Off The record: షార్ట్ కట్‌లో కాషాయ కండువా కప్పుకున్న ఆ లీడర్ మిత్ర పక్షం టీడీపీకే మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారా? బీజేపీ ఆయనకు పెద్ద పదవి ఇస్తే… తెలుగుదేశం లీడర్స్‌కి ఎందుకు మండుతోంది? ఎంక్వైరీలతో పాత, కొత్త లెక్కలు తేల్చేసుకుందామని అనుకుంటే సీన్ రివర్స్ అయ్యింది ఎక్కడ? ఎవరా లీడర్? ఏంటా కడుపు మంట కహానీ?
Read Also: Drugs Mafia: డ్రగ్స్, గంజాయి మత్తులో తూగుతున్న కాలేజీ పోరగాళ్లు.. 50 మందికి పాజిటివ్!
అడారి ఆనంద్ కుమార్.. ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు. కాషాయ కండువా కప్పుకున్న ఆరు నెలల్లోనే… అది కూడా ఎలాంటి సంఘ్ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా రాష్ట్ర స్థాయి కీలక పదవి లభించడం కమలదళంలో కొత్త ట్రెండ్. ఇప్పుడీ పరిణామం బీజేపీ కంటే టీడీపీ వర్గాల్లోనే ఆసక్తికరమైన చర్చకు తెరతీసింది. కారణం, రాజకీయంగా చెక్ పెట్టేందుకు జరిగిన ప్రయత్నాలను లాబీయింగ్ ద్వారా తిప్పికొట్టడంలో ఆనంద్ సక్సెస్ అవ్వడమేనంటున్నారు. టీడీపీతో ఆడారి ఫ్యామిలీది మూడున్నర దశాబ్దాల అనుబంధం. ఉమ్మడి విశాఖ జిల్లా రాజకీయాలు విజయ విశాఖ కో ఆపరేటివ్ డెయిరీ చుట్టూ తిరుగుతుంటాయి. ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఎంపిక చేసేది టీడీపీ హైకమాండ్ అయినా తెరవెనుక వ్యూహాలను అమలు చేసి పార్టీకి విజయాలను అందించడంలో విశాఖ డెయిరీ మాజీ చైర్మన్ అడారి తులసీరావుది కింగ్ మేకర్ ఇమేజ్. మాడుగుల, చోడవరం, పెందుర్తి, యలమంచిలి, అనకాపల్లి నియోజకవర్గాల్లో రైతులు, పాల డెయిరీ సంఘాలతో ఉన్న నెట్ వర్క్ కారణంగా… అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్దేశించే స్థాయిలో ఆయన లాబీయింగ్ చేసేవారనేది టీడీపీ వర్గాల టాక్. ఈ కారణంతోనే డెయిరీ వ్యవహారాలపై వచ్చిన ఆరోపణల మీద 2004 – 2009 మధ్య అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ నిర్వహించింది.
Read Also: Rahul Gandhi : ఓటు చోరీ కోసమే ఆ కొత్త చట్టాన్ని బీజేపీ తీసుకొచ్చింది
అయితే, ఆ నివేదికలు., యా జమాన్యంపై తీసుకున్న చర్యలు బహిర్గతం కాకపోగా అసలు చర్చల్లోకి రావడం మానేసి చాలా కాలం అయింది. ఈ పరిస్థితుల్లో.. 2019ముందు తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ పాలిటిక్స్ ప్రారంభించారు తులసీరావు కుమారుడు అడారి ఆనంద్ కుమార్. తండ్రి కేవలం తెర వెనక రాజకీయం చేయగా.. ఆనంద్ మాత్రం ఆన్ స్క్రీన్ ఎంటరైపోయారు. 2019 ఎన్నికల్లో అనకాపల్లి లోక్‌సభ సీట్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారాయన. రాజకీయ కుటుంబం, సామాజిక, ఆర్థికంగా పటిష్టంగా ఉండటంతో ఆనంద్‌పై ఆఖరి నిముషంలో అభ్యర్థిని మార్చి కొత్త స్కెచ్ వేసి సక్సెస్ అయింది వైసీపీ. అనూహ్యంగా గవర సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ సత్యవతి అభ్యర్థిగా నిలిపిన ఫ్యాన్ పార్టీ భారీ విజయం నమోదు చేసింది. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక కుటుంబ పాలనగా వున్న విజయ విశాఖ డెయిరీపై పాలకవర్గం మీద దృష్టి సారించిందనే ప్రచారం జరిగింది.
Read Also: Crime News: కుండలో బంగారు నాణేలు దొరికాయని.. రూ.20 లక్షలు టోకరా! చివరికి ఏమైందంటే?
