Site icon NTV Telugu

YV Subba Reddy: ఆ కంటైనర్‌లో వెళ్లింది ఫర్నిచర్‌..! వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు..

Yv Subbareddy

Yv Subbareddy

విశాఖపట్నం డ్రగ్స్‌ కంటైనర్ కేసు తీవ్ర కలకలం రేపింది.. అయితే, ఈ కేసులో సీబీఐ స్పీడ్‌ పెంచి విచారణ చేస్తోంది.. మరోవైపు.. కంటైనర్‌ ఎటు వెళ్లినా.. దానిపై రకరకాల ప్రచారం సాగుతోంది.. విమర్శలు వస్తున్నాయి.. ఈ నేపథ్యంలో.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.. సీఎం క్యాంప్ ఆఫీస్ లోకి వెళ్లిన కంటైనర్‌పై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ శాఖలకు అవసరమైన ఫర్నిచర్‌ వెళ్తే దుష్ప్రచారం చేయడం దారుణం అని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు వైజాగ్ పోర్ట్ కు వచ్చిన డ్రగ్స్ కంటైనర్ నారా లోకేష్ బంధువులదే అని ఆరోపించారు.. అందుకే ఏ కంటైనర్ చూసినా వారికి అనుమానం వస్తుందని దుయ్యబట్టారు.. దొడ్డి దారిలో మంత్రి అయిన నారా లోకేష్ కు ఇంతకుమించి సంస్కారం ఉంటుందని అనుకోలేమని హాట్‌ కామెంట్లు చేశారు.

Read Also: Disha Patani: హీట్ సమ్మర్ లో హాటెస్ట్ అందాలు ఆరబోస్తున్న దిశా పటాని..

మరోవైపు, బీసీల అడ్డా అయిన ఉత్తరాంధ్రలో ఎంపీ అభ్యర్థులుగా ఓసీలు అయిన శ్రీ భరత్, సీఎం రమేష్‌లకు టికెట్లు ఇచ్చి కూటమి ఏం మెసేజ్ ఇచ్చిందో చెప్పాలి? అని నిలదీశారు. వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా స్థానిక బీసీలకే పోటీ చేసే అవకాశం ఇచ్చిందని గుర్తుచేశారు. ఉత్తరాంధ్ర లో ఇతర ప్రాంత ఎంపీ ఓసీ అభ్యర్థుల ఆధిపత్యాన్ని ప్రచారంలో ఎండగడతాం అన్నారు వైవీ సుబ్బారెడ్డి.. కాగా, ఎన్నికల తరుణంలో కంటైనర్ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోన్న విషయం విదితమే.

Exit mobile version