NTV Telugu Site icon

Vijayasai Reddy: వాలంటరీ, సచివాలయ వ్యవస్థలను కూల్చడమే చంద్రబాబు ఉద్దేశం

Vijayasai

Vijayasai

Vijayasai Reddy: బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్న వాలంటీర్లపై టీడీపీకి కన్ను కుట్టిందని నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి విమర్శించారు. వాలంటరీ వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థలను కుప్పకూల్చాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నాడన్నారు. వాలంటీర్లు ఇంటికి వచ్చి అవ్వ తాతలకు, అనారోగ్యంతో బాధపడుతున్న వారి ఇళ్లకు వెళ్లి పెన్షన్ ఇస్తున్నారన్నారు.

Read Also: Janasena: జనసేనలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు.. ఆ నియోజకవర్గాల నుంచే పోటీ!

ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసి సకాలంలో పెన్షన్లు అందకుండా చేశారన్నారు. వాలంటీర్లు సేవలు అందించకూడదనే నిబంధనను విధించారని విజయసాయి పేర్కొ్న్నారు. చంద్రబాబు ఎంత ద్రోహం చేస్తున్నారో మీరు అర్థం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. చంద్రబాబుకు తగిన రీతిలో మీరు బుద్ధి చెప్పాలన్నారు. వాలంటరీ వ్యవస్థపై టీడీపీ నేతలు విషం కక్కుతూ దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. అవ్వా.. తాతల్లో చాలా మంది నడిచి వెళ్ళలేరు.. వారందరినీ సచివాలయం వద్దకు వెళ్లి పెన్షన్ తీసుకోవాలని చెబుతున్నారు.. ఇది న్యాయమా అంటూ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

Show comments