Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ntv Exclusives Jinnahs Betrayal Balochistan Is Still Raging

Balochistan: “జిన్నా” చేసిన మోసం.. ఇప్పటికీ రగులుతున్న బలూచిస్తాన్..

Published Date :March 12, 2025 , 3:37 pm
By Venu Goapl Reddy
  • మోసంతో బలూచిస్తాన్‌ని కలుపుకున్న జిన్నా..
  • జిన్నా ద్రోహంతో గత దశాబ్ధాలుగా రగులుతున్న బలూచ్ ప్రజలు..
Balochistan: “జిన్నా” చేసిన మోసం..  ఇప్పటికీ రగులుతున్న బలూచిస్తాన్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Balochistan: పాకిస్తాన్ జాతిపితగా పిలువబడే ‘‘మహ్మద్ అలీ జిన్నా’’ బలూచిస్తాన్‌కి చేసిన నమ్మక ద్రోహం కారణంగా ఆ ప్రాంతం కొన్ని దశాబ్ధాల కాలంగా రగులుతూనే ఉంది. పాక్ నుంచి విముక్తి, తమ వనరులపై హక్కుల కోసం బలూచ్ ప్రజలు అనేక సార్లు తిరుగుబాటు చేశారు. అయినప్పటికీ పాక్ ప్రభుత్వం సైన్యం సాయంతో, కుట్రల సాయంతో ఈ తిరుగుబాటుని అణచివేస్తూనే ఉంది. తాజాగా, బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) పాక్ రైల్వేకి చెందిన జఫర్ ఎక్స్‌ప్రెస్‌ని హైజాక్ చేయడం సంచలనంగా మారింది. 400 మందికి పైగా ప్రయాణికుల్ని బందీలుగా చేసుకున్నారు. వీరందర్ని విడిపించేందుకు పాక్ ఆర్మీ ఆపరేషన్ చేపడుతోంది.

పాకిస్తాన్ వ్యవస్థాపకుడు జిన్నా బలూచ్ ప్రజలకు చేసిన ద్రోహమే ఈ తిరుగుబాటుకు కారణమైంది. బలూచ్ ప్రజలు 958-59, 1962-63, 1973-77లో స్వాతంత్ర్యం కోసం హింసాత్మక తిరుగుబాటు చేశారు. పాకిస్తాన్‌లో అతిపెద్ద ప్రావిన్సు అయిన బలూచిస్తాన్ ఖనిజ, సహాజవాయు సంపదకు నెలవు. ఈ సంపదను కొల్లగొట్టి పంజాబ్ ప్రజలు వాడుకుంటున్నారనేది బలూచ్‌లు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(సీపెక్) ఈ రాష్ట్రం గుండానే వెళ్తుంది. గ్వాదర్ పోర్టు కూడా ఈ రాష్ట్రంలోనే ఉంది. దీంతో తమ సహజవనరులను పాకిస్తాన్ దోపిడీ చేస్తుందని అక్కడి ప్రజలు భావిస్తున్నారు.

2004లో తాజా సాయుధ తిరుగుబాటు చెలరేగింది. 2006లో పాకిస్తాన్ దళాలు బలూచ్ గిరిజన నాయకుడు అక్బర్ ఖాన్ బుగ్టి హత్య తర్వాత ఈ ఉద్యమం మరింత ఊపందుకుంది. బలూచిస్తాన్‌లోని సహజ సంపదలో ఎక్కువ భాగం ఇవ్వడంతో పాటు, స్వయంప్రతిత్తిని బుగ్టి డిమాండ్ చేశారు. దీనికి ముందు 1971లో బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి స్వాతంత్ర్యం పొందిన తర్వాత బలూచ్ ఉద్యమం ఎగిసిపడింది. అయితే, ఈ ఉద్యమాన్ని అప్పటి పాక్ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో తీవ్రంగా అణచివేశాడు.

Read Also: Vijayasai Reddy: భయం అనేది నా రక్తంలో లేదు.. పార్టీని విడటంపై విజయ సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

1973లో భుట్టో, అక్బర్ ఖాన్ బుగ్టీ ప్రభుత్వాన్ని రద్దు చేసి, ఇరాన్ రాయబార కార్యాలయంలో బలూచ్ తిరుగుబాటుదారుల కోసం ఉద్దేశించిన ఆయుధాలు దొరికాయనే కుట్రతో పెద్ద ఎత్తున సైనిక చర్యకు ఆదేశించాడు. 1977 వరకు 4 ఏళ్ల పాటు సాయుధ తిరుగుబాటు జరిగింది. దీనిని నాలుగో బలూచ్ వివాదంగా పిలుస్తారు. నివేదికల ప్రకారం, మర్రి, మెంగల్ మరియు బుగ్టి గిరిజన నాయకుల నాయకత్వంలో దాదాపు 55,000 మంది బలూచ్ గిరిజనులు 80,000 మంది పాకిస్తాన్ సైనిక సిబ్బందిపై పోరాడారు. పాకిస్తాన్ వైమానిక దళం గ్రామాలపై బాంబు దాడి చేసి వేలాది మంది బలూచ్ పౌరులను చంపింది. ఈ ఉద్యమం ఎంతలా చెలరేగిందంటే, తమ ప్రాంతంలోని బలూచిస్తాన్‌లోకి ఈ ఉద్యమం వ్యాప్తి చెందుతుందని భయపడిన ఇరాన్, పాక్‌కి సైనిక సాయం చేసింది. 1977లో జనరల్ జియా ఉల్ హక్ సైనిక తిరుగుబాటు చేసి భుట్టోని గద్దె దించి, బలూచ్ గిరిజనులకు క్షమాభిక్ష ప్రసాదించారు. దీంతో పోరాటం ముగిసింది.

