Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Amaravati Farmers Raise Concerns Crda Issues Capital Status Political Tension

Off The Record: కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమరావతి రైతుల స్వరం పెరుగుతోందా..?

Published Date :November 20, 2025 , 10:02 pm
By RAMAKRISHNA KENCHE
Off The Record: కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమరావతి రైతుల స్వరం పెరుగుతోందా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Off The Record: అమరావతి రైతుల గురించి కూటమి పార్టీల మధ్య కొత్త చర్చలు నడుస్తున్నాయి. ఇన్నాళ్ళు మనోళ్ళు అనుకున్న రైతుల వాయిస్‌ మెల్లిగా పెరుగుతుండటం ప్రభుత్వ పెద్దల్ని కంగారు పెడుతున్నట్టు తెలుస్తోంది. రాజధానిలోని కొందరు రైతులు తమ సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదంటూ… ఏకంగా ముఖ్యమంత్రినే ప్రశ్నించారు. కొంత కాలంగా రాజధాని ప్రాంతంలో తాము పడుతున్న ఇబ్బందులను సీఎం దృష్టికి తీసుకు వచ్చారు. తమను సీఆర్డీఏ అధికారులు వేధిస్తున్నారని, సమస్యలపై వెంటనే దృష్టి పెట్టాలని డిమాండ్‌ చేశారు. అలాగే… అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ… గెజిట్ వచ్చేలా చూడాలని, అప్పుడే తమకు భరోసా ఉంటుందని కూడా సీఎం చంద్రబాబుకు వివరించారు రైతులు. తమకు ప్లాట్ల కేటాయింపు ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలన్నది వాళ్ళ డిమాండ్‌. దానికి సంబంధించి ఇప్పటికే సీఆర్డీఏ అధికారులు రైతులతో చర్చించారు. త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని భరోసా కూడా ఇచ్చారు. అంతవరకు బాగానే ఉన్నా.. పరిస్థితి ఇలాగే ఉంటే.. బాగా బ్యాడ్‌ అయిపోతామన్న చర్చ ప్రభుత్వ పెద్దల మధ్య కూడా మొదలైందట. రైతుల సమస్యలు ఇలాగే ఉంటే.. వాళ్ళు ఇంకా వాయిస్‌ పెంచితే….. కూటమి ప్రభుత్వానికి నష్టం కలుగుతుందన్న మాటలు గట్టిగానే వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వం అమరావతి రైతులను పట్టించు కోలేదంటూ ఇన్నాళ్ళు చెప్పామని, ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా… ఎక్కడ వేసి గొంగళి అక్కడే అన్నట్టుగా ఉండటం ఇబ్బందికరమైన పరిణామమేనని అంటున్నారు అధికార పార్టీ నేతలు కొందరు. రాజధాని రైతుల విషయంలో ఎలాంటి పురోగతి లేకపోతే…ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయన్న అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో బలపడుతోంది. రాజధాని రైతులు గతంలో దీక్షలు చేసినప్పుడు ఆదుకుంటామని, అన్ని సమస్యలు తీరుస్తామని ఇచ్చిన హామీల్ని గుర్తు చేసుకుంటున్నారు కూటమి నేతలు.

READ MORE: Adam Mosseri: ఈ నైపుణ్యాలతో కోట్ల విలువైన ఉద్యోగాలు ..

రైతులు ప్రస్తుతానికైతే… మాట్లాడ్డం, ప్రశ్నించడం వరకే పరిమితం అయ్యారని, ఇది ఇంకా ముదిరి వాళ్ళు రోడ్డెక్కే పరిస్థితి వస్తే మాత్రం…తలెత్తుకోవడం కష్టమన్న అభిప్రాయం ఉందట కూటమి వర్గాల్లో. అమరావతి నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని… ఆ భూమి ఇచ్చిన రైతుల సమస్యలపై దృష్టి పెట్టకపోతే ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చినట్టేనన్నది ప్రస్తుతం కూటమి వర్గాల్లో జరుగుతున్న చర్చ. గత ప్రభుత్వం అమరావతికి వ్యతిరేకమంటూ ప్రచారం చేశామని, ఇప్పుడు రైతుల నుంచి ఇబ్బందులు వస్తే మనం సమాధానం చెప్పుకోవడం కూడా కష్టమని అంటున్నారట అధికార పక్షంలోని ఎక్కువమంది నాయకులు. ఇన్ని రకాల ఈక్వేషన్స్‌ని దృష్టిలో ఉంచుకుని వీలైనంత త్వరగా… రైతుల సమస్యల్ని పరిష్కరించాలని నిర్ణయించినట్టు సమాచారం. తమకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్స్‌లో వేసిన సరిహద్దు రాళ్ళు వివిధ కారణాలతో తొలగిపోయాయంటూ… మంత్రి నారాయణ దృష్టికి తీసుకువచ్చారు రైతులు. మంత్రి వెంటనే రియాక్ట్‌ అవడంతో…. వచ్చే నెల 15 నుంచి హద్దు రాళ్ళ సమస్యను పరిష్కరించే ప్రోగ్రాం పెట్టబోతున్నారట సీఆర్డీఏ అధికారులు. మూడు నెలల్లోగా సరిహద్దు రాళ్ళు వేయడం పూర్తి చేయాలని డెడ్‌లైన్‌ పెట్టుకున్నట్టు తెలిసింది. మొత్తంగా…. అమరావతి రైతుల సమస్యలు పరిష్కారం కాకపోతే ఇబ్బందులు తప్పవని గ్రహించి ప్రభుత్వం… ఇప్పుడు ఫుల్‌ ఫోకస్‌ పెట్టినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా… జనానికి ముఖం చూపించలేమన్న అభిప్రాయం ఉందట..

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • amaravati farmers
  • Amaravati plot allocation
  • Amaravati protests
  • Andhra Pradesh Capital
  • AP coalition govt tensions

తాజావార్తలు

  • MBNR CHINNARI MURDER: బసిరెడ్డిపల్లిలో విషాదం.. కేవలం ఐదేళ్ల వయసున్న చిన్నారిని అత్యంత దారుణంగా..

  • Bank Account: అంతా మ్యూల్ మాయ.. 3 నెలల్లోనే రూ.31 కోట్లు..

  • HYD AIRPORT GANJAI: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రూ. 9 కోట్ల గంజాయి సీజ్!

  • HYD SKLM SUICIDES: పాపం ఈ భర్తకి అంత కష్టమేం వచ్చిందో.. ఇంట్లో నుంచి ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకు వెళ్లి..

  • Catering: క్యాటరింగ్ బిజినెస్ మాటున పెద్ద కథే నడిపిస్తున్నాడుగా..

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions