Site icon NTV Telugu

MP Mithun Reddy: చంద్రబాబు నాయుడిపై ఎంపీ మిథున్ రెడ్డి ఆగ్రహం

Mithun Reddy

Mithun Reddy

MP Mithun Reddy: చంద్రబాబు నాయుడిపై ఎంపీ మిథున్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు, డ్వాక్రా మహిళల రుణమాఫీ అని చెప్పి మోసం చేసిన ఘనత చంద్రబాబు నాయుడుది అంటూ తీవ్రంగా మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వస్తే సచివాలయాలు ఉండవు, జన్మభూమి కమిటీలు మాత్రమే ఉంటాయన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే మనకు సేవలు అందిస్తున్న వాలంటీర్లను తొలగిస్తారని తీవ్రంగా మండిపడ్డారు.

Read Also: Andhrapradesh: న్యూఇయర్‌ వేడుకల్లో టీడీపీ శ్రేణుల మధ్య గొడవ

ప్రజలందరూ ఆలోచించి ఓటు వేయాలని, మంచి చెడులకు తేడా ప్రజలు గ్రహించాలని ఎంపీ మిథున్‌ రెడ్డి సూచించారు. చంద్రబాబు హయాంలో సర్టిఫికెట్ కావాలంటే ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ కోసం క్యూ లైన్‌లో నిలబడాల్సి వచ్చేదన్నారు. మనకు మేలు చేసిన వారిని మళ్లీ అధికారంలో ఉండేలా ఓటు వేయాలని ఎంపీ మిథున్‌ రెడ్డి పేర్కొన్నారు.

Exit mobile version