ఏపీలో అధికార వైసీపీ పండుగ అంగరంగ వైభవంగా జరుగుతోంది. అన్నిదారులూ గుంటూరు వైపే అన్నట్టుగా లక్షలాదిమంది ప్లీనరీకి హాజరవుతున్నారు. రెండో రోజు శనివారం ప్లీనరీ ఉదయం 9.45 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రారంభం కానుంది.. ఉదయం 10 నుంచి 10.5 గంటల వరకు సీఎం వైఎస్ జగన్, వైఎస్ విజయమ్మ, ఇతర ప్రధాన నేతలు వేదికపైకి చేరుకోనున్నారు.. ఇక, సామాజిక సాధికారతపై ఉదయం 10.5 నుంచి మధ్యాహ్నం 12.25 గంటల వరకు మంత్రులు, ఎంపీలు మాట్లాడనున్నారు.. ఆ తర్వాత మధ్యాహ్నం 12.25 నుంచి 1.45 గంటల వరకు వ్యవసాయంపై చర్చ సాగుతోంది.. ఇక, మధ్యాహ్నం 1.45 నుంచి 2 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 2 గంటల నుంచి పరిశ్రమలు – ఎంఎస్ఎంఈ – ప్రోత్సాహకాలపై 2.40 గంటల వరకు మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 2.40 నుంచి దృష్ట చతుష్టయంపై మంత్రులు అంబటి, జోగి రమేష్, ఎమ్మెల్యే కొడాలి నాని, పోసాని కృష్ణమురళి మాట్లాడనున్నారు.. సాయంత్రం 4 గంటలకు పార్టీ అధ్యక్షుడి ముగింపు సందేశం ఉండనుండగా.. వందన సమర్పరణ, జాతీయ గీతాలాపనతో సాయంత్రం 5.10 గంటలకు ప్లీనరీ సమావేశాలు ముగుస్తాయి.

2024 ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలుస్తాం.. చంద్రబాబు పార్టీకి డిపాజిట్ కూడా రాదు.. మొరిగినంత మాత్రాన గ్రామ సింహాలు సింహాలు కావు. ఏపీలో ఏ ఎన్నికలు జరిగినా ఫ్యాన్ గిర్రున తిరిగింది.. సైకిల్ చక్రాలు ఊడిపోయాయి.. చక్రాలు ఊడిన సైకిల్‌ను తండ్రీకొడుకులు తొక్కలేకపోతున్నారు.. అందుకే దత్తపుత్రుడిని తెచ్చుకున్నాడు. ఏ ఎన్నికలు జరిగినా ఫ్యాన్ గిర్రున తిరిగింది. సైకిల్ చక్రాలు ఊడిపోయాయి. మనకు వెన్నుపోటు ద్వారా అధికారం తీసుకోవాడం రాదు. కౌర సైన్యాన్ని ఓడించడంలో కార్యకర్తలదే అర్జునుడి పాత్ర. కుప్పం మున్సిపాల్టీ, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు క్లీన్ స్వీప్ చేశాం. రాష్ట్రం శ్రీలంక అయిపోతోందని అంటున్నారు. చంద్రబాబు హయాంలో ఏపీ అమెరికా అయ్యిందా..? తెలుగుదేశం పార్టీ, ఎల్లోమీడియా చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి సోషల్ మీడియా తిప్పికొట్టాలి. గ్రామాల్లో కూడా సోషల్ మీడియా సైన్యాన్ని ఏర్పాటు చేయాలి.
ప్రజల్లోకి వెళ్లి మన ప్రభుత్వం చేస్తున్న మంచిని వివరించి మద్దతుగా నిలువాలని దీవెనలు తీసుకోవాలి. ఎన్నికలకు సన్నద్ధం కావాలి. ఇంటింటికి జరిగిన మేలును చెబుతున్నప్పుడు అవి వెంటనే పరిష్కరించేలా.. పార్టీ నాయకత్వంతో కోఆర్డినేట్ చేసుకుంటూ.. కార్యకర్తలు, అభిమానులు చొరవ చూపాల్సిందిగా కోరుతున్నాను. 2009లో సంఘర్షణలో మొదలైనప్పటి నుండి మీరు నావెంటే ఉన్నారు. జెండాను భుజానికెత్తుకున్నారు. అన్నగా అప్యాయత చూపించారు. తమ్ముడిగా తోడుగా నిలబడ్డారు. బిడ్డగా దీవించారు. 2019లో పార్టీకి చారిత్రాత్మక విజయం సాధించి పెట్టడంతో పాటు. ఈ తరువాత జరిగి ప్రతి ఎన్నికల్లో కూడా దుష్టచతుష్టయం చెవులు చిల్లులు పడేలా విజయఢంకా మోగించింది అంటే.. దేవుడి దయ.. ప్రజల ఆశీస్సులతో పాటు.. లక్షల మంది కార్యకర్తల అవిశ్రాంత కృషి అని కూడా సగర్వగంగా తెలియజేస్తున్నాను.
