రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వచ్చిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలుపెట్టింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరి నోటా ఇప్పుడు ఒకటే మాట వినిపిస్తోంది.. అదే ‘చరణ్ నటన’. పెద్ది సినిమా మొత్తానికి బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే అది కచ్చితంగా రామ్ చరణ్ యాక్టింగ్ మాత్రమేనని ఇన్ సైడ్ ఇన్ఫో. ఈ సినిమాతో రామ్ చరణ్ కెరీర్ గ్రాఫ్ పూర్తిగా మారిపోనుందని, యాక్టింగ్ కెరీర్‌ను ఇకపై ‘బిఫోర్ పెద్ది.. ఆఫ్టర్ పెద్ది’ అని చెప్పుకునే రేంజ్‌లో ఆయన పర్ఫార్మెన్స్ ఉందని అంటున్నారు. ఈ పాత్ర కోసం ఆయన మేకోవర్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ ప్రతి ఒక్కటి నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి. కేవలం స్క్రీన్ ప్రెజెన్స్‌తోనే కాకుండా, క్యారెక్టర్‌లోకి చరణ్ ఒదిగిపోయిన తీరు థియేటర్లలో ప్రేక్షకులను కట్టిపడేసే అవకాసం ఉందని అంటున్నారు.
సినిమా ఫస్టాఫ్ అంతా ఒక ఎత్తయితే, సెకండాఫ్ మరో ఎత్తు. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్‌లో రామ్ చరణ్ తన నటనతో థియేటర్లలో ఉన్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించారని అంటున్నారు. ఆ ఎమోషన్స్ ను పండించడంలో చరణ్ వన్-మ్యాన్ షో చేశారు. క్లిష్టమైన సన్నివేశాలలో ఆయన పలికించిన హావభావాలు, నటనలోని పరిణతి మెగా అభిమానులకే కాకుండా సగటు సినిమా ప్రేమికుడికి కూడా గూస్‌బంప్స్ తెప్పిస్తాయని అంటున్నారు ఇక ఈ సినిమాకు ప్రాణంగా నిలిచింది మాత్రం క్లైమాక్స్ ముందు వచ్చే ఆ చివరి 50 నిమిషాల ఎమోషనల్ ఎపిసోడ్. దర్శకుడు బుచ్చిబాబు రాసుకున్న కథనానికి, చరణ్ నటన తోడై ఆ లాస్ట్ 50 మినిట్స్ ప్రేక్షకులను ఒక ఎమోషనల్ డ్రైవ్ లోకి తీసుకెళ్తాయని అంటున్నారు.మొత్తానికి ‘పెద్ది’గా రామ్ చరణ్ చేసిన ఈ పర్ఫార్మెన్స్ బాక్సాఫీస్ వద్ద లాంగ్ రన్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మరి సినిమా ఎలా ఉంది అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.
