NTV Telugu Site icon

Yuvraj Singh: రోహిత్ శర్మ కెప్టెన్సీపై యువీ కీలక వ్యాఖ్యలు..!

Yuvi

Yuvi

T20 World Cup 2024: వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా అతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచ కప్ -2024 టోర్నీ జూన్ 1వ తేదీ నుంచి స్టార్ట్ కానుంది. ఈ టోర్నమెంట్లో భారత్ తన తొలి మ్యాచ్ ను జూన్ 5న ఐర్లాండ్ తో ఆడబోతుంది. ఇప్పటికే బీసీసీఐ టీమిండియా జట్టుతో ప్రకటించడంతో పాటు కొత్త జెర్సీని కూడా ఆవిష్కరించింది. ఇక, రోహిత్ శర్మ సారథ్యంలో భారత జట్టు టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఆడనుంది. ఈ క్రమంలో రోహిత్ శర్మ కెప్టెన్సీపై భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీ20 ప్రపంచ కప్ బ్రాండ్ అంబాసిడర్ గా ఐసీసీ యువరాజ్ సింగ్ ను నియమించింది.

Read Also: Alia Bhatt : అలియాభట్ చీర వెనుక అంత రహస్యం ఉందా?

ఇక, రోహిత్ శర్మ కెప్టెన్సీపై యువరాజ్ సింగ్ మాట్లాడుతూ.. ఈ టీ20 ప్రపంచ కప్ లో టీమిండియాకు రోహిత్ శర్మ కెప్టెన్సీ చాలా కీలకం కాబోతుందన్నారు. రోహిత్ మంచి కెప్టెన్. ఒత్తిడిలోనూ సరియైన నిర్ణయాలు తీసుకునే తెలివైన సారథి అతడు.. కెప్టెన్ గా ఐదు ఐపీఎల్ ట్రోపీలు గెలిచాడు.. టీమిండియాకు కెప్టెన్ రోహిత్ లాంటి వ్యక్తి అవసరమని నేను భావిస్తున్నా.. రోహిత్ ను ప్రపంచ కప్ ట్రోపీ, ప్రపంచ కప్ పతకంతో చూడాలనుకుంటున్నాను అని యువరాజ్ సింగ్ వెల్లడించారు.

Read Also: NBK 109: బాలయ్య సినిమా యూకే రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్..

కాగా, రోహిత్ శర్మ ఎప్పుడూ నార్మల్ గా ఉంటాడు అని యువీ అన్నారు. టీమ్ విజయం సాధించిన తరువాత కూడా అతనిలో ఎలాంటి గర్వం, మార్పు కనిపించదని పేర్కొన్నారు. అది రోహిత్ శర్మను మరింత సమర్ధవంతమైన కెప్టెన్ గా మార్చిందన్నారు. ఎప్పుడూ తనతోటి కుర్రాళ్లతో రోహిత్ సరదాగా ఉండటంతో పాటు వారిపై జోకులు వేస్తూ అందరితో కలివిడిగా గడిపేస్తాడు. గ్రౌండ్ లో గొప్ప నాయకుడు రోహిత్.. నాకు సన్నిహిత క్రికెటర్లలో రోహిత్ ఒకరు అని యువరాజ్ సింగ్ తెలిపారు.