హైదరాబాద్‌లో 200 ఎకరాల్లో ఏఐ సిటీని నిర్మిస్తున్నామని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. పాడ్‌కాస్ట్ విత్ ఎన్టీవీ తెలుగు (Podcast With NTV Telugu)లో ఆయన ప్రభుత్వ విధానాలను వివరించారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా ఎనాలిటిక్స్ వంటి కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. మంత్రి వివరణ ఆయన మాటల్లోనే.. రాబోయే కాలంలో క్వాంటం కంప్యూటింగ్ కి సంబంధించిన అంశాలు కూడా దృష్టిలో పెట్టుకుని రెండో స్థానం నుంచి మొదటి స్థానానికి రావడానికి…
ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు జరిగే వేడుకల ఏర్పాట్లలో రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైంది. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి 9వ తేదీ వరకు జరిగే ఈ వేడుకల్లో అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఏపీ రాజధాని అమరావతి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) సిటీగా ఉండాలని, ఆ దిశగా ప్రణాళికలు రూపకల్పన చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. పురపాలక శాఖా మంత్రి నారాయణ, సీఆర్డీయే అధికారులతో సీఎం చంద్రబాబు సచివాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ స్పురణకు వచ్చేలా అమరావతి లోగోను ఆంగ్లంలో అమరావతి పేరులో మొదటి అక్షరం A, చివరి అక్షరం I అక్షరాలు కలిసి వచ్చేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ లోగో రూపొందించాలన్నారు.