ఆ ప్రచారం నడుమే.. ఎవ్వరూ ఊహించని విధంగా.. వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు ఆనంద్. తండ్రి టీడీపీకి స్టాండ్ అయితే కుమారుడు వైసీపీలో యాక్టివ్ పాలిటిక్స్ మొదలెట్టారు. గ్రేటర్ విశాఖపై పట్టు బిగించడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ.. 2024 ఎన్నికల్లో విశాఖ పశ్చిమ నియోజకర్గంపై ఫోకస్ పెట్టింది. ఆ క్రమంలో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గణబాబుపై పోటీ చేసిన ఆనంద్.. బలమైన అభ్యర్థిగా ప్రొజెక్ట్ అవ్వడంతో ఫలితాలు వచ్చే వరకు ఉత్కంఠ కొనసాగింది. కానీ, కూటమి వేవ్, వైసీపీ అంతర్గత రాజకీయాలు కారణంగా ఆనంద్ ఓడిపోయినట్టు చెప్పుకుంటారు. దీంతో ఆయన యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరం అవుతారని, వ్యాపారాలపైనే దృష్టి సారిస్తారనే ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే కొన్ని నెలలు కామ్‌గా ఉన్నారు అడారి. అదే సమయంలోలో కూటమి పార్టీలు కీలక ఆరోపణలను తెరపైకి తెచ్చాయి.
Read Also: Fake Liquor Labels: మీరు తాగుతున్న మద్యం క్వాలిటీనేనా? అసలు మ్యాటరేంటంటే?
విశాఖ డెయిరీ నిధులు గోల్ మాల్ అయ్యాయని, కుటుంబ పాలన కారణంగా నష్టం జరుగుతోందని, పాడి రైతుల కష్టానికి ఫలితం లేకుండా పోతోందని ఆరోపించింది టీడీపీ. డెయిరీ యాజమాన్యం ప్రభుత్వ భూమిని కలిపేసుకుందంటూ జనసేన మరో విషయాన్ని బయటపెట్టింది. ఈ పరిణామాలన్నిటి మధ్య… విచారణ కోసం శాసనసభ లో పట్టుబట్టింది టీడీపీ. దీంతో విచారణకు హౌస్ కమిటీని నియమించారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నేతృత్వంలోని కమిటీ క్షేత్ర స్థాయి పర్యటన జరిపి.. అసలు వచ్చిన ఫిర్యాదుల కంటే ఎక్కువ, ఇంకా తీవ్రమైన అవకతవకలు జరిగినట్టు అభిప్రాయపడింది. లెక్కలు తీసేందుకు సాంకేతిక సహకారం కూడా అవసరమని భావించింది. దీంతో విశాఖ డెయిరీలో అడారి ఫ్యామిలీ హవా ముగిసినట్టేనన్న ప్రచారం మొదలైంది. కీలకమైన డైరెక్టర్లు టీడీపీలోకి జంప్ అయిపోవడంతో డెయిరీ పాలిటిక్స్ ఆసక్తికరంగా కనిపించాయి.
Read Also: Lord Ganesh: 4,000 మంది విద్యార్థులు, 5,000 దీపాలతో అద్భుతం.. వైరల్ వీడియో
ఈ వ్యూహాలను ఆనంద్ ఎలా ఎదుర్కొంటారన్న చర్చ జరుగుతుండగానే మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారాయన. అనూహ్యంగా బీజేపీ తీర్థం పుచ్చేసుకోవడం…..దానికి పార్టీ ముఖ్య నాయకత్వం నుంచి పూర్తిస్థాయి సానుకూలత వ్యక్తం కావడం ఆసక్తికర పరిణామం. కేవలం డెయిరీ మీద పట్టు నిలబెట్టుకోవడం కోసమే ఆనంద్ సేఫ్ గేమ్ ఆడారన్న అభిప్రాయం వ్యక్తం అయింది. అదలా ఉండగానే… ఇప్పుడు అడారికి రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్ష పీఠం లభించింది. ఇది కూటమిలో ప్రధాన భాగస్వామిగా వున్న తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఊహించనిది. ఇప్పుడు కూడా టీడీపీ నాయకులు అడారి అవినీతి గురించి బహిరంగంగా మాట్లాడతారా? మిత్రపక్షం రాష్ట్ర ఉపాధ్యక్షుడి మీద విచారణ కోరతారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు హౌస్ కమిటీ విచారణ ఎంత సమర్ధవంతగా ముందుకు వెళుతుందన్నది బిగ్ క్వశ్చన్. అడారి ఎత్తును టీడీపీ చిత్తు చేస్తుందా? లేక మన కూటమిలోకి వచ్చేశాడు కదా అని సర్దుకుపోతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