చాలా మందైతే రేపు బక్రీద్ పండుగా ఉన్నాకూడా.. ఆ పండుగను సైతం పక్కనపెట్టకూడా ఆశీర్వదించడానికి వచ్చారు. మీ చెరగని చిరునవ్వులను నా గుండెల్లో పెట్టుకుంటాను. మీ అప్యాయతలే జగన్‌ను ఇంతవాడిని చేశాయ్. రేపొద్దున జగన్ మరింతగా ఎదుగుతాడంటే అది కేవలం మీ అండదండలతోనే అని సగర్వగంగా తెలియజేస్తున్నా.. మీ అందరి దీవెనలు.. దేవుడి దయ ప్రజలందరి ఆశీస్సులు.. సదా మనకు. మీ జగనన్నకు ఎప్పుడూ ఉండాలని సవినయపూర్వకంగా కోరుకుంటూ.. ఎంతో దూరం.. ఎంతో అభిమానంతో ప్లీనరీ వచ్చివారందరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరింత ఆత్మవిశ్వాసంతో.. సురక్షితంగా మీ ఇళ్లకు మీరు చేరుకోవాలని.. వెళ్లేటప్పుడు నెమ్మదిగా వెళ్లండని మీ అన్నగా మీకు సలహా ఇస్తూ.. కాస్త ఆలస్యమైన పరవాలేదు నెమ్మది వెళ్లండని సలహా ఇస్తూ.. దేవుడి దయ.. ప్రజల ఆశీస్సులు మన పార్టీపైన ఉండాలని కోరుకుంటూ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
ఇక్కడ గమనించమని అడుగుతున్నా.. అప్పుడు కూడా ఇదే బడ్జెట్.. అప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రి.. అప్పుడు ఇదే బడ్జెట్.. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఇప్పుడు ఇదే బడ్జెట్.. ముఖ్యమంత్రి మీ అన్న జగన్.. మరీ అప్పుడు వాళ్లు ఎందుకు చేయలేకపోయారు. ఇప్పుడు మీ అన్న జగన్ ఎలా చేయగలుగుతున్నాడని ఒక్కసారి ఆలోచన చేయాలని అడుగుతున్నా.. నిజంగా అప్పుల విషయానికి వస్తే.. అప్పట్లో చంద్రబాబు గారే మీ అన్న జగన్ కంటే ఎక్కవ అప్పులు చేశారు. మీ జగన్ అంతకన్న తక్కువగానే అప్పులు చేశాడు. అయినా వాళ్లు ఎందుకు చేయలేకపోయారు. మీ అన్న తమ్ముడు ఎందుకు చేయగలుగుతున్నాడు. కారణం.. మీ జగన్.. బటన్ నొక్కుతున్నాడు.. ఎక్కడా లంచాలు లేవ్.. ఎక్కడా వివక్ష లేదు. నేరుగా అక్కచెల్లెమ్మల అకౌంట్లలో డబ్బులు పోతావున్నాయ్.
అదే ఆ పెద్దమనిషి చంద్రబాబు నాయడి గారి హయాంలో.. బటన్ లేదు.. నొక్కేది లేదు.. నేరుగా దోచుకో.. పంచుకో.. ఇంత ఈనాడుకు.. ఇంత ఆంధ్రజ్యోతికి, ఇంత టీవీ5కి, ఇంత తన దత్తపుత్రుడికి. ఇక మిగిలిదంతా తనకు. తేడా గమనించండని అడుగుతున్నా.. గజ దొంగళ్ల ముఠాకు ఈ రోజు మంచి పరిపాలనకు మధ్య తేడా ఒకసారి గమనించమని కోరుతావున్నా..
