Movie Promotions : ట్రెండు మారింది బాసూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్యకాలంలో తెలుగు సినిమా ప్రమోషన్స్ కొత్త పుంతలుతోక్కుతున్నాయి. నిజానికి ఎప్పటినుంచో తెలుగు సినిమాలు ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాయి. ఆయా సినిమాల ప్రమోషన్స్ చాలా పొందికగా ఉండేవి. మొదట్లో ఎక్కువగా ప్రింట్ మీడియా ద్వారానే సినిమాలు పబ్లిసిటీ చేసేవారు. సినిమాల గురించి వార్తలు, సినిమా పోస్టర్లు, సినిమా నటుల ఫోటోలతో ఆకర్షణీయమైన స్పెషల్ స్టోరీలతో ప్రింట్ మీడియా ద్వారా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేసేవారు. ఆ తర్వాత కొద్దిగా అడ్వాన్స్ అయిన నేపథ్యంలో ఎలక్ట్రానిక్ మీడియా రంగంలోకి దిగింది. సినిమా స్టార్లతో ఇంటర్వ్యూలు, సినిమా కంటెంట్ కట్ చేసి ప్రోమోగా వేస్తూ సినిమా మీద ఆసక్తి పెంచే ప్రయత్నం చేసి థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేసేవారు.
Also Read:Pawan Kalyan: 96 ఏళ్ల వృద్దురాలితో కలిసి భోజనం చేసిన పవన్.. కారణం ఏంటంటే?
Also Read
ఆ తర్వాత వచ్చిన ఇంటర్నెట్ ద్వారా ఆయా సినిమాల గురించి ఆసక్తికరమైన కథనాలు ఇంటర్నెట్లో వండి వడ్డిస్తూ సినిమా మీద ఆసక్తి పెంచే విధంగా ప్రయత్నం చేసేవారు. తద్వారా థియేటర్లకు ప్రేక్షకులను రప్పించే ప్రయత్నం చేసేవారు. ఇక ఇప్పుడు యూట్యూబ్ ద్వారా ఇంటర్వ్యూలు పెడుతూ, రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ చేస్తూ ప్రేక్షకులను ఎంగేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి పబ్లిసిటీ అనేది “సంక్రాంతికి వస్తున్నాం” ముందు “సంక్రాంతికి వస్తున్నాం” తరువాత అనేలా మార్చేశాడు అనిల్ రావిపూడి. ఎందుకంటే ఆ సినిమాలో హీరో వెంకటేష్ సహా హీరోయిన్లు, డైరెక్టర్‌తో కలిసి రోజుకొక రీల్ తరహా కంటెంట్ క్రియేట్ చేసి సినిమా మీద ఆసక్తి పెంచారు.
Also Read:Bhairavam : భైరవం రిలీజ్ వచ్చేసింది.. ఎప్పుడంటే..?
సాంగ్ ఒకదాన్ని రిలీజ్ చేసి, దాంతో డాన్స్ వీడియోలు చేయించి, అసలు ఈ సినిమా ఆ సాంగ్ కోసమైనా చూడాల్సిందే అనేలా ఆసక్తి పెంచేశారు. ఇప్పుడు అనిల్ వేసిన బాటలోనే దాదాపుగా చాలామంది దర్శకులు, నిర్మాతలు, హీరోలు నడుస్తున్నారు. అనిల్ రావిపూడి తర్వాత రాబిన్‌హుడ్ టీం అంతే కష్టపడి ప్రమోషన్స్ చేసింది. ఆ సినిమా రిజల్ట్ కొంచెం తేడా కొట్టినా, చేసిన ప్రమోషన్స్ కారణంగా కొంతమేర వసూళ్లు రాబట్టుకోగలిగింది. ఇప్పుడు దాదాపుగా అదే స్ట్రాటజీ ఫాలో అయిన మరో సినిమా సింగిల్. ఈ సినిమా హీరో శ్రీవిష్ణు, వెన్నెల కిషోర్, హీరోయిన్లతో కట్ చేసిన కొన్ని షార్ట్స్, రీల్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేస్తున్నాయి. హీరో నాని సైతం సరిగ్గా సినిమాకి అదేవిధంగా ప్రమోషన్ చేసి చాలావరకు లాభాలు ఆర్జించగలిగాడు. ఇప్పుడు తెలుగు సినిమా ప్రమోషన్స్ మరిన్ని కొత్త పుంతలతో ఒక్కుతూ ముందుకు వెళ్ల
- Tags
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!