Site icon NTV Telugu

Minister Sridhar Babu: అక్కడ 200 ఎకరాల్లో ఏఐ సిటీ.. కీలక విషయాలు బయటపెట్టిన మంత్రి శ్రీధర్ బాబు..

Sridhar Babu

Sridhar Babu

హైదరాబాద్‌లో 200 ఎకరాల్లో ఏఐ సిటీని నిర్మిస్తున్నామని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. పాడ్‌కాస్ట్ విత్ ఎన్టీవీ తెలుగు (Podcast With NTV Telugu)లో ఆయన ప్రభుత్వ విధానాలను వివరించారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా ఎనాలిటిక్స్ వంటి కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. మంత్రి వివరణ ఆయన మాటల్లోనే.. రాబోయే కాలంలో క్వాంటం కంప్యూటింగ్ కి సంబంధించిన అంశాలు కూడా దృష్టిలో పెట్టుకుని రెండో స్థానం నుంచి మొదటి స్థానానికి రావడానికి ముందుగా ఆలోచించి భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించేందుకు కృషి చేస్తున్నాం. ఐటీలో మనం మొదటి రాష్ట్రంగా ఎదగడానికి ఆస్కారం ఉంది. రాబోయే కాలంలో హైదరాబాద్‌ను ఏఐ గ్లోబల్ క్యాపిటల్‌గా తీర్చిదిద్దాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇంటర్ నేషనల్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రముఖులు, దిగ్గజాలను పిలిచి వారి అభిప్రాయాలను తీసుకుంటున్నాం. వారి అనుభవాలను స్వీకరించి ఏఐ సిటీని నిర్మాణం చేయాలని ఆలోచన చేసి 200 ఎకరాల స్థలంలో ఏఐ సిటీని నిర్మాణం చేయబోతున్నాం.

READ MORE: Crime News: మూడే రోజులు.. ఇంటి ఓనర్‌ను చంపేసిన పని మనీషి!

ఈ విధంగా ఒకటి తరువాత ఒకటి కొత్త టెక్నాలజీస్‌పై మనమే ముందుగా మన దగ్గర ఉన్నా 3 లక్షల మంది ఐటీ రంగ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలను కుంటున్నాం. ఏఐ స్కిల్ ఇక్కడే దొరికేలా చేయాలని ట్రై చేస్తున్నాం. ప్రపంచ స్థాయిలో మనమే ఆదర్శంగా ఉంటూ ఏఐ ప్రోడక్ట్స్ రావడానికి, సర్వీసెస్‌లో కూడా మొదటి స్థానంలో ఉండటానికి ప్రణాళికలు చేసుకుని ముందుకు వెళ్తున్నాం. ఈ రోజు ఉద్యోగాలు, పరిశ్రమలు, స్కూల్స్, ప్రైవేట్ రంగం ఇలా అన్నింటిలో ఏఐ విస్తరణ జరుగుతోంది. ప్రభుత్వం రంగంలో కూడా ఏఐని ఉపయోగించుకుని ముందుకు వెళితే ప్రొడక్టివిటీ, ఎఫిషియన్సీ పెరుగుతుంది. పౌరులకు కూడా సేవలు తొందరగా, క్వాలిటీగా అందించడానికి అవకాశం ఉంటుందని ఓ ప్రయత్నం చేస్తున్నాం. ఏఐ వస్తే ఉద్యోగాలు పోతాయి. కానీ.. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీకి అనుగుణంగా స్కిల్స్ నేర్చుకుంటే కొత్త ఉద్యోగాలు కూడా పుట్టుకొస్తాయి. అందుకే స్కిల్ యూనివర్సిటీ పెట్టి కొత్త వారికి శిక్షణతో పాటు ప్రస్తుతం పని చేస్తున్న వాళ్ల నైపుణ్యాలు పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్ర శ్రీధర్ బాబు వెల్లడించారు.

READ MORE: Crime News: మూడే రోజులు.. ఇంటి ఓనర్‌ను చంపేసిన పని మనీషి!

 

Exit mobile version