Zomato CEO Deepinder Goyal: ఫుడ్ డెలివరీ స్టార్టప్ జొమాటో ఒకటి కాదు ఏకంగా 3 కారణాల వల్ల ఈరోజు ముఖ్యాంశాల్లో చేరింది. వీటిలో అతిపెద్దది.. కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్ గోయల్ ఇప్పుడు బిలియనీర్ క్లబ్ లో చేరారు. జోమాటో షేర్లలో బలమైన పెరుగుదల కారణంగా కంపెనీలో అతని వాటా విలువ అకస్మాత్తుగా 1 బిలియన్ డాలర్స్ ను దాటేసింది. మార్కెట్ పెరుగుదల మధ్య వారం మొదటి రోజున జొమాటో షేర్ 3 శాతానికి పైగా పెరిగింది. దీనితో జొమాటో వ్యవస్థాపకుడు తన ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ వాటా విలువ సోమవారం 1 బిలియన్ డాలర్స్ ను దాటింది. ఫోర్బ్స్ ప్రకారం.. దీని కారణంగా జొమాటో సీఈవో నికర విలువ 1.4 బిలియన్లకు పెరిగింది. జొమాటో ద్వారా ప్లాట్ ఫారమ్ ఫీజులను పెంచుతున్నట్లు వచ్చిన నివేదికల తర్వాత స్టాక్ లో పెరుగుదల కారణంగా దీపిందర్ గోయల్ నికర విలువలో ఈ భారీ జంప్ కనిపించింది.
Puja Khedkar : రైతును తుపాకీతో బెదిరించిన ఐఏఎస్ పూజా ఖేద్కర్ తల్లి.. పోలీసులకు భయపడి పరార్
నివేదికల ప్రకారం ఢిల్లీ, బెంగళూరు వినియోగదారుల కోసం జొమాటో తన ప్లాట్‌ఫారమ్ ఫీజులను రూ. 1 పెంచింది. ఇంతకుముందు జొమాటో తన ప్లాట్‌ఫారమ్‌లో ఆర్డర్ చేసే కస్టమర్‌ల నుండి ఆర్డర్ కు రూ. 5 వసూలు చేస్తోంది. ఇప్పుడు దానిని రూ.6కి పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇది కంపెనీ లాభదాయకతపై సానుకూల ప్రభావం చూపుతుందన్న అంచనాలు సోమవారం కంపెనీ షేర్లలో ప్రతిఫలించాయి. ఇది సోమవారం 3 శాతానికి పైగా పెరిగి రూ. 232 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. వారంలో మొదటి ట్రేడింగ్ రోజైన సోమవారం జోమాటో షేర్ ఆల్ టైమ్ హైకి చేరుకుంది. ఇంతలో జొమాటో స్టాక్ రూ. 225 వద్ద ప్రారంభమైంది. దాని ముందటి ముగింపుతో పోలిస్తే లాభాలను ఆర్జించింది. ట్రేడింగ్ తక్కువ సమయంలో ఇది 3 శాతం కంటే ఎక్కువ జంప్ తో రూ. 232 స్థాయికి చేరుకుంది. జొమాటో స్టాక్‌లో ఇది 52 వారాల గరిష్ఠ స్థాయికి చేరింది. షేర్ ధర పెరుగుదల కారణంగా జొమాటో మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా పెరిగింది.
Viral Video: ఎంతకు తెగించార్రా.. వరద నీటిలో భార్యలను ఎత్తుకొని మరీ..!
గత త్రైమాసికంలో ఐపీఎల్ సీజన్ T20 క్రికెట్ ప్రపంచ కప్, దేశవ్యాప్తంగా మండుతున్న వేడి కారణంగా ప్రజలు ఎక్కువగా ఇంట్లోనే ఉన్నారు. ఈ సమయంలో జొమాటో పై చాలా ఆర్డర్లు చేయబడ్డాయి. నివేదికల ప్రకారం ఫుడ్ డెలివరీ వ్యాపారంలో కంపెనీ అద్భుతమైన వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా. జోమాటో షేర్‌హోల్డింగ్ విధానం ప్రకారం కంపెనీలో 4.26 శాతం వాటాతో సమానమైన 36,94,71,500 షేర్లు ఉన్నాయి. సోమవారం స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ సమయంలో జొమాటో షేర్లు సరికొత్త ఆల్-టైమ్ గరిష్ట స్థాయి 232 రూపాయలను తాకినప్పుడు.. దీనితో పాటు జొమాటో సీఈవో షేర్ విలువ కూడా గణనీయంగా పెరిగింది. 36.94 కోట్ల షేర్ల విలువ దాదాపు 8500 కోట్ల రూపాయలు దగ్గరగా వచ్చింది.