YV Subba Reddy: వైనాట్ 175 అంటూ వచ్చే ఎన్నికలకు సిద్ధం అవుతోన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. అభ్యర్థుల్లో మార్పులు, చేస్తోంది.. దీంతో.. కొన్ని నియోజకవర్గాల్లో అసంతృప్తి మొదలైంది.. మరికొందరు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. అయితే, 175 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్నాం.. అందుకే మార్పులు చేర్పులు జరుగుతున్నాయని తెలిపారు వైసీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి.. విశాఖ నార్త్ నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 175 నియోజకవరర్గాల్లో గెలుపు లక్ష్యంగా మార్పులు చేస్తున్నాం అన్నారు.. ఉత్తరాంధ్రలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం కోసం విశాఖ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీకి అవకాశం కల్పించాం. కుటుంబ పరంగా మేం సీట్లు ఇవ్వడం లేదు. ప్రజల్లో బలం, అర్హత ఉన్న వాళ్లకే అవకాశం కల్పిస్తున్నాం అన్నారు.
Read Also: Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త మండలాలను, జిల్లాలను రద్దు చేస్తుందట..!
ఇక, చంద్రబాబు అన్ని వర్గాలను రెచ్చగొట్టి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు వైవీ సుబ్బారెడ్డి.. మరోవైపు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మానాభం.. జనసేనలో చేరుతున్న విషయం నాకు తెలియదు అన్నారు.. దీనిపై అవగాహన లేదని దాటవేశారు. ఇక, ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేయాల్సిన విశాఖను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చొరవతో క్లీన్ సిటీగా.. విశాఖపట్నం.. జాతీయ స్థాయిలో నాలుగో స్థానానికి చేరుకుందని సంతోషాన్ని వ్యక్తం చేశారు మాజీ ఎంపీ, వైసీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి. కాగా, వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కొన్ని అభ్యర్థులను మారుస్తూ వస్తున్నారు సీఎం వైఎస్ జగన్.. ఇప్పటికే మూడు జాబితాలు విడుదల చేయగా.. ఇప్పుడు నాల్గో లిస్ట్‌పై వైసీపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది.