NTV Telugu Site icon

TDP vs YSRCP: నేడు టీడీపీలో చేరనున్న ఇద్దరు వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేలు..

Tdp

Tdp

TDP vs YSRCP: ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ ఇస్తూ.. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు రెబల్స్‌గా మారారు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారంటూ వారిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ.. అయితే, ఆ ఎమ్మెల్యేలు నేడు అధికారికంగా తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు.. టీడీపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో కొందరు వైసీపీ నేతలు టీడీపీ కండువా కప్పుకున్న విషయం విదితమే కాగా.. ఈ రోజు కూడా పలువురు వైసీపీ నేతలు టీడీపీ గూటికి చేరనున్నారు.. రామచంద్రపురం, తంబళ్లపల్లి, పెదకూరపాడు, ఉదయగిరి, తాడికొండ నియోజకవర్గాల నుంచి పెద్దల సంఖ్యలో అధికార పార్టీకి చెందినవారు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరతారని ఆ పార్టీ నేతలు చెబుతున్నాయి.. ఇక, ఈ రోజు టీడీపీ కండువా కప్పుకోనున్న వారిలో వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వారి అనుచరులు కూడా ఉన్నారు.. మరోవైపు, ఉదయం 11 గంటలకు ముఖ్య నేతలతో సమావేశంకానున్నారు చంద్రబాబు నాయుడు.

Read Also: Direct Tax Collection: బడ్జెట్ అంచనాలో రూ.10.64 లక్షల కోట్లు వసూలైన ప్రత్యక్ష పన్నులు

కాగా, వైసీపీలో మంత్రులు, ఎమ్మెల్యేల సీట్ల మార్పులు, చేర్పులపై చంద్రబాబు సెటైర్లు వేసిన విషయం విదితమే.. సీఎం జగన్‌ జగన్ లెక్కలు తారుమారయ్యాయి. 11 మందికి సీట్లు మార్చేశారు. మంత్రులకు.. ఎమ్మెల్యేలకు ట్రాన్సఫర్లు ఉంటాయని నేను ఊహించ లేదన్నారు. అయితే, ఓ చోట చెల్లని కాసు.. మరో చోట ఎలా చెల్లుబాటు అవుతారు..? అని ప్రశ్నించారు. దళితులు.. బీసీలనే బదిలీ చేశారు. బీసీల మీద అంత ప్రేమ ఉంటే.. అక్కడ బీసీ అభ్యర్థిని నిలపొచ్చు కదా..? ఇంత మందిని బదిలీలు చేసిన జగన్.. బాలినేని, ద్వారంపూడి, పెద్దిరెడ్డి వంటి వారిని ఎందుకు ట్రాన్సఫర్ చేయలేదు? జగన్ మనుషులు.. బినామీలను ఎందుకు ట్రాన్సఫర్ చేయలేదు..? పేదవారి సీట్లే మారుస్తారా..? అని నిలదీశారు.. సీఎం జగన్‌ 150 సీట్లలో అభ్యర్థులను మార్చినా వైసీపీ గెలవదు అంటూ చంద్రబాబు జోస్యం చెప్పిన విషయం విదితమే.