Chahal: “భారత్‌ను ఓడించే సత్తా వారికి మాత్రమే ఉంది”.. టీ20 వరల్డ్ కప్‌పై చహల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yuzvendra Chahal: టీమిండియాలో అనుభవజ్ఞుడైన స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ చాలా కాలంగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. T20 వరల్డ్ కప్ 2024 జట్టులో ఉన్నప్పటికీ ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. చహల్ చివరి అంతర్జాతీయ మ్యాచ్ 2023 ఆగస్టులో వెస్టిండీస్‌తో జరిగింది. అయితే.. తాజాగా ఓ జాతీయ మీడియా సంస్థ ప్రోగ్రామ్‌లో చహల్ పాల్గొన్నాడు. తన కెరీర్, టీమ్ ఇండియా భవిష్యత్తు, సోషల్ మీడియా ట్రోలింగ్, రిటైర్మెంట్ ప్లాన్‌ల గురించి మనసు విప్పి మాట్లాడాడు. ఆ మాటల్లో ఆత్మవిశ్వాసం, బాధ భారత క్రికెట్‌పై నమ్మకం కనిపించింది. కాగా.. ఈ ప్రోగ్రామ్‌లో 2026 టీ20 వరల్డ్‌కప్ గురించి చహల్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తికరంగా మారాయి. “భారతదేశం తన చేతిలోనే తానే ఓడిపోతుంది. మనం తప్పు చేస్తేనే ఓడిపోతాం. మిగతా జట్లు మనల్ని ఓడించే స్థాయిలో లేవు.” అని తెలిపాడు. ప్రస్తుతం వరల్డ్ కప్ టీం గురించి ప్రస్తావిస్తూ.. టీమ్‌లో అనుభవం ఉన్న ఆటగాళ్లు, కొత్త ఉత్సాహంతో ఉన్న యువకులు ఉన్నారు. జట్టు బలంగా ఉందని చెప్పుకొచ్చాడు.
READ MORE: Vishwambara Release Date: ఉస్తాద్, పెద్ది క్లోజ్.. ఇక అందరి కళ్లు మెగాస్టార్ ‘విశ్వంభర’పైనే!
Also Read
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
చహల్ ట్రోలింగ్స్‌పై స్పందించాడు. తనకు ట్రోలింగ్స్ పెద్దగా బాధ పెట్టవని చెప్పాడు. కానీ కొందరు తన పేరుతో ఇతరుల పేర్లు కలిపి వ్యక్తిగత కథలు అల్లుతారు. అది మాత్రం బాధగా ఉంటుందని వెల్లడించాడు. అయినా ఇలాంటి అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకుండా క్రికెట్‌పైనే దృష్టి పెడుతున్నట్లు తెలిపాడు. రిటైర్మెంట్‌పై వస్తున్న వార్తలపై చహల్ వివరణ ఇచ్చాడు. “ఇంకా 5–6 సంవత్సరాలు ఆడాలనుకుంటున్నాను. మైదానంలోకి వెళ్లినప్పుడు ఆనందం, ఆడాలనే తపన ఉంటే చాలు. అప్పటివరకు క్రికెట్‌నే నా ప్రపంచం” అని స్పష్టం చేశాడు. 35 ఏళ్ల వయసులోనూ అతనిలో ఉన్న ఆత్మవిశ్వాసం అభిమానులకు ధైర్యం ఇస్తోంది. అయితే.. బౌలర్ల గురించి మాట్లాడుతూ.. జస్ప్రీత్ బుమ్రాను ప్రపంచంలోనే నంబర్ వన్ బౌలర్‌గా అభివర్ణించాడు. హార్దిక్ పాండ్యాను జట్టుకు అత్యంత కీలకమైన ఆల్‌రౌండర్ అని తెలిపాడు. తిలక్ వర్మ, అభిషేక్ శర్మ లాంటి యువ ఆటగాళ్లను ప్రత్యేకంగా మెచ్చుకున్నాడు. వాళ్లలో దూకుడు ఆలోచన ఉందని, అదే టీమ్‌కి కొత్త శక్తినిస్తోందని అన్నాడు. కెప్టెన్సీ గురించి కూడా చహల్ ఓ ఆసక్తికర మాట చెప్పాడు. కెప్టెన్ ఎవరు అన్నది పెద్ద విషయం కాదు. ఆటగాళ్లు తమ ఆటపై దృష్టి పెట్టాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!