Site icon NTV Telugu

IPL 2025: పిల్లలు సెంచరీలు కొడుతున్నారు…కొంచెమైనా బుద్ది ఉండక్కర్లా!!

Sports

Sports

వేలంలో ఒక ప్లేయర్ భారీ ధర పలికాడంటే.. కొనుగోలు చేసిన ఆ ఫ్రాంచైజీ అతనిపై భారీ ఆశలే పెట్టుకుని ఉంటుంది. కానీ కొందరు కాస్ట్లీ ప్లేయర్లు తమ ఫ్రాంచైజీల నమ్మకాన్ని ఏ మాత్రం నిలుపుకోలేకపోతున్నారు. మ్యాచ్ విన్నర్లు అని కోట్లిచ్చి కొనుక్కుంటే.. జట్టుకు భారమవుతున్నారు. ఈ ఐపీఎల్ లో భారీ ధర పలికిన వారిలో ఇద్దరు స్టార్ ప్లేయర్లు తమ చెత్త ప్రదర్శనతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. అందులో ఒకరు రిషభ్ పంత్ కాగా మరొకరు వెంకటేశ్ అయ్యర్. లక్నో సూపర్ జాయింట్స్ కేఎల్ రాహుల్ ని విడుదల చేసి రిషబ్ పంత్ ని జట్టులోకి తీసుకుంది.

Read More: Story Board : పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం ఎలా? పాక్కు గట్టిగా బుద్ధి చెప్పడం ఖాయమేనా?

ఏకంగా 27 కోట్లతో పంత్ ని తమ జట్టులో చేర్చుకుంది. కానీ పంత్ దారుణంగా విఫలమయ్యాడు. చెత్త షాట్లకు పోయి వికెట్ సమర్పించుకుంటున్నాడు. అతని బ్యాటింగ్ తీరుపై ఎన్ని విమర్శలు వస్తున్నా పంత్ లో మార్పు కనిపించడం లేదు. అవసరం లేని షాట్లకు పోయి పరువు తీసుకుంటున్నాడు. ఈ సీజన్లో రిషబ్ 10 మ్యాచుల్లో 98 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసి 110 పరుగులు చేశాడు. ఈ పది మ్యాచుల్లో పంత్ ఒక మ్యాచులో మాత్రమే ఫిఫ్టీ కొట్టాడు. గతేడాది లక్నో కెప్టెన్ గా కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడాడు. 14 మ్యాచుల్లో 4 హాఫ్ సెంచరీలతో 520 పరుగులు చేశాడు. అయినా ఆ జట్టులో అతనికి గౌరవం దక్కలేదు. సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ అనంతరం ఆ ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గోయెంకా రాహుల్ ని తిట్టడం అప్పట్లో సెన్సేషన్ గా మారింది. దాంతో ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు రావడంతో రాహుల్ లక్నోని వీడాలనుకున్నాడు.

Read More:BHOGI : శర్వానంద్ ‘భోగీ’ ఫస్ట్ స్పార్క్ రిలీజ్..

రాహుల్ స్థానంలో వచ్చిన పంత్ చెత్త ప్రదర్శన కారణంగా పాపం గోయెంకా తలపట్టుకుంటున్నాడు. వేలంలో 23 కోట్ల భారీ ధర పలికిన వెంకటేశ్ అయ్యర్ కూడా కేకేఆర్ ని నిండా ముంచేశాడు. 10 మ్యాచుల్లో ఒక్క హాఫ్ సెంచరీతో 142 పరుగులతో తీవ్రంగా నిరాశపరిచాడు. 7 ఇన్నింగ్స్‌లలో 4 సార్లు 2 అంకెలు స్కోర్ కూడా చేరుకోలేకపోయాడు. వెంకటేశ్ అయ్యర్‌ మీద ఖర్చు చేసిన డబ్బుని మిచెల్ స్టార్క్,లేదా కేఎల్ రాహుల్ లాంటి ప్లేయర్లు మీద ఖర్చు చేసి ఉంటె ఈ రోజు కేకేఆర్ పరిస్థితి మరోలా ఉండేది. వచ్చే సీజన్ లో లక్నో రిషభ్ పంత్‌ను.. కేకేఆర్ వెంకటేశ్ అయ్యర్‌లను వేలంలోకి వదలడం ఖాయం. ఫ్యాన్స్ కూడా ఇదే భావిస్తున్నారు. పిల్లలు సెంచరీలు కొడుతున్నారు అంటూ విమర్శిస్తున్నారు.

Exit mobile version