NTV Telugu Site icon

YV Subbareddy: పంచకర్ల రమేష్ బాబు రాజీనామా తొందర పాటు చర్య

Yv Subba Reddy

Yv Subba Reddy

YV Subbareddy: వైఎస్సార్‌సీపీ పార్టీకి పంచకర్ల రమేష్ బాబు రాజీనామాపై వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. పంచకర్ల రమేష్ బాబు రాజీనామా తొందర పాటు చర్య అని.. ఏ విషయమైనా తనతో చర్చించి ఉంటే బాగుండేదన్నారు. రమేష్ బాబు మంచి నాయకుడు అని, ఆలోచన చేయకుండా రాజీనామా చేయడం కరెక్ట్ కాదన్నారు. పార్టీలో ఆవిర్భావం నుంచి చాలా మంది ఉన్నారని.. సీఎంను కలవాలి అన్నప్పుడు తనతో మాట్లాడితే తప్పకుండా చర్చించేవాళ్లమన్నారు. విశాఖ గురజాడ కళాక్షేత్రంలో మెప్మా మార్కెట్ ప్రారంభించిన టీటీడీ ఛైర్మన్ వైవీ సుబారెడ్డి పంచకర్ల రాజీనామాపై స్పందించారు.

Also Read: Uttarapradesh : ఓరి దేవుడో.. ఇదేం కర్మరా బాబు..ఇలా తయారయ్యారెంట్రా బాబు..

పంచకర్ల రమేష్ బాబు రాజీనామా చేస్తూ చెప్పిన కారణాల గురించి ఆయన ప్రస్తావించారు. రమేష్ బాబు నిర్ణయం తీసుకునే ముందు పార్టీ ఇంఛార్జిగా తాను ఇక్కడ ఉన్నందుకు చర్చించి ఉంటే బాగుండేదన్నారు. జిల్లా అధ్యక్షుడిగా రమేష్‌ బాబు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలన్నీ కూడా తాను పరిష్కరించానన్నారు. ప్రజా సమస్యలపై స్పందించట్లేదు అని రమేష్ బాబు చెప్పిన మాటలు వాస్తవం కాదన్నారు. వైసీపీ పార్టీ వ్యవస్థాపక దినం నుంచి ఉన్న వారిని కూడా పక్కనపెట్టి రమేష్ బాబుకి జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చామన్నారు. సచివాలయం వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థలు చాలా బాగున్నాయని దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు, నాయకులు కొనియాడుతున్నారన్నారు. పవన్ కళ్యాణ్‌కు రాజకీయ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు.