Site icon NTV Telugu

YSRCP: కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన వైసీపీ ఎంపీలు.. టీడీపీపై ఫిర్యాదు

Ysrcp

Ysrcp

YSRCP: ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైసీపీ ఎంపీలు కలిశారు. ఎంపీ విజయసాయి రెడ్డి నేతృత్వంలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైసీపీ ఎంపీలు కలిశారు. ఏపీలో టీడీపీ దొంగ ఓటర్లను చేర్పించిందని ఎంపీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు ఏపీలో 40,76,580 దొంగ ఓట్లు ఓటర్ జాబితాలో చేర్పించారని ఫిర్యాదు చేశారు. ఒకే ఫోటోతో ఇంటి పేరు మార్చి పలు ప్రాంతాలలో ఓటరులుగా టీడీపీ సానుభూతిపరుల పేర్లు నమోదయ్యాయని ఎంపీలు ఆరోపించారు.

Read Also: Pawan Kalyan and Barrelakka: బర్రెలక్కకు పడినన్ని ఓట్లు కూడా రాలేదు.. పవన్‌పై సీఎం జగన్‌ సెటైర్లు

హైదరాబాద్ , కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలలో నివసిస్తున్న టీడీపీ సానుభూతిపరుల ఓట్లు ఏపీలో కూడా టీడీపీ నేతలు నమోదు చేయించినట్లు వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణ చేసి దొంగ ఓటర్లను తొలగిస్తున్న బూత్ లెవల్ అధికారులపై టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారని ఎంపీలు మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుల ఓటర్లు తొలగించేందుకు ఫారం -7 దరఖాస్తులు బీఎల్వోలకు టీడీపీ నేతలు సమర్పిస్తున్నారని తెలిపారు. విచారణ సమయంలో నిజాలు వెలుగు చూస్తుండడంతో బీఎల్ఓలను టీడీపీ బ్లాక్ మెయిల్ చేస్తోందని వైసీపీ ఎంపీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

Exit mobile version