స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె బాలీవుడ్‌లో హీరోయిన్‌గా సత్తా చాటి, అనంతరం సౌత్‌లో కూడా కొన్ని సినిమాలు చేసింది. అయితే, ఇటీవల ఆమెను తీసుకున్న ‘కల్కి’ యూనిట్‌తో పాటు, ‘స్పిరిట్’ యూనిట్ కూడా ఆమెతో సినిమాలు చేయలేమని సినిమాల నుంచి తప్పించారు. అయితే, ఈ విషయం మీద చాలా రకాల చర్చలు జరిగాయి, ట్రోలింగ్స్ జరిగాయి. చివరికి, ఆమె ఈ అంశం మీద స్పందించింది. తాజాగా, పేర్లు ప్రస్తావించకుండా, “హీరోలు ఎనిమిది గంటల పని చేస్తారు, దానికి తోడు వారాంతాలు ఎగ్గొడతారు. కానీ, వాళ్ల గురించి ఎవరూ మాట్లాడరు. కానీ, ఈ మధ్యకాలంలో తల్లులైన కొంతమంది హీరోయిన్లు సైతం ఎనిమిది గంటలే పని చేస్తున్నారు. నేను మాత్రం అలా అడిగితే నన్ను ట్రోల్ చేస్తున్నారని” ఆమె స్పందించింది.
Also Read: Kishkindhapuri: ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
వాస్తవానికి, ఆమె హీరోయిన్లతో పోల్చి ఉంటే బాగానే ఉండేదేమో. కానీ, హీరోలతో పోల్చుకుని డిమాండ్స్ చేయడం గురించే ఇప్పుడు సినీ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, భారత సినీ పరిశ్రమ హీరోలను ఆధారంగా చేసుకుని మార్కెటింగ్ జరుగుతుంది. ఒక సినిమాలో హీరో మార్కెట్‌ను బట్టి, ప్రేక్షకుడు సినిమా చూడడానికి వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తాడు. హీరోయిన్ కోసం వచ్చే వాళ్లు కూడా ఉంటారేమో కానీ, వారు 10 శాతానికి కూడా మించరు అనేది నిపుణుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో, హీరోతో పోల్చుకుని తాను కూడా అన్ని గంటలే పని చేస్తానని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనేది చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే, దీపికా పదుకొనే లాంటి హీరోయిన్ ఒక సమయంలో ఒకటే సినిమా మాత్రమే చేయరు.
Also Read:Mana Shankara Vara Prasad Garu : ‘మీసాల పిల్ల’ సాంగ్ పై అప్డేట్ ఇచ్చిన బుల్లిరాజు
రెండు, మూడు సినిమాలు ఒప్పుకుని, ఒకే రోజు కొన్ని గంటలు ఒకచోట, కొన్ని గంటలు మరోచోట స్పెండ్ చేసేందుకు ప్రయత్నం చేస్తారు. కానీ, స్టార్ హీరోల పరిస్థితి అలా లేదు. ఎవరో ఒకరిద్దరూ ఒకే సమయంలో మల్టిపుల్ సినిమాలు చేస్తున్నారేమో కానీ, మిగతా వాళ్లందరూ ఒక సినిమా షూటింగ్ పూర్తి అయిన తరువాతే మరో షూటింగ్‌కి వెళుతున్నారు. హీరోతో కాంబినేషన్ సీన్స్ కోసం హీరోయిన్ రోజుకి 8 గంటల పని చేస్తాను అంటే, అది దర్శక నిర్మాతలకు ఇబ్బంది కలిగి ఉండవచ్చు. అందుకే ఆమెను తప్పించి ఉండవచ్చు. ఆ దర్శక నిర్మాతలు ఏమీ ఆమెను టార్గెట్ చేయలేదు. సోషల్ మీడియాలో ఆమె ప్రవర్తన నచ్చని కొంతమంది ట్రోల్ చేశారు. అలాంటి సమయంలో హీరోలతో పోల్చుకుంటూ ఆమె తనను తాను సమర్థించుకోవడం ఎంతవరకు కరెక్టో ఆమెకే తెలియాలి.
