NTV Telugu Site icon

Odela 2: నాన్ థియేట్రికల్’కి కళ్ళు చెదిరే డీల్

Odela2

Odela2

తెలుగు సినిమా పరిశ్రమలో రాబోయే సంచలన చిత్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ‘ఓదెల 2’ సినిమా గురించి కొత్త సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ సినిమా కంటెంట్ అద్భుతంగా ఉందని, ప్రేక్షకులకు సరికొత్త తమన్నా భాటియాను చూసే అవకాశం దక్కబోతోందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ‘ఓదెల రైల్వే స్టేషన్’ సినిమాకి సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ సూపర్‌నాచురల్ థ్రిల్లర్‌లో తమన్నా ప్రధాన పాత్రలో ఒక శివ సత్తుగా కనిపించనుంది. సినిమా బడ్జెట్ సుమారు 23 కోట్ల రూపాయలు కాగా, నాన్-థియేట్రికల్ హక్కుల ద్వారా 20 కోట్లకు పైగా ఆదాయం సమకూరినట్లు తెలుస్తోంది. అంటే, ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్ కంటే ముందే దాదాపు తన బడ్జెట్‌ను రికవరీ చేసుకున్నట్లు భావించవచ్చు. ఇది ఒక రకంగా చెప్పాలంటే, సినిమాకు ఉన్న క్రేజ్‌ను, కంటెంట్‌ ఎలా ఉందనే దానిపై క్లారిటీ వస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా ఓటీటీ హక్కులను సుమారు 12 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు సమాచారం, అలాగే హిందీ డబ్బింగ్ రైట్స్ మరియు శాటిలైట్ హక్కులు కూడా మంచి ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి.

PrabhasHanu: అగ్రహారం’లో ప్రభాస్ కొత్త అవతారం!

ఈ చిత్రానికి దర్శకుడు సంపత్ నంది కాదు, అతను దర్శకత్వ పర్యవేక్షణ చేస్తూ అశోక్ తేజ అనే యువ దర్శకుడితో సినిమాను రూపొందించారు. సంపత్ నంది రచయితగా, నిర్మాతగా కీలక పాత్ర పోషిస్తూ ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్తున్నారు. తమన్నా ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుండగా, ఆమె నాగ సాధ్వి శివశక్తి పాత్రలో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోనుందని అంటున్నారు. ఈ రేంజ్‌లో నాన్-థియేట్రికల్ డీల్ సాధించడం అంటే, సినిమా కంటెంట్‌పై బయ్యర్లకు గట్టి నమ్మకం ఏర్పడేలా ఉంది. ఏప్రిల్ 17, 2025న విడుదలకు సిద్ధమవుతున్న ‘ఓదెల 2’ థియేటర్లలో ఎలాంటి స్పందన పొందుతుందో చూడాలి. ఈ సినిమా ద్వారా తమన్నా మరోసారి తన నటనా సత్తాను చాటుకోనుందని అభిమానులు ఆశిస్తున్నారు.