముందన్నది నాయకుల ప్రశ్న.

Exit mobile version