Site icon NTV Telugu

YSRCP on No Confidence Motion: కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకించిన వైసీపీ

Mithun Reddy

Mithun Reddy

YSRCP on No Confidence Motion: కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని వైసీపీ వ్యతిరేకించింది. అవిశ్వాస తీర్మానం చర్చలో వైసీపీ లోక్‌సభాపక్ష నేత మిథున్ రెడ్డి పాల్గొన్నారు. మణిపూర్‌లో మహిళపై అత్యాచార ఘటనలు బాధాకరమని.. ఆ రాష్ట్ర ప్రభుత్వం దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మణిపూర్ మహిళలు రక్షించబడాలని.. మణిపూర్‌లో రెండు వర్గాల వారిని కూర్చోబెట్టి పరిష్కారం కల్పించాలన్నారు. రాజకీయాలను పక్కన పెట్టి మణిపూర్‌లో శాంతిని పునరుద్దరించాలని మిథున్‌ రెడ్డి పేర్కొన్నారు. శాంతిని పునరుద్ధరించకపోతే ప్రజాస్వామ్యనికి అర్ధం ఉండదన్నారు.

Also Read: Pawan Kalyan: ఎవరి కళ్లలో ఆనందం కోసం అర్చకుడిపై దాడి.. పవన్‌ సూటి ప్రశ్న

మణిపూర్‌లో అదనపు బలగాలు మోహరించాలని..రెండు వర్గాలతో చర్చలు జరపాలని ఎంపీ మిథున్‌ రెడ్డి వెల్లడించారు. మణిపూర్ మయన్మార్‌తో బలహీనమైన సరిహద్దు కలిగి ఉందని.. బలహీనమైన సరిహద్దు దేశ భద్రతకి మంచిది కాదన్నారు. ఈ అవిశ్వాసానికి విలువ లేదని వైసీపీ భావిస్తోందన్నారు. అధికార ఎన్డీఏకి పూర్తి మెజారిటీ ఉందన్నారు. అవిశ్వాస తీర్మానం రెండు కూటముల మధ్య రాజకీయాలు చేసుకోవడానికి మాత్రమేనన్నారు. మణిపూర్‌లో శాంతిని పునరుద్ధరించాలని వైసీపీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతోందని వైసీపీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌ రెడ్డి స్పష్టం చేశారు.

Exit mobile version