పవన్ కళ్యాణ్ హీరోగా హరిహర వీరమల్లు రూపొందిన సంగతి తెలిసింది. ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికి ఎన్నోసార్లు వాయిదా పడిన ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. నిజానికి పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం చాలా కాలం తర్వాత నటించిన సినిమా ప్రెస్ మీట్‌కి హాజరయ్యారు. వాస్తవానికి ఏ హీరో అయినా తాను నటించిన ప్రెస్ మీట్ లేదా ప్రమోషన్స్‌కి హాజరు కావడం సర్వసాధారణం, కానీ పవన్ గత కొద్ది సంవత్సరాలుగా రాజకీయంగా బిజీగా ఉండడంతో అసలు ప్రమోషన్ల జోలికి వెళ్లడం లేదు. అయితే ఇప్పుడు పవన్ హరిహర వీరమల్లు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారనే విషయం తెలిసిన వెంటనే ఈ అంశం కేవలం కామన్ ఆడియన్స్‌లోనే కాదు, మీడియాలో కూడా చాలా ఆసక్తి కలిగించింది.
ALso Read:Rashmika : భారీ బిజినెస్ పెట్టిన రష్మిక
ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమా విషయంలో మీడియా ముందుకు వచ్చి చాలా కాలం అయింది. సినిమా స్పీచ్‌ల విషయంలో కూడా ఆయన ఇబ్బంది పడుతూ ఉంటారు, కానీ ఈ రోజు మాత్రం ఆయన చాలా ఆర్గానిక్‌గా, ఏదో ఒక పొలిటికల్ ఈవెంట్‌కి హాజరైనంత ఈజీగా మాట్లాడేశారు. ఇక సినిమా విషయంలో పొగడకుండా, కేవలం AM రత్నం గురించే తాను ప్రెస్ మీట్‌కి వచ్చినట్లు ముందే చెప్పేశారు. ఆయన మాట్లాడిన దాదాపు అన్ని మాటల్లోనూ తన నిర్మాతను, తద్వారా తాను చేస్తున్న సినిమాని కాపాడుకోవాలని తపనే కనిపించింది. రెగ్యులర్ స్టైల్‌లో “మా సినిమా చూడండి, సూపర్ హిట్ చేయండి, బంపర్ హిట్ చేయండి” అనేలా ప్రమోషన్ చేయకపోయినా, సినిమా క్లైమాక్స్ సీక్వెన్స్ కోసం తాను ఎంత కష్టపడ్డాననే విషయం చెప్పి, సినిమా మీద ఆసక్తి పెంచే ప్రయత్నం చేశాడు. అంతేకాదు, సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస మొదలు ప్రమోషన్స్ అన్నీ తన నెత్తిన వేసుకొని చేస్తున్న నిధి అగర్వాల్‌ను ప్రశంసిస్తూ మాట్లాడారు.
ALso Read:Arjun : 8 ఏళ్ల తర్వాత హీరోగా అర్జున్ సర్జా రీ ఎంట్రీ !
నిజానికి పవన్ కళ్యాణ్ స్టేచర్‌కి ఆయన ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం గానీ, మీడియా ముందుకు చెప్పిన టైంకి గానీ రావాల్సిన అవసరం లేదు. కానీ ఆయన తన నిర్మాత కోసం అండగా నిలబడేందుకు కదలి వచ్చాడు. ఈ విషయాన్ని పలుసార్లు స్పీచ్‌లోనే ఆయన చెప్పేశారు. ఒకరకంగా ఇది ఇప్పుడు సినిమా ప్రమోషన్స్‌కి రాకుండా డుమ్మా కొడుతున్న కొంతమంది తెలుగు హీరోలకు కనువిప్పు కలిగించే అంశంగా మారుతుంది. ఒకపక్క మంత్రిగా ఉన్న ప్రతిపక్షాల వారు విమర్శలు చేస్తారని భయం వెంటాడుతున్నా, తాను నమ్మిన నిర్మాత కోసం పవన్ అండగా నిలబడ్డారు. కానీ ఇప్పుడున్న హీరోలకు అలాంటి టెన్షన్స్ ఏమీ లేకపోయినా, ప్రమోషన్స్ విషయంలో వెనకడుగు వేస్తూ నిర్మాతలకు అదనపు భారంగా మారుతున్నారు. వారు కచ్చితంగా ఈ విషయంలో పవన్ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది.