ఇదే బాబు హయాంలో.. సామాజిక న్యాయమంటే ఏమన్నారో తెలుసా.. ఎస్సీల కులాల్లల్లో ఎవరైనా పుట్టలనుకుంటారా.. అని అవహేళన చేసిన రోజులు చంద్రాబాబు గారి హయాంలో.. బీసీల తోకలు కత్తిరిస్తా.. అని అపహాస్యం చేసిన రోజులు చంద్రబాబు హయాంలో.. ఎస్టీలకు, మైనార్టీలకు కనీసం ఒక్క మంత్రి పదవి కూడా ఇచ్చిన పాపాన పోలేదు. కనీసం ట్రైబల్ అడ్వైజరీ కమిటీ అనే రాజ్యాంగబద్ధమైన సంస్థను ఏర్పాటు చేయలేదని చంద్రబాబు హయం.. ఇందుక భిన్నంగా ఈ వర్గాలకు ఉప ముఖ్యమంత్రుల పదవులతో పాటు ఏఎంసీలు, ఆలయ బోర్డుల్లో కూడా 50శాతం రిజర్వేషన్లు కల్పించి.. మొత్తం మంత్రి మండలిలో ఏకంగా 70శాతం పదవులు వీళ్లేకే ఇచ్చిని మన ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి మధ్య తేడా గమనించమని కోరుతున్నా..
తొలిసారిగా శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు చేశాం. బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన మొట్టమొదటి ప్రభుత్వం మనది అని సగర్వగం తెలియజేస్తున్నాం. నేరుగా, లంచాలకు తావులేకుండా, వివక్ష లేకుండా నేరుగా బటన్ నొక్కి ప్రతి అక్కా ప్రతి చెల్లెమ్మకు ప్రతి పేదవాడి పేద కుటుంబానికి మంచి చేసేందుకు నేరుగా బటన్ నొక్కి ట్రాన్స్ఫర్ చేసింది అక్షరాల లక్ష 63వేల కోట్ల రూపాయలు నేరుగా అక్కచెల్లెమ్మలకు, పేదకుటుంబాలకు ట్రాన్స్ఫర్ చేశాం. ఇందులో దాదాపు 80శాతం నా ఎస్టీలు నా బీసీలు, నా మైనార్టీ అక్కచెల్లెమ్మలు అని నేను సగర్వగంగా తెలియజేస్తా ఉన్నాను.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన రాజ్యసభ స్థానాలు 8 అయితే.. వాటిలో 4 స్థానాలు బీసీలేనని సగర్వగంగా తెలియజేస్తున్నా.. నామినేటెడ్ పోస్టులు, కాంట్రాక్టుల్లో 50 శాతం ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలకే ఇవ్వాలని ఏకంగా చట్టం చేశాం. అందులో సగం మళ్లీ మహిళలకే ఇవ్వాలని, రాజ్యాధికారంలో కూడా వారికి న్యాయబద్ధమైన వాట ఉండాలని ఎలాంటి ఉద్యమాలు లేకుండా ఎలాంటి విప్లవాలు లేకుండా మనసు వారికి మంచి చేయాలనే ఆరాటంతో అడుగులు ముందుకు వేశాం.
గతంలో ఎన్నికల తర్వాత టీడీపీ మేనిఫెస్టో కనిపించకుండా చేశారు.. కానీ తాము పాదయాత్రలో ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్నాం.. జగన్ చెప్పింది నిజమని నమ్మితేనే వచ్చే ఎన్నికల్లో ఓటేయండి. టీడీపీ హయాంలో సెల్‌ఫోన్ లైట్లతో ఆపరేషన్లు చేసిన ఘటనలు చూశాం.. ప్రభుత్వాస్పత్రుల్లో ఎలుకలు కొరికిన ఘటనలు చూశాం.. తాము నాడు-నేడు ద్వారా ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలు మార్చాం.
విజయవాడ గుంటూరు మధ్య మహా సముద్రం కనిపిస్తోందన్నారు జగన్. వర్షం పడుతున్నా ఎవరూ చెక్కుచెదరలేదు. అచంచల విశ్వాసంతో అనురాగం పంచుతున్నారు. ఇది పార్టీ కార్యకర్తలు, అభిమానుల మహా సముద్రం. ఇది ఆత్మీయుల సునామీ. ఇక్కడే ఈ పూట కనిపిస్తోంది. చూస్తూ చూస్తూ 13 ఏళ్ళు అయిపోయింది. ఇదే అభిమానం, ఇదే నమ్మకం చూపిస్తున్నారు. ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు జగన్. దశాబ్ధం పాటు కష్టాలను భరించారు. అవమానాలను సహించి త్యాగాలు చేసిన సైన్యం మీరంతా. మన పార్టీ బావాలను, విధానాలను ఎంతో అభిమానంతో భుజాల మీద మోస్తున్న కార్యకర్తలు, నాయకులు, నేతలకు నిండు మనసుతో సెల్యూట్ చేస్తున్నాఅన్నారు.
