భారత్ మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్, ధనశ్రీ వర్మలు విడాకులు తీసుకోబోతున్నారంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం, యూజీ తన ఖాతా నుంచి ధనశ్రీ ఫొటోలను తొలగించడం ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. చహల్, ధనశ్రీ విడిపోయేందుకు సిద్దమయ్యారని సంబంధింత వర్గాలు కూడా వెల్లడించాయి. ఈ నేపథ్యంలో బుధవారం ధనశ్రీ ఈ వార్తలపై ఓ పోస్టు చేసింది. తాజాగా చహల్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించాడు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కావచ్చు, కాకపోవచ్చని పోస్టు చేశాడు.
‘అభిమానుల మద్దతు లేకుంటే నేను ఈ స్థాయికి చేరుకునేవాడిని కాదు. ఫాన్స్ ప్రేమకు ధన్యవాదాలు. అయితే ఈ ప్రయాణం ఓవర్‌కి ఎంతో దూరంలో ఉంది. నా దేశం, జట్టు, అభిమానుల కోసం ఇంకా ఎన్నో అద్భుతమైన ఓవర్స్ మిగిలే ఉన్నాయి. ఓ కుమారుడిగా, సోదరుడిగా, స్నేహితుడిగా, క్రీడాకారుడిగా ఎంతో గర్వపడుతున్నా. ఇటీవల నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలపై అభిమానుల ఆసక్తిని నేను అర్థం చేసుకుంటా. సోషల్ మీడియాలో వస్తున్న న్యూస్ నాకు తెలిసింది. అయితే అవి నిజం కావచ్చు, కాకపోవచ్చు. ఇలాంటి ఊహగానాల్లో మునిగిపోకుండా ఉండాలని మీ అందరిని కోరుతున్నా’ అని చహల్ పోస్ట్ చేశాడు.
Also Read: Shikhar Dhawan: నాన్నా నేను మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా.. వీడియో వైరల్!
‘ఇలాంటి వార్తలు నాకు, నా కుటుంబానికి ఎంతో బాధ కలిగిస్తాయి. ఎప్పుడూ ఇతరుల మంచి కోరుకోవాలని నాకు నా కుటుంబం నేర్పించింది. విజయానికి దగ్గరి దారులు నేను ఎప్పుడూ వెతికను. అకింతభావం, శ్రమను నేను నమ్ముకుంటా. ఎప్పుడూ వీటికే కట్టుబడి ఉంటాను. నాపైన సానుభూతి కాకుండా.. ప్రేమ, మద్దతు చూపాలని కోరకుంటాను’ అని యుజ్వేంద్ర చహల్ తెలిపాడు. మీడియాలో వస్తోన్న వార్తల వల్ల తాను మానసిక వేదనకు గురవుతున్నట్లు ధనశ్రీ పేర్కొన్నారు. నిజానిజాలు తెలుసుకోకుండా అవాస్తవాలు రాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చహల్, ధనశ్రీలు విడాకుల అంశం స్పందించినా క్లారిటీ మాత్రం లేకుండా పోయింది.