Site icon NTV Telugu

YSRCP: ట్విటర్‌ను ఊపేస్తున్న వైసీపీ సోషల్ మీడియా సైన్యం

Ysrcp

Ysrcp

YSRCP Social Media: ఏపీలో అధికార పార్టీ వైసీపీ రెండో సారి అధికారంలోకి రావ‌డానికి ముమ్మర ప్రయ‌త్నాలు చేస్తోంది. ప‌క్కా వ్యూహాల‌తో ముందుకు వెళ్తోంది. ఎక్కడ ఏ చాన్స్ వ‌ద‌ల‌కుండా అన్నింటిపై ఫోక‌స్ పెట్టింది. గ‌త ఎన్నిక‌ల్లో ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్. ఇప్పుడు మ‌రో సారి అధికారం ద‌క్కించుకోవాల‌ని, పార్టీని ప‌రుగులు పెట్టించాల‌ని సోష‌ల్ మీడియాపై ఫోక‌స్ పెట్టిన‌ట్లు తెలుస్తోంది. అయితే వైసీపీకి గ్రామ‌ స్థాయి వ‌ర‌కు క్యాడర్ చాలా ఉంది. గత మూడు ఎన్నికల నుంచి సీన్ మొత్తం మారింది. సోషల్ మీడియాదే ఇపుడు పై చేయిగా ఉంది.ఇక వైసీపీకి 2019 ఎన్నికల్లో అసలైన ప్రచారం అంతా సోషల్ మీడియాలోనే జరిగింది. చేతిలో ఫోన్ ఉన్న ప్రతీ వారి బుర్రలోకి వైసీపీని సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎక్కించేశారు. ఇపుడు కూడా అదే రకంగా పార్టీని జనాలలో ఉంచాలని తాము ప్రభుత్వంలో ఉంటూ చేసిన కార్యక్రమాలను కూడా జనంలో ఉంచాలని చూస్తోంది వైసీపీ.అందుకోసం సోషల్ మీడియా సైన్యాన్ని ఏపీ అంతటా భారీ ఎత్తున తయారు చేయడానికి ప‌క్కా వ్యూహంతో అడుగులు వేస్తోంది.పార్టీ గురించి ప్రభుత్వం గురించి సానుకూలంగా సోషల్ మీడియా ద్వారా జనంలోకి తీసుకుపోవడం ద్వారా వైసీపీకి మరోసారి విజయాన్ని దక్కించుకోవడానికి పార్టీ ఈ ప్లాన్ వేసింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Read Also: Rs 2,000 Notes: మే 23 నుంచి రూ. 2,000 నోట్లను మార్చుకోవచ్చు.. క్లారిటీ ఇదిగో?

ఇదిలా ఉండగా వైసీపీ సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. వైసీపీ సోష‌ల్ మీడియా సైన్యం ట్విటర్‌ను ఊపేస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ ఘ‌న‌ విజ‌యం సాధించి నాలుగు ఏళ్లు కావడంతో #YSRCPAgain2024 హ్యాష్‌టాగ్‌ ట్విట‌ర్‌లో ట్రెండింగ్‌ అయింది. ప్రారంభ‌మైన ప‌ది నిమిషాల్లోనే జాతీయ స్థాయిలో మొద‌టి స్థానంలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. త‌న నాలుగేళ్ళ పాల‌న‌లో వైయ‌స్ జ‌గన్ ప్రభుత్వం సాధించిన విజ‌యాలు, ఆయ‌న రాజ‌కీయ ప్రస్థానానికి సంబంధించిన స‌మాచారంతో ట్వీట్లను నెటిజెన్లు షేర్‌ చేస్తున్నారు. ఆ ట్వీట్లను పార్టీ కార్యకర్తలు షేర్‌ చేస్తున్నారు. ఈ ట్వీట్లకు దేశవ్యాప్తంగా భారీగా వ్యూస్ వస్తున్నాయి.

Exit mobile version