Site icon NTV Telugu

Rajendra Prasad: 15 రోజుల వెకేషన్లో సినిమా చేస్తే ఏడాది ఆడింది

Rajendraprasad

Rajendraprasad

ఈ రోజుల్లో ఒక సినిమా తీయాలంటే తక్కువలో తక్కువ 70 నుంచి 90 రోజులు పడుతుంది. అది అత్యంత తక్కువ వర్కింగ్ డేస్ అని చెప్పొచ్చు. కానీ ఒకానొక సమయంలో కేవలం 15 రోజుల్లోనే ఒక సినిమా తీసి రిలీజ్ చేస్తే, అది తెలుగులో ఏడాది ఆడడమే కాదు, కన్నడ, మరాఠీ భాషల్లో సైతం రీమేక్ అయింది. ఆ సినిమా మరేమిటో కాదు, రాజేంద్రప్రసాద్ హీరోగా, దివ్యవాణి హీరోయిన్‌గా నటించిన ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం.

Also Read: Shashtipoorthi Review: షష్టిపూర్తి రివ్యూ  

అది 1991. అప్పట్లో రాజేంద్రప్రసాద్ ఏడాదికి 12 సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉండేవాడు. సినిమా రిలీజ్ అవుతూ ఉండేది. రిలీజ్‌తో సంబంధం లేకుండా ఆయన స్పీచ్ షెడ్యూల్‌లో ఉండేవాడు. అయితే అనుకోకుండా ఒకసారి ఏకంగా 15 రోజుల షెడ్యూల్ గ్యాప్ వచ్చిందట. వెంటనే ఎక్కడికైనా వెకేషన్‌కి వెళ్దామని సిద్ధమవుతున్న సమయంలో, రేలంగి నరసింహారావు ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం స్క్రిప్ట్ తీసుకుని వెళ్ళాడట.

Also Read: Bhairavam Review : భైరవం రివ్యూ

నెల్లూరుకు చెందిన తన స్నేహితుడు ఒకాయన నిమ్మకాయల వ్యాపారం చేస్తూ ఉంటాడని, ఆయన దగ్గర పెట్టుబడి ఉంది, సినిమా చేయాలనుకుంటున్నాడని చెప్పుకొచ్చాడు. మీరు టైం ఇస్తే ఈ 15 రోజుల్లో ఒక సినిమా చేద్దామని అన్నాడట. 15 రోజుల్లో సినిమా ఎలా పూర్తవుతుందని అడిగితే, నీకెందుకు, నేను పూర్తి చేసి పెడతానని అన్నాడట. అలా పదిహేను రోజులు అనుకుని దిగిన షూటింగ్, ఆ 15 రోజులతో పాటు మరో మూడు రోజులతో పూర్తయింది. ఆ సినిమాని రిలీజ్ చేస్తే అప్పట్లో బ్లాక్‌బస్టర్ హిట్ కావడమే కాదు, ఏడాది పాటు సినిమా బాగా ఆడింది. ఇప్పుడు బిగ్‌బాస్ ద్వారా మంచి ఫేమ్ తెచ్చుకున్న బాలాదిత్య ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ కొడుకు పాత్రలో అదరగొట్టాడు. ఈ రోజుల్లో ఈ 18 రోజుల్లో షూట్‌లో మహా అయితే ఒక సీక్వెన్స్ పూర్తి చేయగలుగుతారు. కానీ ఆ రోజుల్లో చాలా తక్కువ సోర్సెస్‌తో, పెద్దగా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ లేని రోజుల్లోనే ఏకంగా సినిమాలు పూర్తి చేయగలగటం మామూలు విషయం కాదు.

Exit mobile version