NTV Telugu Site icon

Yuvraj Singh: ధోనీ, కోహ్లీ, రోహిత్‌.. యువరాజ్‌ ఫేవరెట్‌ కెప్టెన్ ఎవరో తెలుసా?

Yuvraj Singh

Yuvraj Singh

Yuvraj Singh Reveals His Favourite India Captain: 2007 టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే ప్రపంచకప్‌ను భారత్ కైవసం చేసుకోవడంలో మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ పాత్ర మరువలేనిది. తన బ్యాటింగ్, బౌలింగ్‌తో ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. అయితే 2014 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో ఇన్నింగ్స్ చివరలో 21 బంతుల్లో 11 రన్స్ మాత్రమే చేసి విమర్శలపాలయ్యాడు. ఆపై జట్టులో చోటు దక్కకపోవంతో యూవీ 2019లో అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికాడు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న యువరాజ్‌.. తన ఫేవరెట్‌ కెప్టెన్ ఎవరో చెప్పాడు.

ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్‌ వాన్‌, ఆస్ట్రేలియా మాజీ వికెట్‌ కీపర్‌ ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌తో కలిసి యువరాజ్‌ సింగ్‌ ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొనగా.. ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్‌ శర్మలలో ఎవరిని అత్యుత్తమ కెప్టెన్‌గా ఎంచుకుంటారు అనే ప్రశ్న ఎదురైంది. టీ20 ఫార్మాట్‌కు రోహిత్‌ను కెప్టెన్‌గా ఎంచుకుంటానని ఆసక్తికర సమాధానమిచ్చాడు. ‘టీ20 క్రికెట్‌లో రోహిత్‌ శర్మను ఎంచుకుంటా. రోహిత్‌ అత్యుత్తమ కెప్టెన్‌. అతడు తన బ్యాటింగ్‌తో క్షణాల్లో మ్యాచ్‌ను మార్చగలడు. నా ఫస్ట్ ఛాయిస్‌ కెప్టెన్ రోహితే’ అని యువీ చెప్పాడు.

Also Read: Shakib Al Hasan: షకిబ్ సెక్యూరిటీతో మాకు సంబంధం లేదు: బంగ్లాదేశ్‌ క్రికెట్ బోర్డు

ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీలలో ఎవరిని బెంచ్‌కు పరిమితం చేస్తావని ఇద్దరు దిగ్గజాలు యువరాజ్‌ సింగ్‌ను మరో ప్రశ్న అడిగారు. ‘ఇద్దరిలో ఒకరిని ఎంచుకుంటే అది ప్రపంచవ్యాప్తంగా మీడియాలో హెడ్‌లైన్స్‌ అవుతుంది. కాబట్టి నేనే బెంచ్‌కు పరిమితవుతా’ అని యువీ పేర్కొన్నాడు. నవంబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభంకానున్న బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీని భారత్ 3-2తో గెలుస్తుందని యువరాజ్‌ ధీమా వ్యక్తం చేశాడు.