NTV Telugu Site icon

YV. Subba Reddy: అధికారంలోకి వచ్చినట్లు పవన్ కళ్యాణ్ పగటి కలలు కంటున్నాడు..

Yv

Yv

విశాఖపట్నంలో వేపగుంట నుంచి పెందుర్తి జంక్షన్ వరకు వైసీపీ సామాజిక సాధికారిత బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీగా అభిమానులు, కార్యకర్తలు తరలి వచ్చారు. సామాజిక సాధికార యాత్రలో మూడు జిల్లాల ఇంచార్జ్ వైవీ సుబ్బారెడ్డితో పాటు మంత్రులు గుడివాడ అమర్నాథ్, ముత్యాల నాయుడు, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. పవన్ పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Yogi Adityanath: పరీక్షలు సరిగ్గా నిర్వహించలేని వాడు.. ప్రభుత్వం ఏం నడుపుతాడు..!

జనసేనలాగ మాది పావలా బేడా పార్టీ కాదు అని వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. అధికారంలోకి వస్తున్నట్టు పవన్ కళ్యాణ్ పగటి కలలు కంటున్నాడు.. అసలు రాష్ట్రంలో ఉంటేనే కదా పగలు ఏం జరుగుతుందో చూస్తే రాత్రికి కలలు కానొచ్చు.. షూటింగ్ విరామంలో రాజకీయాలు చేసే పవన్ కు అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన పోరాడిన వైసీపీతో పోలికా.. రాష్ట్రంలో మరో 15 ఏళ్ళు జగనే సీఎం.. హామీలు ఇచ్చి మోసం చేసిన చంద్రబాబు కోసం పవన్ పని చేస్తున్నారు అని ఆయన ఆరోపించారు. రాజకీయ పార్టీగా ఎవరు ఎక్కడైనా పని చేయవచ్చు అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. తెలంగాణలో పవన్ ఎవరి కోసం ప్రచారం చేస్తున్నాడో గమనించండి.. బీసీల గురించి పుస్తకాలు వేసే నైతికత టీడీపీకి లేదు.. సామాజిక సాధికారిత అంటే ఏమిటో నిరూపించి చూపించింది ఒక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే అని ఆయన చెప్పుకొచ్చారు.