Tollywood Exclusive: కోడి ముందా, గుడ్డు ముందా అంటే గుండె ఆగాల్సిందే!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన, అంతకంటే ఎక్కువగా ఆందోళనకరమైన చర్చ నడుస్తోంది. అదే ‘రెవెన్యూ షేరింగ్’. ఒకప్పుడు ఊరువాడ ఏకమై ఈలలు, గోలలతో కళకళలాడిన సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. ఈ తరుణంలో నిర్మాతలు, థియేటర్ యాజమాన్యాల మధ్య మొదలైన వ్యవహారం ఇప్పుడు ‘కోడి ముందా? గుడ్డు ముందా?’ అనే తరహా పంచాయితీకి దారితీసింది.
నిన్న తెలంగాణ ప్రాంతానికి చెందిన కొంతమంది ఎగ్జిబిటర్లు మీడియా ముందుకు వచ్చారు. ఇక మీదట రెవెన్యూ షేరింగ్ అంటే పర్సంటేజ్ విధానంలోనే సినిమాలు ఆడిస్తామని, అద్దె ప్రాతిపదికన సినిమాలు రిలీజ్ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇక ఈరోజు కొంతమంది యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తరఫున మీడియా ముందుకు వచ్చి తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ వ్యవహారంలో, పరిశుభ్రత అంశం చుట్టూ ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. నిర్మాతల వైపు నుండి వినిపిస్తున్న ప్రశ్నలు చాలా లాజికల్ గా ఉన్నాయి.
Also Read
- NTA Scam Explained: పరీక్ష పెట్టడం కూడా చేతకాదా? భగ్గుమన్న విద్యార్థి లోకం!
- Norovirus vs Hantavirus: నొప్పులు, వాంతులు, అలసట, తలనొప్పి.. కరోనా, నోరో కంటే డేంజర్? దడపుట్టిస్తోన్న హాంటా..!
- Weather News: ఆస్ట్రేలియా నుంచి గుడ్‌న్యూస్..ఇండియాలో వర్షాలు..!
- Vijay: పాపం విజయ్... రచ్చ గెలిచి ఇంట గెల్వలేకపోయాడా??
చాలా సింగిల్ స్క్రీన్లు నేడు కుప్పతొట్టిని తలపిస్తున్నాయి. కనీసం కూర్చునే సీట్లు సరిగ్గా లేవు, ఫ్యాన్లు తిరగవు, ఏసీల పరిస్థితి దారుణం. మల్టీప్లెక్స్‌లలో అద్భుతమైన సౌండ్ సిస్టమ్స్ వస్తుంటే, సింగిల్ స్క్రీన్లలో సౌండ్ క్వాలిటీ పడిపోయింది; ఇది సినిమా చూసే అనుభూతిని దెబ్బతీస్తోంది. టాయిలెట్లు శుభ్రంగా ఉండవు, సెక్యూరిటీ వ్యవస్థ అసలే లేదు. “ప్రేక్షకుడికి కనీస గౌరవం ఇవ్వని చోటికి జనం ఎలా వస్తారు? అలాంటి థియేటర్లకు మేము రెవెన్యూ షేరింగ్ ఎలా ఇస్తాం?” అన్నది నిర్మాతల వైపు నుంచి వినిపిస్తున్న, వినడానికి కాస్త కటువుగా ఉన్న ప్రశ్న.
మరోవైపు, ఎగ్జిబిటర్లు (థియేటర్ల యజమానులు) తమ కష్టాలను ఏకరువు పెడుతున్నారు. అయితే, వారి వాదనలోనూ వాస్తవం లేకపోలేదు. ఓటీటీల రాకతో థియేటర్లకు వచ్చే జనం తగ్గిపోయారు, మెయింటెనెన్స్ ఖర్చులు పెరిగిపోయాయి. థియేటర్లలో కొత్త సౌండ్ సిస్టమ్ పెట్టాలన్నా, సీట్లు మార్చాలన్నా కోట్లలో ఖర్చవుతుంది; ఆదాయం లేనిదే ఆ పెట్టుబడి ఎక్కడి నుండి వస్తుంది? “మాకు రెవెన్యూ షేరింగ్ ఇస్తేనే ఆ డబ్బుతో థియేటర్లను బాగు చేసుకోగలం. మాకు చేయూత ఇవ్వకుండా అభివృద్ధి కావాలంటే అది అసాధ్యం” అని వారు తెగేసి చెబుతున్నారు.
అయితే, ఈ వివాదంలో ఇద్దరిదీ సరైన వాదనే అయినప్పటికీ, ఇక్కడ ఒక ‘డెడ్ లాక్’ ఏర్పడింది. “థియేటర్లు బాగుపడే వరకు షేరింగ్ ఇచ్చేది లేదు” అని నిర్మాతలు, “షేరింగ్ ఇస్తే తప్ప థియేటర్లు బాగు చేయలేం” అని ఎగ్జిబిటర్లు భీష్మించుకుని కూర్చోవడం వల్ల నష్టపోయేది సినిమా పరిశ్రమ మాత్రమే. ప్రేక్షకులు ఇప్పటికే మల్టీప్లెక్స్‌లకు లేదా ఓటీటీలకు అలవాటు పడిపోతున్నారు; సింగిల్ స్క్రీన్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది.
ఈ పంచాయితీ తెగాలంటే మధ్యేమార్గం ఒక్కటే దారి. ఎగ్జిబిటర్లు చెబుతున్నట్టుగా ఇప్పటికిప్పుడు అమలు చేయడం కష్టమే కాబట్టి, ఇక మీదట ప్రారంభోత్సవాలు జరుపుకునే సినిమాల విషయంలో ఈ పర్సంటేజీ విధానాన్ని అమలు చేస్తే బాగుంటుంది. ఈలోపు నిర్మాతలు కూడా చేతనైనంత వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్ల అభివృద్ధికి తోడ్పడితే, ఈ అంశం కొంతవరకు మధ్య మార్గంగా ఉండే అవకాశం ఉంది. నిజానికి సింగిల్ స్క్రీన్ థియేటర్ అనేది సినిమాకు గుండెకాయ వంటిది; కేవలం వాదోపవాదాలతో కాలక్షేపం చేస్తే ఆ గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది. ఇగోలు పక్కన పెట్టి, ఇటు నిర్మాతలు, అటు ఎగ్జిబిటర్లు కలిసి అడుగు వేస్తేనే సామాన్య ప్రేక్షకుడికి మళ్ళీ ‘సింగిల్ స్క్రీన్’ సినిమా ఎక్స్పీరియన్స్ దక్కుతుంది. మరి ఈ పంచాయితీకి ఎప్పుడు శుభం కార్డు పడుతుందో చూడాలి!
తాజావార్తలు
-
Tollywood Exclusive: కోడి ముందా, గుడ్డు ముందా అంటే గుండె ఆగాల్సిందే!!
-
Karnataka: కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం.. పాఠశాలల్లో హిజాబ్, జంధ్యాలు ధరించేందుకు అనుమతి
-
Test Rankings: ICC టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల.. బ్యాటింగ్, బౌలింగ్, ఆల్ రౌండర్ల విభాగాల్లో దుమ్మురేపిన టీమిండియా..
-
Tollywood: పర్సంటేజీ ఇష్యూ.. శిరీష్ రెడ్డికి మైత్రి రవి స్ట్రాంగ్ కౌంటర్
-
India-Russia: సంక్షోభం వేళ భారత్‌కు రష్యా భరోసా..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!