Site icon NTV Telugu

Arudra Meets CM Chandrababu: ఆరుద్రకు సీఎం చంద్రబాబు హామీ

Arudra

Arudra

Arudra Meets CM Chandrababu: తనను కలిసిన కాకినాడ జిల్లాకు చెందిన బాధిత మహిళా ఆరుద్రకు అండగా నిలిచారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. దివ్యాంగురాలైన ఆమె కుమార్తెకు రూ. 10 వేల పెన్షన్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చిన ఆయన.. ఆరుద్ర కుమార్తె వైద్యానికి రూ. 5 లక్షల సాయం ప్రకటించారు.. గత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ హయాంలో ఆర్థిక సాయం అందక, కుమార్తెకు వైద్యం అందక ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆరుద్ర. అంతేకాదు.. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా గన్‌మెన్‌తో పాటు వైసీపీ నేతల దాడిలో బాధిత మహిళ ఆరుద్ర, ఆమె కుమార్తె గాయపడ్డారు.. మరోవైపు.. ఆమె ఆస్తి వివాదాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సాయం చేస్తుందని కూడా హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు.

Read Also: Astrology: జూన్ 15, శనివారం దినఫలాలు

కాగా, వైసీపీ హయాంలో దివ్యాంగురాలైన కుమార్తెకు వైద్యం అందక ఇబ్బందులు పడిన ఆరుద్ర.. అప్పటి సీఎం వైఎస్‌ జగన్ ని కలిసేందుకు వెళ్తే.. గేటు నుంచే వెనక్కి పంపారనే విమర్శలు వచ్చాయి.. ఇక, ఆరుద్ర ఆస్తిని వైసీపీ నేతల అండతో కబ్జా చేస్తే, ఏ చర్యలూ తీసుకోలేదని బాధితిరాలు కన్నీరుపెట్టుకున్నారు.. అయితే, శుక్రవారం సీఎం చంద్రబాబుని ఆరుద్ర కలిశారు. కుమార్తెకు వైద్యం, దివ్యాంగుల పెన్షన్ అందిస్తామని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఆస్తి వివాదం పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మానవతా దృక్పథంతో అండగా నిలిచారు. ఆమె కుమార్తె వైద్యానికి రూ. 5 లక్షల సాయం ప్రకటించడమే కాకుండా నెలకు రూ.10 పింఛను అందించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. కోర్టులో ఉన్న స్థల వివాదంపై ప్రభుత్వ పరంగా ఎంత వరకు సాయం చేయవచ్చు అనేది కూడా పరిశీలించి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు.

https://twitter.com/AndhraPradeshCM/status/1801679012084785639

Exit mobile version