Site icon NTV Telugu

Yuzvendra Chahal: ఆటగాడే.. ‘చాలా క్యూట్గా ఉన్నావు’ అంటూ మరో వివాదంలో స్టార్ బౌలర్.. వీడియో వైరల్.!

Yuzvendra Chahal

Yuzvendra Chahal

Yuzvendra Chahal: టీమిండియా స్పిన్నర్, ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్న యుజ్వేంద్ర చాహల్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. రెండు రోజుల క్రితం సిగరెట్ తాగుతూ రోడ్డుపై పడేసిన వీడియోపై విమర్శలు ఎదుర్కొన్న ఆయన, ఇప్పుడు వ్యక్తిగత జీవితం కారణంగా మళ్లీ వార్తల్లో నిలిచారు. అసలేం జరిగిందంటే.. నటి, మోడల్ టానియా ఛటర్జీ (Taniya Chatterjee) తాజాగా చాహల్‌పై సంచలన ఆరోపణలు చేశారు. చాహల్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీకి “Aap cute ho” (నువ్వు చాలా క్యూట్ గా ఉన్నావు) అంటూ వ్యక్తిగత మెసేజ్ పంపినట్టు ఆమె పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆమె మీడియా వారికి తన ఇన్‌బాక్స్ చూపిస్తూ వెల్లడించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

ఈ ఘటనతో సోషల్ మీడియాలో చాహల్ పై మరోసారి పెద్ద చర్చ ప్రారంభమైంది. ముఖ్యంగా చాహల్ వ్యక్తిగత జీవితం గత కొంతకాలంగా తరచూ వార్తల్లో నిలుస్తుండటం ఈ వివాదానికి మరింత ఆద్యం పోసినట్లయింది. గత ఏడాది చాహల్ తన భార్య, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ (Dhanashree Verma)తో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత RJ మహ్వాష్‌తో ఆయనకు సంబంధాలు ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే కొద్ది నెలలకే ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేయడం మరోసారి చర్చకు దారితీసింది.

Stock Market: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్.. లక్షల కోట్లు ఆవిరి

క్రికెట్ పరంగా చూస్తే చాహల్ ప్రదర్శన సాధారణ స్థాయిలోనే ఉంది. ఐపీఎల్ 2026లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లలో మూడు వికెట్లు సాధించారు. గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్ రన్నరప్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ మధ్య AB డివిల్లీర్స్ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడిన చాహల్.. తన ఫిట్‌నెస్‌పై మరింత దృష్టి పెట్టినట్టు చెప్పారు. “నేను మద్యం పూర్తిగా మానేశాను. ఇప్పుడు 35 ఏళ్లు కావడంతో ఇంకా ఫిట్‌గా ఉండి జట్టుకు 150 శాతం ఇవ్వాలని భావిస్తున్నాను. సీనియర్ ప్లేయర్‌గా ఇతరులకు ఆదర్శంగా ఉండాలని అనుకుంటున్నాను” అని తెలిపారు.

Exit mobile version