Yuvraj Singh: వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మలను వెంటనే వన్డే జట్టులోకి తీసుకోవాలని, లేకపోతే అది దేశంలోని ప్రతిభను కాలరాయడమే అవుతుందని టీమిండియా మాజీ దిగ్గజం యువరాజ్ సింగ్ బీసీసీఐ సెలెక్టర్లపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ యువ ఆటగాళ్లను 50 ఓవర్ల ఫార్మాట్‌కు ఎంపిక చేయకపోతే వారి టాలెంట్‌కు అన్యాయం చేసినట్టేనని ఆయన పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఈ చర్చలో ఇషాన్ కిషన్ పేరును కూడా ప్రస్తావించారు.
ప్రస్తుతం అభిషేక్ శర్మ టీ20ల్లో ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్‌గా కొనసాగుతున్నప్పటికీ, కేవలం టీ20 ఫార్మాట్‌కే పరిమితమయ్యాడు. మరోవైపు అతి పిన్న వయసులోనే తన విధ్వంసక బ్యాటింగ్‌తో సంచలనం సృష్టిస్తున్న వైభవ్ సూర్యవంశీకి కూడా జట్టులో స్థానం దక్కడం కష్టంగా మారింది. అయితే, రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌ల రూపంలో ఇప్పటికే అత్యుత్తమ ఓపెనింగ్ జోడీ జట్టులో ఉండటం, యశస్వి జైస్వాల్ అద్భుతంగా ఆడుతున్నప్పటికీ తుది జట్టులో చోటు కోసం కష్టపడుతుండటం సెలెక్టర్లకు పెద్ద సవాలుగా మారింది.
ఇక, గణాంకాలను పరిశీలిస్తే అభిషేక్ శర్మ లిస్ట్-ఏ క్రికెట్‌లో 68 ఇన్నింగ్స్‌లలో 33.78 సగటుతో 2196 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 8 అర్ధశతకాలు ఉన్నాయి. ఇది టీ20లకు బాగానే ఉన్నా, వన్డే టాప్ ఆర్డర్‌కు ఇది సరిపోదని భావిస్తున్నారట. ఇక వైభవ్ సూర్యవంశీ ఇప్పటివరకు తక్కువ వన్డేలే ఆడినప్పటికీ 43.38 సగటుతో 564 పరుగులు చేశాడు. ముఖ్యంగా అతడి 176.80 స్ట్రైక్‌రేట్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం భారత క్రికెట్‌లో టాలెంట్‌కు కొదవ లేకపోయినా, పరిమిత స్థానాల కారణంగా సెలెక్టర్ల ముందు తలనొప్పులు పెరుగుతున్నాయి. మరి యువరాజ్ చేసిన ఈ డిమాండ్‌పై సెలెక్షన్ కమిటీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