నా కష్టంతో పాటు మీ శ్రమ, మీ త్యాగాల పునాదులు పార్టీని ముందుకు నడిపిస్తున్నాయి. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనల వల్ల సామాజిక, రైతు, మహిళా, విద్య, వైద్య, ఆరోగ్య, వ్వవసాయ విప్లవాల గురించి మాట్లాడుకున్నాం. నిజాయితీ, చిత్తశుద్ది వున్న పార్టీగా , మన భవిష్యత్తు కి పునాదులు వేశాం.13 ఏళ్ళ ప్రయాణాన్ని గుర్తుకుతెచ్చుకోవాలి. 2009, సెప్టెంబర్ 2 గుర్తుచేసుకున్నాం. నాన్నగారు మరణంతో తమకు దిక్కెవరు, ఇక బతకలేం అన్న భావనతో 700 మంది మరణించారు. వారి కుటుంబ సభ్యులను, వారిని పరామర్శించడానికి వీల్లేదని పార్టీ ఆదేశించింది.
దేశంలో శక్తిమంతమయిన వ్యవస్థలను ఉసిగొల్పారు. నన్ను అరెస్ట్ చేశారు. ఓదార్పు యాత్రలు ఆపితే కేసులు వుండేవి కావు. అలాంటి బెదిరింపులకు లొంగే వ్యక్తి అయితే.. ఈరోజు మీ జగన్.. మీముందు ఇలా వుండేవాడే కాదు.దేవుడి రాత మరోలా రాశాడు. ఆ పార్టీల పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకున్నాం. అమ్మ ఎమ్మెల్యే, నేను ఎంపీగా వున్నాం. ఆ పార్టీకి రాజీనామా చేశాం.ఒకటిగా ప్రయాణం ప్రారంభిస్తే 151, ఎంపీల ప్రయాణం 22 కి చేరింది. ఇంకా రాజ్య సభ గురించి మాట్లాడలేదు. ఒక్కశాతం ఓట్ల తేడాతో మనం ప్రతిపక్షంగా కూర్చోగలిగాం. 9 మంది ఎంపీలను గెలిచాం. అప్పుడు జగన్ కి గాలి ఆడనివ్వకూడదు. మళ్ళీ కుట్రలే. ఎమ్మెల్యేలలో 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొన్నారు. ముగ్గురు ఎంపీలను కొన్నారు. పార్టీ కనిపించకుండా పోవాలని కుట్రలు పన్నారు. 2019లో దేవుడు మరోలా స్క్రిప్ట్ రాశాడు. 23 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలను అదే పార్టీకి వచ్చాయి.
దేవుడు స్క్రిప్ట్ రాస్తే బాగా రాస్తాడు, మే 23న ఫలితాలు వచ్చాయి. ఎప్పటికైనా మంచి గెలుస్తుందనడానికి ఇదే నిదర్శనం అన్నారు సీఎం జగన్. దేవుడి దయతో, అందరి అండదండలతో మూడేళ్ళలో మన ప్రభుత్వం కొనసాగుతూనే వుంది. ఎన్నికల మేనిఫెస్టోలను మనం ఆచరిస్తున్నాం. మూడేళ్ళలో మన ఫోకస్ వుంది. టీడీపీ ఎమ్మెల్యేలను కొనాలని అనుకోలేదు. టీడీపీ ఎమ్మెల్యేలను కొనాలని ప్రయత్నించలేదు. ప్రజలకు ఎలాంటి పాలన ఇవ్వగలమో ఫోకస్ పెట్టాను. అణగారిన సామాజిక వర్గాలను న్యాయం చేయాలని భావించాను. నేను చూశాను.. నేను విన్నానని భరోసా ఇచ్చాను. రాజకీయాల్లో విశ్వసనీయత నెలకొల్పాను. పాలనను మరింత పారదర్శకంగా అందించేందుకు జిల్లాల పునర్విభజన ఏర్పాటుచేశాం. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అనే వ్యక్తి చంద్రబాబుకి ఇలాంటి ఆలోచన వచ్చిందా? అని అడుగుతున్నా అన్నారు సీఎం జగన్. చంద్రబాబు చిప్ గురించి మాట్లాడుతున్నారు. చిప్ గుండెల్లో, మనసులో వుండాలి. ప్రజలకు మంచి చేయాలనే తపన వుండాలి. తన కుప్పంలో రెవిన్యూ డివిజన్ ఇచ్చింది మన ప్రభుత్వమే. జగన్ ప్రభుత్వమే. కుప్పంలో ప్రజలకు మంచి జరగాలని.
వైసీపీ ప్లీనరీలో జగన్ తరఫున 22 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జీవిత కాల అధ్యక్షుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికయ్యారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. లక్షలాదిమంది సమక్షంలో ఈ కీలక ప్రకటన చేశారు విజయసాయిరెడ్డి. కరతాళ ధ్వనుల మధ్య కార్యకర్తలు జగన్ ని జీవితకాలం అధ్యక్షుడిగా అంగీకరించారు.
లక్షలాదిమంది వైసీపీ అభిమానులు, కార్యకర్తలు సభకు వచ్చారు. వర్షంలో తడుస్తూ ప్రసంగాలు వింటున్నారు కార్యకర్తలు. పండగలా రెండో రోజు వైఎస్సార్సీపీ ప్లీనరీ జరుగుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. కార్యకర్తల నినాదాలతో ప్లీనరీ ప్రాంగణం మార్మోగుతోంది. వర్షంలో తడుస్తూ కూడా నేతల ప్రసంగాలను కార్యకర్తలు వింటున్నారు. జగన్.... జగన్ అంటూ నినాదాలు మిన్నంటాయి.
75 ఏళ్ళ స్వాతంత్ర్య భారత దేశంలో ఇన్ని సంక్షేమ పథకాలు ఎవరూ అందించలేదు. వైసీపీ అంటే ప్రజలకు అభిమానం. ఏ ప్రభుత్వ కార్యలయానికి వెళ్లినా మన మేనిఫెస్టో వుంటుంది. డీబీటీ ద్వారా లక్ష60 వేల కోట్లు అందించాం. సంక్షేమాన్ని పంచుతున్నారు. ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఒక్కరూపాయి అయినా అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు చెప్పలేకపోయాయి. కోవిడ్ వల్ల అభివృద్ధి, సంక్షేమం అంతా ఆగిపోయినా, రాష్ట్రంలో ఆగలేదు. చంద్రబాబు 14 ఏళ్లు పనిచేశారు. టీడీపీ అధికారంలో వున్నప్పుడు ఫలానా పథకం చెప్పగలరా? రాజశేఖర్ రెడ్డి పేరు చెబితే ఆరోగ్యశ్రీ గుర్తుకు వస్తుంది. ఫీజు రీఎంబర్స్ మెంట్, 108 గుర్తుకువస్తుంది. ఉచిత విద్యుత్ గుర్తుకు వస్తుంది. వైఎస్ జగన్ పేరు చెబితే వందల పథకాలు అమలు చేస్తున్నాం. జగన్ ని విమర్శలు చేస్తున్నారు. నాకు పరిశ్రమల శాఖ అప్పగించారు. నన్ను ఎంతో ఆదరించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మనం మొదటి స్థానంలో వున్నాం అన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్.
సీఎం జగన్ పాలనలోనే సామాజిక న్యాయం జరిగిందని మంత్రులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు, మేరుగ నాగార్జున అన్నారు. చంద్రబాబు తన వాళ్లనే చూసుకున్నారన్నారు. సీఎం జగన్ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు.. సామాజిక సాధికారిత తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు ఏనాడైనా సామాజిక న్యాయం పాటించారా అని ప్రశ్నించారు. సామాజిక న్యాయం పాటించిన మహోన్నతమైన వ్యక్తి సీఎం జగన్.
వైసీపీ ప్లీనరీలో మాట్లాడారు హోంమంత్రి తానేటి వనిత. గతంలో బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూసేవారని, బలహీనవర్గాలను బలవంతులుగా మార్చింది సీఎం వైఎస్ జగనేనని మంత్రి తానేటి వనిత అన్నారు. అంబేద్కర్ ఆశయాలను సీఎం జగన్ నెరవేరుస్తున్నారన్నారు. తండ్రికి తగ్గ తనయుడు సీఎం జగన్. ఆయన మనందరి ధైర్యమని మంత్రి తానేటి వనిత అన్నారు. రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ వైసీపీ అభ్యర్ధులను గెలిపించుకోవాలన్నారు. తనలాంటి వారికి హోంమంత్రి పదవి ఇచ్చి గౌరవించిన మహోన్నత వ్యక్తి జగన్ అని కొనియాడారు తానేటి వనిత. గతంలో రాజ్యసభ ఎంపీలుగా బడుగు, బలహీనవర్గాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. జెడ్పీ, మునిసిపల్ ఛైర్మన్లుగా జగనన్న ఎస్సీఎస్టీ బీసీ మైనారిటీలకు అవకాశం^కల్పించారన్నారు.
ప్లీనరీలో మాజీ మంత్రి పేర్ని నాని నలుగురిపై విమర్శలు చేశారు. ఈరోజు వైసీపీ ప్లీనరీకి వచ్చిన వారందరికీ అభినందనలు. ఆ నలుగురి గురించి చెప్పాలంటే 420 గాళ్ళంటారు. ఒక మంచి కార్యక్రమం చేసినా కోడిగుడ్డుపై ఈకలు పీకుతారు. జగన్ కాదు నేను కూడా భయపడను. ఈ రాష్ట్రంలో బ్రోకర్లంటే భయం వుంటుందా. జగన్ అడ్డు తొలగించుకోవాలి. రాజకీయాల నుంచి సమూలంగా తీసేయాలి. ఒక వ్యక్తి లేకపోతే వీళ్ళు ఆడింది ఆట.. పాడింది పాట. చంద్రబాబుని అడ్డుపెట్టుకుని పైరవీలు చేసుకోవచ్చు. ఎన్నికల వాగ్దానాలను 95 శాతం అమలుచేశారు. అనేక పథకాలు చేపట్టారు. స్కూళ్ళను అభివృద్ధి చేశారు. పిల్లలకు మంచి భవిష్యత్ ఇస్తున్నారు. పిల్లలకు ఫుడ్ ఇవ్వాలి, ల్యాప్ ట్యాప్ లు ఇవ్వాలని జగన్ ఆలోచించారు. ఒక తండ్రి స్థానంలో నిలబడి పనిచేస్తున్నారు.

ఏపీలో మూడు సంవత్సరాలు కాలం పూర్తయింది. మేం ఎమ్మెల్యేలుగా గెలిచాం. మంత్రులం అయ్యాం. తర్వాత మా టైం అయిపోయింది. ఎమ్మెల్యేలుగా మేం మిగిలాం. జగన్ తెచ్చిన పథకాలు గమనించండి. కార్యకర్తలే మాకు ప్రధానం. జనం గుండెల్లో వుంటే సీటు వస్తుంది. పిడికిలి బిగించండి. వైసీపీ జెండాను గట్టిగా పట్టుకోండి. వైసీపీ కార్యకర్తలు ముఖ్యం మనకు.జగన్ గురించి ఆలోచించండి. కార్యకర్తే శాశ్వతం. మేం స్వార్థంతో వచ్చాం. మీరు ప్రేమతో వచ్చారు. కార్యకర్తలు ఆలోచించాలి. జగన్ మాటలు వినండి అంటూ ఓ కార్యకర్తకు చెప్పానన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. జగన్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై వుంది.
ఎల్లోమీడియా దుష్ట చతుష్టయం అంశంపై మంత్రి అంబటి కీలక ఉపన్యాసం చేశారు. ఏ గడప తట్టినా జగన్ నినాదమే మారుమోగుతోందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఎల్లో మీడియా- దుష్ట చతుష్టయం తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికారం లాక్కోవాలని చంద్రబాబు తాపత్రయం. చంద్రబాబుతో కాదు యుద్ధం.. దుష్ట చతుష్టయంతో అంటూ అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.పవన్ కల్యాణ్ పార్టీ పెట్టింది చంద్రబాబు కోసమే.. చంద్రబాబును సీఎం చేయాలన్నదే పవన్ లక్ష్యం, ఎవరెన్ని కుట్రలు చేసినా రాబోయేది కూడా వైసీపీనే అన్నారు అంబటి.
వైఎస్సార్సీపీ సైనికులకు ప్లీనరీ పెద్ద పండగ అని కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి అన్నారు. ఘనమైన పోరాటాల చరిత్ర వైఎస్సార్సీపీకి ఉందన్నారు. పరిపాలనా- పారదర్శకత అంశం పై చర్చలో ఆమె పాల్గొన్నారు.రదర్శక పాలనకు గ్రామ, వార్డు సచివాలయాలే నిదర్శమన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. మహానేత వైఎస్సార్ సంకల్పాన్ని వైఎస్ జగన్ నిజం చేసి చూపించారన్నారు.
