NTV Telugu Site icon

Samajika Sadhikara Yatra: రాజోలులో జైత్రయాత్రగా సాగిన సామాజిక సాధికార యాత్ర

Samajika Sadhikara Yatra

Samajika Sadhikara Yatra

Samajika Sadhikara Yatra: వైఎస్సార్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్ర 40వ రోజుకు చేరుకుంది. ఈ బస్సుయాత్ర డాక్టర్ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని రాజోలు నియోజకవర్గంలో సాగింది. యాత్ర అనంతరం మల్కిపురం ప్రధాన సెంటర్‌లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ, విశ్వరూప్, ఎంపీలు అనురాధ, మోపిదేవి తదితరులు హాజరయ్యారు. ఈ బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.

అంబేద్కర్ స్ఫూర్తితో సీఎం జగన్‌: మంత్రి విశ్వరూప్‌
సభలో మంత్రి విశ్వరూప్ మాట్లాడుతూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల అభివృద్ధి సీఎం జగన్ హయాంలోనే జరిగిందన్నారు. ఇచ్చిన ప్రతి హామీని సీఎం నెరవేర్చారన్నారు. సామాజిక సాధికారతను సీఎం జగన్ చేతల్లో అమలు చేసి చూపించారని, రాష్ట్రంలో సామాజిక విప్లవం నడుస్తోందని మంత్రి అన్నారు. 2024లో జగన్ రెండోసారి ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత ఉంది. అంబేద్కర్ స్ఫూర్తితో నడుస్తున్న ఏకైక నాయకుడు సీఎం జగన్‌. అభివృద్ధి చదువు ద్వారానే సాధ్యమవుతుందన్న అంబేద్కర్ ఆలోచనలను ఆచరణలో పెట్టిన నాయకుడు. బీసీ, ఎస్సీ ఎస్టీల మైనార్టీల ఆత్మ గౌరవాన్ని గుర్తించిన వ్యక్తి జగన్’’ అని మంత్రి కొనియాడారు.

చంద్రబాబు బీసీలను బానిసలుగా చూసేవాడు: మంత్రి చెల్లుబోయిన
మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. రాజోలు నియోజకవర్గం నాకు పుట్టిల్లు. ఇక్కడ నేతలు కృష్ణంరాజు, జక్కంపూడిల సహకారంతో ఎదిగాను. వైఎస్సార్, సీఎం జగన్ నాకు రాజకీయంగా గుర్తింపునిచ్చారు. చంద్రబాబు బీసీలను బానిసలుగా చూసేవాడు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల ఆత్మగౌరవం గుర్తించిన వ్యక్తి సీఎం జగన్ మాత్రమే. అబద్ధం 14 ఏళ్ల పాటు పాలించింది.. జగన్ అనే నిజం వెలుగులోకి వచ్చి ప్రజల సమస్యలు తీర్చింది’’ అని మంత్రి వేణు పేర్కొన్నారు.

వారు తలెత్తుకుని జీవించగలుగుతున్నారు: ఎంపీ మోపిదేవి
రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ మాట్లాడుతూ.. పేదల సమస్యల గురించి మాట్లాడే నాయకులను మాత్రమే గతంలో చూశాం.. సమస్యలను పరిష్కరించి, చేతల్లో అభివృద్ధిని చూపిన నాయకుడు సీఎం జగన్ మాత్రమే. అంబేద్కర్ ఆలోచన విధానాలను అక్షరాల అమలు చేసిన నాయకుడు సీఎం జగన్. చిన్న వర్గాలకు చెందిన బీసీ ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు చెందిన అనేక మందికి సీఎం జగన్ మార్కెట్ చైర్మన్లుగా, దేవాలయాలు చైర్మన్లుగా పదవులిచ్చి సమాజంలో గౌరవం కల్పించారు’’ అని ఎంపీ చెప్పారు. టీడీపీ బీసీ నేతలను సృష్టించే ఫ్యాక్టరీ అయితే, సీబీఎన్‌ ఎందుకు బీసీ నేతను రాజ్యసభకు పంపలేకపోయింది? అని ప్రశ్నించారు.చంద్రబాబు ఒక మోసగాడని, అతను ప్రతి టిక్కెట్‌పై రేటు ట్యాగ్‌ను ఉంచుతాడని, కానీ జగన్ మాత్రం బీసీలకు ప్రాతినిధ్యం కల్పించారని దీని గురించి ప్రజలు ఆలోచించాలని తెలిపారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాలు తలెత్తుకుని జీవించగలుగుతున్నారంటే అది వైఎస్‌ జగన్ వల్లే సాధ్యమైంది. ఈ వర్గాలకు నిజమైన సాధికారత చేకూరింది. ఎవరి దగ్గర చేయి చాచకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాలు వాళ్ల కాళ్లపై వాళ్లు జీవించగలిగే పరిస్థితిని జగన్ కల్పించారు. దేశంలోని అత్యున్నతమైన రాజ్యసభ పదవులు నలుగురు బీసీలకు జగన్ కట్టబెట్టారు. చంద్రబాబు తన పార్టీలో డబ్బున్న వారికి రాజ్యసభ స్థానాలు అమ్ముకుంటాడని మండిపడ్డారు. 14 ఏళ్ల పాటు సీఎంగా ఉన్న చంద్రబాబు బీసీలకు చిన్నపాటి రాజకీయ హోదా కూడా చంద్రబాబు ఇవ్వలేకపోయాడని ఎద్దేవా చేశారు. 2024లో కూడా సీఎంగా జగనే రావాలని మోపిదేవి పేర్కొన్నారు.