Bhumana Karunakar Reddy: ఎక్కడికక్కడ నామినేషన్లు అడ్డుకుంటున్నారు.. బీహార్‌లో కూడా ఇంత నియంత పాలన సాగలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhumana Karunakar Reddy: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా ఎక్కడికక్కడ అడ్డుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మహిళా అభ్యర్థుల నామినేషన్లు లాక్కొని దుశ్శాసన పర్వం కొనసాగించారని ఆరోపించారు. నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్న సంఘటనలు ప్రతిచోటా జరుగుతున్నాయన్నారు. బీహార్‌లో కూడా ఇంత నియంత పాలన సాగలేదని.. చంద్రబాబు ఇక పోటీ చేసి గెలిచే అవకాశం లేదన్నారు. నామినేషన్లు వరకు రాకుండా అడ్డుకుంటున్నారని.. సుప్రీంకోర్టు ఆదేశాలతో నామినేషన్లు వేసే పరిస్థితికి ఏపీలో వచ్చిందని మండిపడ్డారు. 18 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఈరోజు 20 మంది పోలీసులు సమక్షంలో జిల్లా కలెక్టరేట్లో అందించారని తెలిపారు. పోలీసులు ఉన్న చోట సంఘ విద్రోహులు నామినేషన్లు అడ్డుకుంటున్నారని విమర్శించారు. వాళ్ళతో ఒప్పందం చేసుకున్న కారణంగానే ఈరోజు ప్రశాంతంగా నామినేషన్లు వేయగలిగారని.. 50 మంది పోలీసులు ఉన్నా ఒక్కరు నామినేషన్ కూడా ఇంతకుముందు వేయలేని పరిస్థితి నెలకొందన్నారు.
పోలీసులు అనుకుంటే ఏదైనా సాధ్యమే. 2004కు ముందు 10 ఏళ్లుగా చంద్రబాబు పోలీస్ వ్యవస్థను నాశనం చేశారని ఓ డీజీపీ స్థాయి అధికారి తనతో చెప్పారని భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. “కోడూరు బాల సుబ్రమణ్యం నందలూరులో తన గన్‌తో స్వైర విహారం చేశారు. లైసెన్సు తుపాకీ ఉంటే ఎన్నికల సమయంలో స్వాధీనం చేసుకోవాలి. అతని వెపన్ ఎందుకు స్వాధీనం చేసుకోలేదు? ఇది రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ.. పోలీసులు వాళ్లే రౌడీలకు భద్రత కల్పిస్తున్నారు, గూండాలకు భద్రత కల్పిస్తున్నారు. వైఎస్సార్సీపీకి చెందిన 4 గురు డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థులను బెదిరింపులకు గురిచేస్తున్నారు. నామినేషన్లు విత్ డ్రా చేసుకోకుంటే చంపుతామని బెదిరిస్తున్నారు.” అని వ్యా్ఖ్యానించారు.
Also Read
- AP Local Body Elections 2026: సీఎం చంద్రబాబుతో ముగిసిన పవన్ భేటీ.. జడ్పీ సీట్ల సర్దుబాటుపై కీలక చర్చ!
- Anti Suicide Fans: ఫ్యాన్‌కు ఉరేసుకుంటే కిందపడిపోతారు.. ఆత్మహత్యల నివారణకు గుజరాత్ వర్సిటీ మాస్టర్ ప్లాన్..
- Virat Kohli vs Pakistan: భారత్ - పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
- AP Local Body Elections: పల్నాడు, వినుకొండలో హైటెన్షన్.. వైసీపీ అభ్యర్థుల నామినేషన్లకు అడ్డంకులు!
తాజావార్తలు
-
Bhumana Karunakar Reddy: ఎక్కడికక్కడ నామినేషన్లు అడ్డుకుంటున్నారు.. బీహార్‌లో కూడా ఇంత నియంత పాలన సాగలేదు..
-
Shankarpally : మేజర్‌ను మైనర్‌గా చూపి అక్రమ కేసు.. శంకర్పల్లి సీఐ, ఎస్ఐలపై యువతి సంచలన ఆరోపణలు!
-
AP Local Body Elections 2026: సీఎం చంద్రబాబుతో ముగిసిన పవన్ భేటీ.. జడ్పీ సీట్ల సర్దుబాటుపై కీలక చర్చ!
-
Anti Suicide Fans: ఫ్యాన్‌కు ఉరేసుకుంటే కిందపడిపోతారు.. ఆత్మహత్యల నివారణకు గుజరాత్ వర్సిటీ మాస్టర్ ప్లాన్..
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
ట్రెండింగ్
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!