దీనికి ముందు, 1954లో పాకిస్తాన్ వన్ యూనిట్ విధానాన్ని ప్రారంభించింది. దీని ద్వారా ప్రావిన్సుల్ని పునర్వ్యవస్థీకరించింది. బలూచిస్తాన్ వన్ యూనిట్ కింద ఇతర ప్రావిన్సులతో విలీనం చేయడం ద్వారా స్వయంప్రతిపత్తిని తగ్గించింది. ఇది బలూచ్ నాయకుల్లో తీవ్ర ఆగ్రాహాన్ని రేకెత్తించింది. ఖాన్ ఆఫ్ కలాత్ అయిన నవాజ్ నౌరోజ్ ఖాన్ 1958లో స్వాతంత్య్రం ప్రకటించుకున్నాడు. పాక్ ఆర్మీకి వ్యతిరేకంగా గెరిల్లా పోరాటం ప్రారంభించాడు. అయితే, నౌరోజ్‌ని లొంగిపోతే ఏం చేయమనే హామీ ఇచ్చిన పాకిస్తాన్, ఆ తర్వాత ఆయనను అతడి కుమారులను అరెస్ట్ చేసి, అతడి ఐదుగురు బంధువుల్ని ఉరితీసింది. ఈ ద్రోహం బలూచ్ ఆగ్రహాన్ని మరింత పెంచింది. దీని తర్వాత 1963లో మూడో బలూచ్ సంఘర్షణ జరిగింది. 1969లో సాధారణ క్షమాభిక్ష మరియు బలూచ్ వేర్పాటువాదులను విడుదల చేయడంతో తిరుగుబాటు ముగిసింది.

జిన్నా నమ్మక ద్రోహం, మోసం:

1947 దేశ విభజన సమయంలో బలూచిస్తాన్ నాలుగు రాజరిక రాష్ట్రాలుగా కలత్, ఖరన్, లాస్ బేలా, మకరన్‌గా ఉండేది. వారు భారత్ లో కానీ, పాక్‌లో కానీ కలవడం లేదా స్వతంత్రంగా ఉండే అవకాశం ఉంది. జిన్నా ప్రభావంతో మూడు ప్రాంతాలు పాక్‌లో విలీనమైనప్పటికీ, కలాత్ స్వతంత్య్రంగా ఉండాలని భావించింది. తన కేసును బ్రిటీష్ క్రౌన్ ముందు వాదించడానికి మహ్మద్ అలీ జిన్నానున తన న్యాయ సలహాదారుగా ఖాన్ ఆఫ్ కలాత్ అయిన మీర్ అహ్మద్ యార్ ఖాన్ నియమించుకున్నారు.

ఆగస్టు 4, 1947న ఢిల్లీలో లార్డ్ మౌంట్‌బాటెన్, కలాట్ ఖాన్, జవహర్‌లాల్ నెహ్రూ హాజరైన సమావేశంలో, జిన్నా కలాత్ స్వాతంత్ర్యంగా ఉండటాన్ని సమర్థించారు. జిన్నా పట్టుబట్టడంతో ఖరన్ , లాస్ బేలను కలాత్‌లో విలీనం చేసి పూర్తి బలూచిస్తాన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కలాత్ ఆగస్టు 15, 1947న స్వాతంత్ర్యం ప్రకటించుకుంది.

అయితే, 1947 అక్టోబర్లో జరిగిన సమావేశంలో జిన్నా కలాత్ కూడా పాక్‌లో విలీనం కావాలని ఒత్తిడి తెచ్చాడు. దీనిని ఖాన్ ఆఫ్ కలాత్ వ్యతిరేకించాడు. భారత్ సహా అనేక మార్గాల ద్వారా సాయం కోరాడు. చివరకు ఎక్కడి నుంచి సాయం అందకపోవడంతో లొంగిపోయాడు. మార్చి 26, 1948లో పాక్ సైన్యం ముందు లొంగిపోవాల్సి వచ్చింది. ఖాన్ ఆఫ్ కలాత్ విలీన పత్రంపై సంతకం చేసినప్పటికీ ఆయన సోదరుడు ప్రిన్స్ అబ్దుల్ కరీం 1948లో పాక్‌పై తిరుగుబాటు చేశాడు. జిన్నా ద్రోహం, పాక్ సైనిక శక్తితో బలూచిస్తాన్‌ని పూర్తిగా వశం చేసుకుంది. అప్పటి నుంచి తిరుగుబాటు జరుగుతూనే ఉందింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Balochistan
  • Balochistan Liberation Army
  • balochistan map
  • Balochistan News
  • Bangladesh

తాజావార్తలు

  • KKR vs SRH Playing 11: కేకేఆర్ vs ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్.. ప్లేయింగ్ 11, హెడ్ టు హెడ్, పిచ్ రిపోర్ట్ ఇదే!

  • Iran-Israel War: ఇరాన్‌‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు.. ఐఆర్‌జీసీ, క్షిపణి స్థావరాలపై ఎటాక్

  • Chiranjeevi: అయోధ్య ‘సూర్య తిలకం’ లాగే చిరంజీవి ఇంట్లో అద్భుతం.. వీడియో వైరల్!

  • Komurakka : ‘జబర్దస్త్’ కొమురక్కపై దాడి.. పక్కా స్కెచ్‌తో చుట్టుముట్టిన దుండగులు!

  • Raghav Chadha: రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాకు ఆప్ షాక్.. కీలక పదవి నుంచి తొలగింపు

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions