Off The Record: పెద్ద హీరో కొత్త సినిమా రిలీజవుతోందంటే చాలు… ఆ ఎమ్మెల్యేకి వణుకు పుడుతోందట. నా ప్రమేయం ఉన్నా… లేకున్నా… ఏదోఒక గొడవ కొంప మీదికి వస్తోందంటూ… తల పట్టుకుంటున్నారట ఆ శాసనసభ్యుడు. జూనియర్ ఎన్టీఆర్, పవన్‌కళ్యాణ్ మధ్య నలిగిపోతున్నానని తెల ఫీలైపోతున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆయనకు, హీరోలకు ఉన్న సంబంధం ఏంటి?
Read Also: Kalvakuntla Kavitha : మరోసారి కవిత హాట్ కామెంట్స్.. కొందరిలో స్వార్థం ప్రవేశించిందంటూ
కూటమి ఎమ్మెల్యేలు కొందరు కేరాఫ్ కాంట్రవర్సీ అవుతున్నారు. ఇందులో సీనియర్స్, సూపర్ సీనియర్స్ సంగతి ఎలా ఉన్నా… కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఆ విషయంలో తగ్గేదేలే అంటుండటంతో… పార్టీలకు తలనొప్పులు పెరుగుతున్నాయి. అలాంటి వాళ్ళలో ఫస్ట్లైన్లో ఉంటున్నారు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. రాప్తాడు మండలం బండమీద పల్లికి చెందిన దగ్గుపాటి.. తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి కీలకంగా ఉండేవారు. ఎంపీపీగా గెలిచారు. అయినా… 2024 ఎన్నికలకు రెండు నెలల ముందు నుంచి మాత్రమే ఆయన పేరు బాగా తెరపైకి వచ్చింది. టీడీపీ అధిష్టానం అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వడం, కూటమి వేవ్‌లో గెలిచేయడం చకచకా జరిగిపోయాయి. అయితే.. గెలిచాకే దగ్గుపాటికి అసలైన సవాళ్ళు ఎదురవుతున్నాయి. మద్యం దుకాణాలు, సివిల్ మ్యాటర్లు, భూ పంచాయతీలు.. ఇలా ఒకటేంటి, అన్ని రకాల దందాల్లో ఆయన అనుచరులు తలదూర్చి దొరికిన కాడికి దోచుకుంటున్నారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది.
Read Also: Kantara 1 : కాంతార 1 ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన టీమ్
ఎమ్మెల్యే అనుచరులు పలువురి పేర్లు బయటికి వచ్చాయి కూడా. అదే సమయంలో ఎమ్మెల్యే మాట్లాడిన పలు ఆడియో కాల్స్ వెలుగు చూసి కలకలం రేపాయి. మరీ ముఖ్యంగా ఒకటైతే… కేవలం అనంతపురం నియోజకవర్గాన్నే కాకుండా మొత్తం రాష్ట్రాన్నే ఒక కుదుపు కుదిపేసింది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమా రిలీజ్ సందర్భంగా లీకైన ఆడియో కాల్ సంచలనం రేపింది. జూనియర్ ఎన్టీఆర్‌ని కించపరిచేలా ఒక అభిమానితో ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడిన మాటలు బయటికి లీకై… రచ్చకు దారితీశాయి. వాటిని ఎమ్మెల్యే దగ్గుబాటి వెంటనే ఖండించినా… ఈ వివాదం మొత్తం రెండు రాష్ట్రాల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు కోపం తెప్పించింది. ఎన్టీఆర్ అభిమానులు దగ్గుపాటి ఇంటిని ముట్టడించారు. దాదాపు నెలరోజుల పాటు ఆ వివాదం నడిచింది. ఇక తాజాగా వివాదం డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌కు సంబంధించినది. పవన్ నటించిన ఓజీ సినిమా విషయంలో కూడా వివాదంలో ఇరుక్కున్నారు ఎమ్మెల్యే దగ్గుపాటి. ఆయన పేరుతో… హీరో పవన్‌కు ఎక్స్‌లో శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా ఈ సినిమా సూపర్ హిట్ అంటూ కామెంట్స్ వచ్చాయి. అదే సందర్భంలో అనంతపురం నగరంలోని అన్ని థియేటర్లు మన అదుపులోనే ఉన్నాయి, అన్నింటిలోనూ పవన్ కళ్యాణ్ సినిమాలు ఆడించాలంటూ అదే ఎక్స్ ఖాతా నుంచి మెసేజ్‌లు వచ్చాయి. దాంతో మొన్నటికి మొన్న ఎన్టీఆర్ సినిమాను వ్యతిరేకించడం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాకు అనుకూలంగా కామెంట్స్ చేయడం ఏంటంటూ… వివాదం మొదలైంది.
Read Also: Off The Record: రాజోలులో రసవత్తరంగా రాజకీయం.. టీడీపీ ఇంచార్జిగా వైసీపీ ఇంచార్జి కుమార్తె
అందునా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కావడంతో దీనిపై రివర్స్ ట్రోలింగ్ మొదలైంది. ఈ విషయం తెలిసి ఒక్కసారిగా కంగుతిన్నారట ఎమ్మెల్యే. తనకు బీభత్సంమైన డ్యామేజ్ జరుగుతోందని గుర్తించి తానసలుఎలాంటి ట్వీట్స్ చేయలేదని క్లారిటీ ఇచ్చారు. వెంటనే ఆయన సోషల్ మీడియా టీం ఈ విషయం మీద పోలీసు కంప్లయింట్ కూడా ఇచ్చింది. ఎమ్మెల్యే పేరుతో ఎవరో.. ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశారని, ఆ ఫేక్ నుంచే ఇలాంటి మెసేజ్‌లు పెడుతున్నారన్నది ఫిర్యాదు సారాంశం. ఇలాంటి మెసేజ్‌లను ఎవరూ నమ్మవద్దని ఆయన పదేపదే చెప్పుకోవాల్సి వచ్చింది. ఈ విషయంలో ఎమ్మెల్యే ప్రమేయం లేకున్నా ఆయన ఇరుక్కున్నారన్నది సన్నిహితుల మాట. ఇటు ఎన్టీఆర్ సినిమాకు నెగిటివ్, అటు పవన్ కళ్యాణ్ సినిమాకు పాజిటివ్ కామెంట్స్‌తో… అనంతపురం ఎమ్మెల్యేకు సినిమా గండం పొంచి ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఆయన ప్రమేయం ఉందా లేదా అన్న చర్చను పక్కనపెడితే… పెద్ద హీరోల సినిమా విడుదలైన ప్రతిసారి ఆయనకు మాత్రం తిప్పలు తప్పడం లేదని చెప్పుకుంటున్నారు.