Site icon NTV Telugu

Mega Anil: ప్రమోషన్స్‌కు రాని నయనతార.. అనౌన్స్‌మెంట్ వీడియో వెనుక అసలు కథ ఇదే

Nayanathara

Nayanathara

సాధారణంగా నయనతార సినిమా ప్రమోషన్స్ అంటే ఆమడ దూరం పారిపోతుంది. ఒకప్పుడు ఆమె కూడా ప్రమోషన్స్‌కు వచ్చేది, కానీ ఎందుకో మధ్యలో ఈ ప్రమోషన్స్‌కు బ్రేక్ వేసింది. నిజానికి సౌత్ సినీ పరిశ్రమ ఒక రకంగా హీరో సెంట్రిక్ అని చెప్పాలి. సినిమా షూటింగ్ మొదలు అన్ని విషయాలలో హీరోలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. రెమ్యూనరేషన్ విషయంలో కూడా హీరోలకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు దర్శకులు, నిర్మాతలు. అయితే నయనతార ప్రమోషన్స్ కారణంగా టైమ్ వృథా అవుతుందని భావించి, గతంలో దీనికి బ్రేక్ వేసిందని ఆ మధ్య ప్రచారం జరిగింది.

Also Read:Vijay Deverakonda:ఫిలింఫేర్ కవర్ పేజీపై విజయ్ దేవరకొండ

అయితే చాలా కాలం తర్వాత ఆమె ప్రమోషన్స్‌లో పాల్గొంది, అది కూడా సినిమా అనౌన్స్‌మెంట్ కోసం. సాధారణంగా సినిమా పూర్తయిన తర్వాత కూడా ప్రమోషన్స్‌కు హాజరు కావడానికి అనేక తిప్పలు పెడుతుంది. అంత తిప్పలు పెట్టి హాజరవుతుందా అంటే, అది అవునని చెప్పలేం. కానీ అనిల్ రావిపూడి, మెగాస్టార్ చిరంజీవి కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో ఆమె హీరోయిన్‌గా నటిస్తున్నట్లు అనౌన్స్‌మెంట్ చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు.

Also Read:Manchu Vishnu : ప్రభాస్ కు ఎప్పటికీ రుణపడి ఉంటా.. మంచు విష్ణు కామెంట్స్..

ఈ మధ్యనే ఈ వీడియో కోసం అనిల్ రావిపూడి చెన్నై వెళ్లారు. కాన్సెప్ట్ చెప్పడంతో వెంటనే నయనతారకు నచ్చి, ఆమె ఈ వీడియో షూట్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఇలాంటి కాన్సెప్ట్‌లతో వస్తే కచ్చితంగా చురుగ్గా పాల్గొంటానని అనిల్ రావిపూడికి మాటిచ్చిందట. ప్రమోషన్ అనగానే మీడియాతో మాట్లాడటం లేదా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం ఇలా సాగిపోతూ ఉండేది. అందుకే ఈ విషయం మీద ఆమెకు కాస్త ఆసక్తి సన్నగిల్లిందని తెలుస్తోంది. ఇకమీదట ఇలాంటి ఇన్నోవేటివ్ ప్రమోషన్స్ ప్లాన్ ఏదైనా ఉంటే, కచ్చితంగా తాను సహకరిస్తానని నయనతార అనిల్ రావిపూడికి మాటిచ్చినట్లు తెలుస్తోంది.

Exit mobile version