Zimbabwe vs Sri Lanka: శ్రీలంక గడ్డపై జింబాబ్వే సంచలనం విజయం.. టేబుల్ టాపర్‌గా రజా సేన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Zimbabwe vs Sri Lanka: టీ20 ప్రపంచకప్ 2026లో జింబాబ్వే అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. టోర్నీలో పెద్ద జట్లను కుదిపేయాలని కెప్టెన్ సికందర్ రజా ఇప్పటికే కంకణం కట్టుకున్నాడు. తాజాగా శ్రీలంక జట్టును ఆ దేశ ఓన్ గ్రౌండ్‌లోనే ఓడించింది. ఈ గ్రాండ్ విక్టరీతో సూపర్-8కు ముందే గ్రూప్–బీలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా లాంటి భారీ టీమ్‌ను ఓడించి సూపర్-8లోకి అర్హత సాధించిన జింబాబ్వే.. తాజాగా శ్రీలంకను సైతం ఓడించి గ్రూప్ టాపర్‌గా నిలిచింది. ప్రస్తుతం అంతర్జాతీయ టీ20 ర్యాంకింగ్స్‌లో జింబాబ్వే స్థానం చాలా తక్కువ. కానీ ఎనిమిదో స్థానంలో ఉన్న శ్రీలంకను ఓడించడం పెద్ద అప్సెట్గా మారింది. గత ఏడాది కూడా జింబాబ్వే శ్రీలంకపై రెండు సార్లు గెలిచింది. 2024లోనూ ఒకసారిఓడించింది. ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య జరిగిన పన్నెండు మ్యాచ్‌లలో శ్రీలంక ఎనిమిది గెలిచినా, జింబాబ్వే నాలుగు విజయాలతో తమ పోరాటస్ఫూర్తిని చూపించింది. కొలంబో ఆర్పీఎస్ మైదానం మాత్రం శ్రీలంకకు అదృష్టం కలిగించలేకపోతోంది. అక్కడ ఆడిన 34 మ్యాచ్‌లలో కేవలం తొమ్మిది విజయాలే రావడం బలహీనతను బయటపెట్టింది.
READ MORE: Amazon Deal: అమెజాన్ లో హాట్ డీల్.. Haier 190L ఫ్రిజ్ పై 31% డిస్కౌంట్..
Also Read
ఈ మ్యాచ్‌లో శ్రీలంక మొదట బ్యాటింగ్ చేసి మంచి ఆరంభం చేసింది. పాతుమ్ నిస్సంక అద్భుతంగా ఆడి 41 బంతుల్లో 62 పరుగులు చేశాడు. చివరి ఓవర్లలో పావన్ రత్నాయకే వేగంగా 25 బంతుల్లో 44 పరుగులు చేసి జట్టును 178 పరుగుల బలమైన స్కోరుకు చేర్చాడు. జింబాబ్వే బౌలర్లలో గ్రేమ్ క్రీమర్, బ్లెసింగ్ ముజరబాని, బ్రాడ్ ఇవాన్స్ ఇద్దేసి వికెట్లు తీసి పరుగులు అదుపులో పెట్టారు. 179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే బ్యాటింగ్ చాలా పద్ధతిగా సాగింది. బ్రియాన్ బెన్నెట్ మరోసారి అద్భుతంగా ఆడి 63 పరుగులతో జట్టుకు పునాది వేశాడు. ఈ ప్రపంచకప్‌లో వరుసగా మూడో అర్ధశతకం ఇది. ఓమాన్‌పై 48 నాటౌట్, ఆస్ట్రేలియాపై 64 నాటౌట్‌గా నిలిచి శ్రీలంకపై అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ సికందర్ రజా 45 పరుగులతో మ్యాచ్‌ను జింబాబ్వే వైపు తిప్పేశాడు. చివరకు 19.3 ఓవర్లలోనే నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించారు. ఈ విజయంతో తమ గ్రూపులో అగ్రస్థానాన్ని సంపాదించారు.
READ MORE: Naa Anveshana Shock: యూట్యూబర్ అన్వేష్ ఇన్‌స్టా అకౌంట్ బ్యాన్.. 1.3 మిలియన్ ఫాలోవర్స్ పోయారు..
తాజావార్తలు
-
Bengal’s Next CM: బెంగాల్లో మే 9న బీజేపీ ప్రభుత్వం.. సువేందుకే సీఎంగా ఛాన్స్..
-
Peddi: కథ విన్నాక 25 నిమిషాల పాటు తేరుకోలేకపోయా!
-
Vijay-Governor: కాసేపట్లో గవర్నర్‌ను కలవనున్న విజయ్
-
Bangladesh: బెంగాల్లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..
-
Congress TVK Alliance: మారిపోయిన తమిళ అధికార పక్షం మ్యాప్.. టీవీకే క్లీన్ స్వీప్.. డీఎంకే-కాంగ్రెస్ దోస్తీకి ‘ది ఎండ్’?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!