NTV Telugu Site icon

YSRCP vs BJP: ఏపీలో హీటెక్కిన రాజకీయం.. బీజేపీ వర్సెస్ వైసీపీ..!

Ysrcp Vs Bjp

Ysrcp Vs Bjp

YSRCP vs BJP: ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కసారిగా పొలిటికల్‌ హీట్‌ పెరిగిపోయింది.. బీజేపీ వర్సెస్ వైసీపీగా మారిపోయింది.. రెండు పార్టీల నేతల మధ్య డైలాగ్‌ వార్‌ నడుస్తోంది.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఏపీలో పర్యటనలో వైసీపీ సర్కార్‌పై చేసిన కామెంట్స్ కాక రేపుతున్నాయి. శ్రీకాళహస్తిలో నడ్డా, విశాఖలో అమిత్‌ షా.. ఇద్దరూ నేరుగా జగన్‌ సర్కార్‌పై విమర్శలు చేయడమే కాదు.. ఓ రేంజ్‌లో ఆరోపణలు చేయడం చర్చనీయాంశమైంది. ఏపీ సర్కార్‌ అవినీతిలో కూరుకుపోయిందని, ల్యాండ్‌-లిక్కర్‌ మాఫియాతో పాటు అన్నీ స్కాములే జరుగుతున్నాయని.. రాష్ట్రానికి వచ్చి మరీ బహిరంగ సభల్లో చెప్పడం పొలిటికల్‌గా హీట్‌ పెంచేసింది. ఏపీ అభివృద్ది నిలిచిపోయిందని, ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలు కేంద్రానికి సంబంధించినవేనంటూ బీజేపీ అగ్ర నేతల నోట రావడంతో పెద్ద కలకలమే రేపింది.

Read Also: Kiss Benifits : ముద్దు పెట్టుకుంటే కండరాల్లో మార్పులు వస్తాయా? ఆసక్తికర విషయాలు..

ఇక, సోము వీర్రాజు, దగ్గుబాటి పురంధేశ్వరి చేసే విమర్శలు, ఆరోపణలకయితే.. వైసీపీ నుంచి పేర్ని నాని, అంబటి రాంబాబు ఘాటుగా రియాక్ట్‌ అయ్యారు. కానీ, అమిత్‌ షా, జేపీ నడ్డా తమ పాలనను డైరెక్ట్ ఎటాక్‌ చేయడంతో సీఎం వైఎస్‌ జగన్‌ కూడా బీజేపీకి కౌంటర్‌ ఇచ్చేసరికి మాటలయుద్ధం మరింత పతాకస్థాయికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. కురుక్షేత్ర సంగ్రామంలో తన ధైర్యం, బలం ప్రజలేనని చెబుతూ బీజేపీకి పంచ్‌ వేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి.. బీజేపీ అగ్రనేతలకు నేరుగా ముఖ్యమంత్రే కౌంటర్‌ ఇచ్చేసరికి.. వైసీపీ కీలక నేతలు, మంత్రులు కూడా రంగంలోకి దిగారు. బీజేపీ మళ్లీ టీడీపీ ట్రాప్‌లో పడిందని, 2014-19 మధ్య కాలంలో ఏపీలో జరిగిన అవినీతిలో బీజేపీ భాగస్వామ్యం ఉందని మండిపడుతున్నారు.

Read Also: Samantha : సమంత సౌత్ సినిమాలకు గ్యాప్ ఇచ్చిందా..?

వచ్చే ఎన్నికల్లో వైసీపీ సింగిల్‌గానే పోటీ చేయనుంది. ఇటీవల చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అమిత్‌ షా, నడ్డాతో చర్చలు జరిపారు. ఇప్పుడు నడ్డా, అమిత్‌ షా ఏపీ వచ్చిన వెంటనే వైసీపీని టార్గెట్‌ చేశారు. దీంతో ఈ రెండు పార్టీలది ఇంతవరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్లు రాజకీయాలు నడవడం ఖాయంగా కనిపిస్తోంది. విశాఖలో జగన్‌ పాలనపై అమిత్‌ షా డైరెక్ట్‌ అటాక్‌కు దిగడానికి కారణం ఏంటి ? ఇంతకాలం సహకరించినవాళ్లు ఇప్పుడు ఎందుకు అడ్డం తిరిగారు? అంటే ఏపీలో జనసేన, టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు పొడుస్తుందా అనే ఊహాగానాలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో వైసీపీని బీజేపీ రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తోందనే టాక్‌ వినిపిస్తోంది. ఇదంతా చూస్తుంటే బీజేపీ, వైసీపీ మధ్య మాటలయుద్ధం ఎన్నికల వేళ మరింత హీట్‌ రాజేయడం ఖాయమని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.