Shashtipoorthi Review: షష్టిపూర్తి రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.25 / 5
- MAIN CAST: రాజేంద్ర ప్రసాద్, అర్చన, రూపేష్, ఆకాంక్ష సింగ్ తదితరులు
- DIRECTOR: పవన్ ప్రభ
- MUSIC:
- PRODUCER: రూపేష్ చౌదరి
రాజేంద్ర ప్రసాద్-అర్చన కీలక పాత్రలలో రూపేష్ చౌదరి, ఆకాంక్ష సింగ్ హీరో హీరోయిన్లుగా రూపొందిన సినిమా షష్టిపూర్తి. రూపేష్ చౌదరి స్వయంగా నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాని కొత్త దర్శకుడు పవన్ ప్రభ డైరెక్ట్ చేశాడు. చాలా కాలం నుంచి సంగీతం అందించకుండా గ్యాప్ తీసుకున్న ఇళయరాజా ఈ సినిమాకి సంగీతం అందించడంతోపాటు ఆ పాటలకు కీరవాణి లిరిక్స్ అందించడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఈ సినిమా మీద పడింది. మరి ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది రివ్యూలో చూద్దాం.
షష్టిపూర్తి కథ:
Also Read
శ్రీరామ్ (రూపేష్ చౌదరి) ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్. అబద్ధం చెప్పకుండా చిన్నప్పటి నుంచి ఎంతోమంది ఇబ్బందుల్లో పడడానికి కారణమైన అతను, తన వృత్తిలో అంతే నిజాయితీతో వ్యవహరిస్తూ ఉంటాడు. తన తండ్రి దివాకరం (రాజేంద్రప్రసాద్), భువనేశ్వరి (అర్చన) ఇద్దరికీ దూరంగా సిటీలో ఉన్న అతను, అనుకోకుండా జానకి (ఆకాంక్ష సింగ్)ని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. అయితే, అతని వ్యవహార శైలి నచ్చకపోవడంతో, అబద్ధాలు ఆడితేనే రిలేషన్ కంటిన్యూ చేద్దామని ఆమె తెగేసి చెబుతుంది. దీంతో తల్లి దగ్గర అబద్ధమాడి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఉద్యోగం మానేసి, లాయర్‌గా అవతారం ఎత్తి లక్షలకు లక్షలు సంపాదించడం మొదలుపెడతాడు. ఈ విషయం తెలిసి భువనేశ్వరి అతన్ని నిలదీయడమే కాక, తండ్రితో ఉన్న గొడవలు విడిపోవాలన్న ఉద్దేశాన్ని బయటపెడుతుంది. ఈ క్రమంలో తన తండ్రిని, తల్లిని కలిపేందుకు శ్రీరామ్ ఏం చేశాడు? శ్రీరామ్ జానకి మాట విన్నాడా లేదా? చివరికి జానకి, శ్రీరామ్ ఒక్కటయ్యారా? భువనేశ్వరి, దివాకరం విడిపోయారా? అన్న విషయాలు తెలియాలంటే సినిమా బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ: ఈ రోజుల్లో సినిమా అంటే ఏదో అద్భుతం ఉంటే తప్ప థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదు. కానీ ఇలాంటి రోజుల్లో కూడా అలాంటి విషయాలు ఏమీ లేకుండా చాలా సింపుల్‌గా చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా, శుద్ధంగా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు పవన్ ప్రభ. ఆయనకు ఇది మొదటి సినిమా. నిజానికి కథగా చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు, ఎందుకంటే ఇదే లైన్‌తో గతంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే నెమ్మదిగా ప్రేక్షకుడు సినిమాకి కనెక్ట్ అవుతాడు. అయితే టైటిల్ చూసి ఇదంతా షష్టిపూర్తి చుట్టూ తిరుగుతుంది అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే, ఎందుకంటే ఫస్ట్ హాఫ్ మొదలైన తర్వాత హీరో క్యారెక్టర్‌ను ఎస్టాబ్లిష్ చేసి, తర్వాత నెమ్మదిగా అతని లవ్ స్టోరీ ప్రేక్షకులలో ఆసక్తి కలిగించేలా రాసుకున్నాడు డైరెక్టర్. ఇంటర్వెల్ ట్విస్ట్‌తో ప్రేక్షకులలో ఆసక్తి రేకెత్తించి, తర్వాత సెకండ్ హాఫ్‌లోకి తీసుకెళ్లాక కాస్త క్లిష్టమైన స్టోరీతోనే నడిపించాడు. సెకండ్ హాఫ్‌లో రాజేంద్రప్రసాద్, అర్చన ప్రేమ కథతో పాటు ఫ్లాష్‌బ్యాక్‌లో మరో కథ ఇమిడించిన విధానం కొంతమందికి సాగదీసిన ఫీలింగ్ కలిగితే, కొంతమందికి మాత్రం ఆకట్టుకుంటుంది. నిజానికి టైటిల్‌కి తగ్గట్టు రాజేంద్రప్రసాద్, అర్చనలకు ఫస్ట్ హాఫ్‌లో కూడా ప్రాధాన్యత ఇస్తే బాగుండేది అనిపిస్తుంది. నిజానికి ఈ రోజుల్లో మనిషి మారాలంటే ఏదైనా బలమైన దెబ్బ తగిలితే తప్ప అది సాధ్యం కాదు. కానీ ఈ సినిమాలో ఒక విషయాన్ని చెప్పిన వెంటనే అవతలి మనిషి కన్విన్స్ అయిపోవడం లాజికల్‌గా కనెక్ట్ అయ్యేలా అనిపించలేదు. ఇది ఇప్పటిది కాకుండా దాదాపు 20-30 సంవత్సరాల క్రితం ఇలాంటి సినిమాలు మనం ఎన్నో చూశాం.
నటన విషయానికొస్తేషష్టిపూర్తి రివ్యూ , ఈ సినిమాలో హీరోగా పరిచయమైన రూపేష్ చౌదరికి ఇది మొదటి సినిమా అయినా, ఎక్కడా అలా అనిపించలేదు. ఎంతో అనుభవం ఉన్న నటుడిలా చాలా సీన్స్‌లో కనిపించాడు. అయితే ఆయన లుక్ మీద మరింత ఫోకస్ పెట్టి ఉంటే బాగుండేది. హీరోయిన్‌తో కెమిస్ట్రీ అదిరిపోయింది. సాంగ్స్‌లో కూడా మనోడు చాలా ఈజ్‌తో ఆకట్టుకున్నాడు. డైలాగ్ డిక్షన్ కూడా ఆకట్టుకునేలా ఉంది. ఆకాంక్ష సింగ్‌కి చాలా రోజుల తర్వాత మంచి పాత్ర దొరికింది. ఇక రాజేంద్రప్రసాద్ ఎప్పటిలాగే అదరగొట్టాడు. అర్చన కూడా తనదైన పాత్రలో ఆకట్టుకుంది. మిగతా పాత్రధారులు అందరూ ఆసక్తికరంగా తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే, ఇళయరాజా సంగీతం బాగుంది. కాకపోతే అన్నీ మెలోడీస్ కావడం కాస్త ఇబ్బందికరంగా అనిపించింది. అయితే ఉన్న అన్ని పాటలు ఆకట్టుకున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా చేరు తీసుకుని ఉంటే బాగుండేది. డైలాగ్స్ కొన్ని ఆకట్టుకునేలా ఉన్నా, మరికొన్ని సాదాసీదాగా అనిపించాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్‌గా షష్టిపూర్తి .. అందరి కప్ ఆఫ్ టీ కాదు.
తాజావార్తలు
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!