Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Adilabad Trs Group Politics

Adilabad: అక్కడి ఎమ్మెల్యేలకు నిద్ర లేకుండా చేస్తున్న అసమ్మతి

Published Date :September 19, 2022 , 11:05 am
By Premchand Chowdary
Adilabad: అక్కడి ఎమ్మెల్యేలకు నిద్ర లేకుండా చేస్తున్న అసమ్మతి
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆ ఉమ్మడి జిల్లా అధికారపార్టీలో గ్రూపుల గోల ఎక్కువైందా? ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా స్వరాలు పెరుగుతున్నాయా? నియోజకవర్గాల్లో ఆధిపత్యం కోసం నేతలు చేస్తున్న ప్రయత్నాలు రచ్చ రచ్చ అవుతున్నాయా? ఇంతకీ ఏంటా జిల్లా? లెట్స్‌ వాచ్‌..!

ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో పది నియోజకవర్గాలుంటే అందులో సగానికిపైగా సెగ్మెంట్లలో టీఆర్ఎస్‌కు అసమ్మతి సెగ ఉంది. 2018 నుంచీ ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ.. ఎన్నికలు సమీపించే కొద్దీ వేరు కుంపట్లు జోరందుకున్నాయి. నిన్న మొన్నటి వరకు ఎమ్మెల్యే వెంట తిరిగిన వాళ్లు ఇప్పుడు వైరిపక్షాలుగా మారిపోతున్నారు. చూస్తుండగానే వ్యతిరేక గ్రూపులు..రెండు.. మూడు, నాలుగు అని సంఖ్య పెరిగిపోతోంది. ముఠాలు కట్టి ఆగిపోకుండా.. జట్టుగా టీఆర్ఎస్‌ అధిష్ఠానం దగ్గరకు వెళ్లడం.. స్థానిక ఎమ్మెల్యేలకు నిద్ర లేకుండా చేస్తోంది.

ఇటీవల బోథ్, మంచిర్యాల, ఖానాపూర్, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నాయకులు కొందరు హైదరాబాద్‌ వెళ్లి పార్టీ పెద్దలను కలిసి వచ్చారట. వీరిలో కొందరు రహస్యంగా భేటీ అయినట్టు ప్రచారం జరుగుతోంది. సోనాల మండలం కోసం బోథ్‌ నాయకులు హైదరాబాద్‌ వెళ్లారని చెబుతున్నా.. జడ్పీ ఛైర్మన్‌, మాజీ ఎంపీ, ఓ ఎంపీపీ ఆ శిబిరంలో ఉండటంతో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగానే వాళ్లంతా జట్టు కట్టారని అనుమానిస్తున్నారట. తమకు వ్యతిరేకంగా అధిష్ఠానానికి ఏం చెప్పారు? ఎలాంటి ఫిర్యాదులు చేశారో అని ఆరా తీస్తున్నట్టు సమాచారం.

బోథ్‌లో ఇటీవల పెన్షన్‌ కార్డుల పంపిణీ రచ్చ అయ్యింది. ఒకసారి ఇచ్చిన కార్డులను వెనక్కి తీసుకుని మరో నేత లబ్ధిదారులకు అందజేయడం దుమారం రేపింది. ఇక్కడ అసమ్మతి నేతల అడుగులు ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావ్‌కు మింగుడు పడటం లేదట. అయితే అసమ్మతి వర్గానికి పార్టీలో ఎవరు వెన్నుదన్నుగా ఉన్నారు? ఎందుకు తనపై పగపట్టారో తెలియక ఆవేదన చెందుతున్నారట ఎమ్మెల్యే.

ఖానాపూర్‌లో పార్టీ నేత ఒకరు, ఓ మాజీ ఎంపీ, పొరుగు జిల్లా ఎమ్మెల్యే, జిల్లాకు చెందిన మంత్రితో కలిసి పార్టీ పెద్దలతో మాట్లాడి వచ్చారట. ఆ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. నియోజకవర్గంలో పార్టీ భవిష్యత్‌ కోసమే పార్టీ పెద్దలతో సమావేశం అయినట్టు చెబుతున్నా.. దాల్‌ మే కుచ్‌ కాలాహై అని ఖానాపూర్‌ ఎమ్మెల్యే అనుమానిస్తున్నారట. మంచిర్యాలలో సైతం మాజీ ఎమ్మెల్యే ఒకరు ఇటీవల పార్టీ పెద్దలను కలిసి మాట్లాడి వచ్చారట. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో శాసనసభ ప్రాంగణంలోనే ఆయన హల్చల్‌ చేశారట. అసెంబ్లీ ప్రాంగణంలో మాజీని చూడగానే సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు ఫ్యూజులు పోయినట్టు టాక్‌.

చెన్నూరులో మాజీ ఎమ్మెల్యే ఓదెలు, జడ్పీ ఛైర్మన్‌ భాగ్యలక్ష్మి టీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పేశారు. ఇక్కడ బలమైన నాయకులు పార్టీకి దూరం కావడానికి ఎమ్మెల్యే వైఖరే కారణమని అనుమానిస్తున్నారట. ఓ మాజీ ఎమ్మెల్సీ సైతం తనకు పదవి రాకుండా ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని మండిపడుతున్నారట. మంచిర్యాల, ఆసిఫాబాద్‌లోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. ఎన్నికలు దగ్గర పడేకొద్దీ గేర్‌ మార్చే పనిలో ఉన్నారు నాయకులు. లాభం లేదని భావించిన ఎమ్మెల్యేలు రివర్స్‌ అటాక్‌ మొదలు పెట్టినా.. రేపటిరోజున పరిణామాలు ఎలా ఉంటాయో అర్థం కావడం లేదట. ఏ శాసనసభ్యుడిని కదిపినా.. అసమ్మతి వర్గం ప్రస్తావన చేసినా ఉలిక్కి పడుతున్నట్టు చెబుతున్నారు. మరి.. గ్రూపు గులాబీలకు అధిష్ఠానం చెక్‌ పెడుతుందో లేదో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Adilabad
  • adilabad trs politics
  • Bhagya Lakshmi
  • Odelu
  • Soyam Bapu Rao

తాజావార్తలు

  • Off The Record : శైలజానాథ్ రాకతో టికెట్ కథ మళ్లీ మొదటికొచ్చిందా? లెక్కలు మారితే మళ్లీ చిక్కులేనని టెన్షన్

  • OTR: జనసేన నేత ఇల్లు కూల్చివేతతో రాజకీయ ప్రకంపనలు.. పేర్ని నాని ఎంట్రీతో కూటమిలో రచ్చ!

  • Central Govt: మీకు ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసా..? అయితే రూ.10 వేలు మీకే..

  • OTR: ఓల్డేజ్ హోంగా బీఆర్ఎస్.. అప్పుడే గులాబీ తోటలో ప్రకంపనలు!

  • Madhapur job scam : సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరిట భారీ మోసం..రూ.5 కోట్లు బురిడీ..

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions