Maharashtra Train Accident: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం..12 మంది మృతి..

  • మహారాష్ట్ర జల్‌గావ్‌లో ఘోర రైలు ప్రమాదం..
  • మంటలు వ్యాపించాయనే భయంతో ట్రాక్‌పై దూకిన ప్రయాణికులు..
  • వేరే ట్రాక్‌పై వస్తున్న బెంగళూర్ ఎక్స్‌ప్రెస్ ఢీ..
  • 12 మందికి పైగా మరణాలు.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం..
Train Accident

Train Accident

Maharashtra Train Accident: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. జలగావ్‌లోని పరండా రైల్వే స్టేషన్ దగ్గర ప్రమాదం జరిగింది. పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయనే భయంతో ప్రయాణికులు ట్రాక్‌పైకి దూకారు. అదే సమయంలో ట్రాక్ పై నుంచి వెళ్తున్న బెంగళూర్ ఎక్స్‌ప్రెస్ వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 12 మంది అక్కడిక్కడే మరణించారు.  పలువురు గాయపడ్డారు. పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌లో చైన్ లాగడంతో మంటలు చెలరేగినట్లు ప్రయాణికులు భావించారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Read Also: Lebanon: హిజ్బుల్లా టాప్ కమాండర్ హమాది హతం.. ఇంట్లో ఉండగా కాల్చివేత

×
×
Ad

చైన్ లాగడంతో పొగలు వ్యాపించాయి. మంటలుగా భావించిన ప్రయాణికులు రైలు నుంచి పక్కనే ఉన్న ట్రాక్‌పై దూకారు. ట్రాక్ దాటే ప్రయత్నం చేస్తుండగా, అదే ట్రాక్‌పై వేగంగా వస్తున్న బెంగళూర్ ఎక్స్‌ప్రెస్ వారిని ఢీకొట్టింది. ప్రాణభయంతో ట్రాక్‌పై దూకడంతో అనుకోకుండా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం, బ్రేకులు వేయడంతో చక్రాల నుంచి పొగలు వచ్చాయి. పుష్పక్ ఎక్స్ ప్రెస్ లక్నో నుంచి ముంబై వెళ్తోంది.