ఏపీలో రాజధాని నాటకం గురించి మాట్లాడతా. ముందు నూజివీడు అన్నారు. కానీ అమరావతిలో ఏరియాలో వందల ఎకరాలు కొనేశారన్నారు ఎంపీ నందిగం సురేష్. అమరావతిలో పచ్చటి పొలాలు తగులబెట్టారు. రైతులు భయపెట్టారు. రైతులంతా రోడ్డుమీదకి వచ్చారు. తుళ్లూరులో వేలాదిమంది తమ ఇళ్ళకు వెళ్లలేరు. తుళ్ళూరులో కేక్ కట్ చేశారు. మాలాంటి వారిమీద కేసులు పెట్టారు. నన్ను నమ్మండి అన్నారు. వర్షం కారిపోయే అసెంబ్లీ కట్టారు. ఎల్ సీడీలు పెట్టారు. రాజధాని నాటకం ఆడారు. రాజధాని అద్భుతంగా తీర్చిదిద్దానని చెప్పారు. అవన్నీ తప్పుడు తడకలు. నాకు సంబంధించినవారికి మాత్రమే అవకాశం ఇచ్చారు. మీరు అమరావతి రావడానికి, మోడీని చూడడానికి రానివ్వలేదు. ఇప్పుడు మోడీ దగ్గరకు తీసికెళ్లింది జగన్మోహన్ రెడ్డి కాదు. రాజధాని మూడు ప్రాంతాలు డెవలప్ అవ్వాలి. చంద్రబాబు ఒక్కచోటే డెవలప్ కావాలన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ కావాలి. మూడు రాజధానులు రావాలి.
నందిగం సురేష్
ప్రభుత్వం చేస్తున్న పనులు స్వీకరించనివారు మాట్లాడుతున్నారు. కదనరంగంలో అడుగుపెట్టాం. సమరానికి సిద్దపడుతున్నాం. రాబోయే ఎన్నికల్లో 175 స్థానాలు మనం గెలుచుకుంటాం. నేలవిడిచి సాము చేయడానికి విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. సూర్యుడు మన కర్మకు సాక్షి. మనం బట్టలు ఎండేసుకోవడానికి కాదు సూర్యుడు ఉదయించేది. మనం ఏం చేస్తున్నామో సూర్యుడు చూస్తున్నాడు. మన లక్ష్యం విజయం. ఆ లక్ష్యం వైపు వెళ్లాలి. సంక్షేమం, అభివృద్ధి రెండూ సాగాలి. మన పథకాలను దేశ, విదేశాలు చూస్తున్నాయి అన్నారు తమ్మినేని సీతారాం.
రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. అనేక పథకాలు అమలు అవుతున్నాయి. నేను సభను నియంత్రించగలను. కానీ నాకు పరిమిత సమయం ఇచ్చారు. కానీ అంత త్వరగా నా ప్రసంగం పూర్తికాదు,. మీడియాలో కొందరు ఏం రాస్తున్నారు. జగన్ చేపట్టిన పథకాలను జనానికి వివరించడం లేదు. మనం మూడేళ్లు పూర్తిచేసుకుని నాలుగో ఏట అడుగుపెట్టాం. మన ప్రయాణంలో ఏ మలుపులో వున్నామో మనం సమీక్షించుకోవాలన్నారు తమ్మినేని సీతారాం.
పరిపాలన-వికేంద్రీకరణ-పారదర్శకత అంశంపై స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ఏ గడపలో చూసినా జగన్ నామస్మరణ వినిపిస్తోంది. రాష్ట్ర అభివృద్ధి చోదకుడు జగన్ గురించి ప్రజలు మాట్లాడుకున్నారు. తన భర్త మరణానంతరం అనేక అవమానాలను విజయమ్మ భరించారు. ఆంధ్రలోనే కాదు భారత్ లోనే విజయమ్మగారి పాత్ర మరువలేనిది. అంతా అభిమానించే నేత. లక్షలాదిమంది వైసీపీ కార్యకర్తలు విప్లవంలా, సునామీలా వచ్చారు. రెండవ రోజు కార్యక్రమం ప్రారంభమయిందని ప్రకటించారు. మూడేళ్ళ ప్రయాణం ఎలా సాగింది. ఈ ప్రయాణంలో మనం ఏ మలుపులో వున్నామో సమీక్షించుకోవాలి. విపక్షాలు మనమీద దుష్ప్రచారం చేస్తున్నాయి. వాటిమీద వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. సమరానికి మనం సిద్ధం అవుతున్నాం. ఉత్సాహంగా కార్యోన్ముఖులుగా ముందుకెళ్లాలన్నారు తమ్మినేని సీతారాం. నేను స్పీకర్ కంటే ముందు వైసీపీ నేతను. నాపై విమర్శలు చేస్తున్నారు. అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు.. వాటిగురించి మీడియాలో ఏం రాస్తున్నారు.
