YV Subba Reddy: వారాహి యాత్రలో ఏపీ ప్రభుత్వం, అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి.. విశాఖకు చేరుకున్న మూడు జిల్లాల కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డికి ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం పలికారు నేతలు, కార్యకర్తలు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వారాహి యాత్ర అనేది గతంలో కూడా ఉన్నదే.. ఇప్పుడు కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదన్నారు. అప్పుడు పొత్తులు బైట పడలేదు.. ఇప్పుడు చంద్రబాబు అవినీతి చేసి జైలుకు వెళ్లడంతో పవన్ కల్యాణ్ సింపతికోసం పొత్తులు పెట్టుకున్నాడు అని ఆరోపించారు. తప్పుచేసిన వ్యక్తికి ఏవిధంగా సపోర్ట్ చేస్తారు..? అని ప్రశ్నించారు. న్యాయస్థానంలో కూడా బెయిల్ రాక జైలులో ఉన్న వ్యక్తికి ఏ విధంగా మద్దతు తెలుపుతారు? అంటూ పవన్ ను నిలదీశారు వైవీ సుబ్బారెడ్డి.
Read Also: Tamilnadu: తమిళనాడు పటాకుల ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. వందమీటర్ల దూరంలో ఎగిసిపడిన మృతదేహాలు
ఇక, మహిళలను కించపరిచి, జైలుకు వెళ్లి వచ్చినవారు కూడా సంబరాలు చేసుకోవడం చాలా విడ్డూరంగా ఉందంటూ మాజీ మంత్రి, టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తిపై సెటైర్లు వేశారు వైవీ సుబ్బారెడ్డి.. మరోవైపు.. విశాఖకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి నెల వస్తున్నారు.. పరిపాలన విషయంలో అధికారులు తగు ఏర్పాట్లు చేసిన వెంటనే పూర్తిగా ఇక్కడ నుండి పాలన కొనసాగిస్తారని వెల్లడించారు. చంద్రబాబు విషయంలో న్యాయస్థానం కూడా సరైన నిర్ణయాన్ని ప్రకటించడం వలన ప్రజలకు న్యాయస్థానాల పట్ల మరింత గౌరవం పెరిగిందన్నారు. చట్టం అందరికీ సమానమే అని, తప్పుచేసిన ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని హెచ్చరించారు వైవీ సుబ్బారెడ్డి.