Idupu Kayitham: అసలెందుకీ వివాదం.. ఎక్కడ మొదలైందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘ఆంధ్ర వర్సెస్ తెలంగాణ’ అన్నట్టుగా ఓ పెద్ద వివాదమే నడుస్తోంది. నిజానికి ‘ఇడుపు కాయితం’ అనే పేరుతో బన్నీ వాసు నిర్మాతగా, ప్రియదర్శి హీరోగా ప్రారంభించిన సినిమా అనౌన్స్మెంట్ తర్వాత ఈ వివాదం తెరమీదకు వచ్చింది. అయితే, ఈ వివాదానికి కొద్ది రోజుల ముందు, గతంలో తెలుగు సినిమాలకు రివ్యూస్ ఇస్తూ ప్రస్తుతానికి బ్రేక్ ఇచ్చిన ఒక తెలంగాణ ప్రాంతానికి చెందిన యూట్యూబర్, “తెలంగాణ అంటే భాష” అంటూ ఒక వీడియో చేశాడు. నిజానికి తెలంగాణది యాస అని చాలామంది రుద్దాలనే ప్రయత్నం చేస్తున్నారు, కానీ “మా తెలంగాణది యాస కాదు, భాష” అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.
ఈ విషయం ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే, ప్రొఫెసర్ నాగేశ్వరరావు వర్సెస్ జనసేన ఇష్యూలో అనవసరంగా తెలంగాణ వివాదాన్ని లేపిన క్రమంలో మొదలైంది. అక్కడ ఒక విశ్లేషకుడు, ఒక రాజకీయ పార్టీకి మధ్య జరిగిన వివాదాన్ని కొంతమంది తెలంగాణ వర్సెస్ ఆంధ్రగా మార్చే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో సదరు యూట్యూబర్ కూడా ఆ వివాదంతో కంటెంట్ క్రియేట్ చేసుకుని, వ్యూస్‌తో లబ్ధి పొందే ప్రయత్నంలో భాగంగా “తెలంగాణ భాష” అంటూ ఒక వీడియో చేశాడు. దాన్ని చూసిన ఒక నెటిజన్, ఈ ‘ఇడుపు కాయితం’ ఓపెనింగ్ అయిన రోజున ఆ సినిమాకి సంబంధించిన ఫోటో షేర్ చేస్తూ, “ఇది తెలంగాణ భాషలో రిలీజ్ చేస్తారట కదా, తెలుగులోకి డబ్బింగ్ చేస్తారా లేదా?” అంటూ సదరు యూట్యూబర్ చేసిన వీడియోకి కౌంటర్‌గా మాట్లాడాడు.
Also Read
అయితే, అది కచ్చితంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారిని అవమానపరిచే విధంగా ఉండడంతో, ఒక్కసారిగా ఆ ట్వీట్ వైరల్ అయింది. అతను తన తప్పు తెలుసుకుని అది తొలగించే లోపు, ఈ విషయం దావాగ్నిలా వ్యాపించి రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు సోషల్ మీడియాలో మాటల యుద్ధానికి దిగారు. అంతేకాక, కవిత లాంటి వారు సైతం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితానికి ముడి పెడుతూ కామెంట్స్ చేసేదాకా వెళ్ళింది. వాస్తవానికి జరుగుతున్న అంశం ద్వారా కంటెంట్ క్రియేట్ చేసుకుని, వ్యూస్ ద్వారా డబ్బులు సంపాదించే ఓ యూట్యూబర్, తన తెలంగాణ ప్రాంతపు యాసను భాషగా భావిస్తూ గొప్పతనంగా చెప్పుకున్న విషయాన్ని… మరో సోషల్ మీడియాలో పనిలేని వ్యక్తి సీరియస్‌గా తీసుకుని దానికి కౌంటర్ ఇస్తూ మాట్లాడిన విధానం సరిగా లేకపోవడం ఇప్పుడు రెండు ప్రాంతాల వాసుల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. మరి మీ ఉద్దేశం ప్రకారం ఈ వివాదానికి కారణం ఆ ఇద్దరిలో ఎవరు? ఎవరి కారణంగా ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయి అనేది కామెంట్ చేయండి.
తాజావార్తలు
-
TVS Star City Plus: స్ల్పెండర్కు గట్టిపోటీ ఇచ్చిన టీవీఎస్ బైక్‌కు ముగింపు .. చరిత్రలోకి స్టార్ సిటీ ప్లస్!
-
Iran War: ఇరాన్‌పై 7 రోజుల వైమానిక దాడులకు ప్లాన్? ట్రంప్ నిర్ణయం కోసం నెతన్యాహు ఎదురుచూపులు
-
Ind Vs Nepal: టాస్ గెలిచిన నేపాల్.. బ్యాటింగ్‌లో అభిషేక్ మెరుపులు..
-
Stock Market: దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్ సూచీలు.. ఇన్వెస్టర్లకు లాభాలే లాభాలు..
-
Uttar Pradesh: ఇంటి ముందు ‘‘వందేమాతరం’’ ఉండటమే పాపమా.. ముస్లిం యువతి నికాహ్కు నిరాకరించిన ఇమామ్
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!