తమ్మినేని సీతారాం
రెండవ రోజు వైసీపీ ప్లీనరీలో మూడులక్షలమందికి పైగా కార్యకర్తలు హాజరవుతారని భావిస్తున్నారు. వివిధ నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు రానున్నారు. సీఎం 10 గంటలకు రానున్న నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేశారు. జగన్ కీలక ఉపన్యాసం చేయనున్నారు. 2024 ఎన్నికలకు ఇప్పటినుంచే శంఖారావం పూరించనున్నారు. ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఇంత భారీ స్థాయిలో ప్లీనరీ నిర్వహించలేదు. అధికారంలోకి వచ్చాక ఈ ప్లీనరీ కీలకం కానుంది. వైసీపీ నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ అధ్యక్షుడిగా జగన్ ని ఎన్నుకోనున్నారు. ప్లీనరీతో వైసీపీ లో జోష్ నెలకొంది.
1.పీతల పలావ్
2.ఫ్రాన్స్ బిర్యాని
3.మటన్ జీడి పప్పు కర్రి
4.రొయ్యల చింత చిగురు
5.సారపి ఉల్లి
6.రసం
7 సాంబారు
8.మజ్జిగ పులుసు
9.కుండపెరుగు
10.రైస్
11.పూతరేకులు
12 మిక్స్ డ్ బిర్యానీ
13 రైతా
14 సీతాఫల్ రబిడి
15 కట్ మిర్చి
16 మామిడికాయ పప్పు
17 దొండకాయ కొబ్బరి
18 గుత్తి వంకాయ, జీడిపప్పు
19 పచ్చిమిర్చి ఆవకాయ
20 కుండ పెరుగు
21 పెసరపప్పు మజ్జిగ చారు
22 దోసకాయ, టమోటా చట్నీ
23 అప్పడం
24 చల్లమిర్చి
25 కిళ్ళీ
26 ఐస్ క్రీం
27 శనగపప్పు గోంగూర
28 వడియం
29 వాటర్ బాటిల్.. వంటివి మొత్తం 35 రకాల వంటకాలతో నేతలు, కార్యకర్తలకు పసందైన భోజనం పెడుతున్నారు.
రెండవ రోజు 9.45 నుండి వైసీపీ ప్లీనరీ ప్రారంభం^అవుతుంది. ఇవాళ మూడు లక్షల మందికి పైగా హాజరవుతారని పార్టీ వర్గాలు అంచనా వేశాయి. దీంతో సెక్యూరిటీ భారీగా పెంచారు పోలీసులు, దాదాపు నాలుగు లక్షల మందికి వంటకాలను రెడీ చేస్తున్నారు. పార్టీ అధ్యక్షుడిగా వైఎస్ జగన్‌ను ఎన్నుకోనుంది వైసీపీ, సాయంత్రం 4 గంటలకు సీఎం జగన్ స్పీచ్ వుంటుంది.
ప్లీనరీ తొలి రోజున ప్రతినిధుల సభ.. మహిళా సాధికారత–దిశ చట్టం, విద్య, నవరత్నాలు–డీబీటీ, వైద్య రంగాల్లో గత మూడేళ్లలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులపై చర్చించింది. ఆ నాలుగు అంశాలపై తీర్మానాలను ఆమోదించింది. ప్రతినిధుల సభకు 1.50 లక్షల మంది వస్తారని వైఎస్సార్సీపీ నేతలు అంచనా వేయగా, అంతకంటే ఎక్కువగా శ్రేణులు తరలివచ్చాయి. ప్లీనరీ ప్రాంగణంలో వేసిన కుర్చీలన్నీ నిండిపోయాయి. ఒకవైపు వర్షం పడుతున్నా.. జనం ప్లీనరీ వైపు తరలివచ్చారు. రెండవరోజు భారీగా తరలివస్తారని భావిస్తున్నారు.