ఏపీలో ప్రతిపక్షాల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్. విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయవంతం అయింది. గతంలో ఇంత పెద్ద పెట్టుబడులు వచ్చాయా? 13 లక్షల కోట్ల రూపాయలతో అడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్. పారిశ్రామిక విప్లవం ఆంధ్రప్రదేశ్ లో మొదలయింది. ప్రతిపక్షాలు కడుపు మంటతో విమర్శిస్తున్నాయి. దేశంలోని ముఖ్యమైన కంపెనీల పెద్దలు గ్లోబల్ సమ్మిట్ కి హాజరయ్యారు. పెట్టుబడులు పెడతాం అని వచ్చిన వాళ్ళను తప్పు పట్టడం బాధాకరం. లోకేష్ ఎమ్మెల్యేగా గెలవలేక పోయారు. పోటుగాడివి అయితే ఎమ్మెల్యేగా గెలవ వచ్చు కదా అని భరత్ ప్రశ్నించారు.
Read Also: Minitser KTR Live: సీఐఐ తెలంగాణ సమావేశంలో కేటీఆర్ లైవ్
అభివృద్ధిని నిరోధించే ప్రయత్నం చేసే వాళ్లకు చెంపపెట్టు లాంటి సమాధానం ఇవ్వాలి. ముఖ్యమంత్రి నమ్మకం కల్పించారు కాబట్టి ఇన్ని కంపెనీలు గ్లోబల్ సమ్మిట్ కు పంపించారు. పేటియం బ్యాచ్ తో భోజనాల వద్ద గొడవలు సృష్టించారు. టిడిపి హయాంలో స్కాం లు.. జగన్ హయాం లో స్కీం లు అని ఎంపీ మార్గాని భరత్ ఎద్దేవా చేశారు. పోలవరం ఆలస్యం అవడానికి కారకులు ఎవరు? కమిషన్ల కోసం పోలవరం నిర్మాణాన్ని గందరగోళం చేశారు. చంద్రబాబు నిర్వాకం వల్లే పోలవరం ఆలస్యం అవుతోందన్నారు. తప్పులు చేసిన వాళ్లపై క్రిమినల్ కేసులు పెట్టాలి. గతప్రభుత్వం చేసిన తప్పులను ఈ ప్రభుత్వం సరిదిద్దుతోందన్నారు.
Read Also: Gun Fire: ఖాసింకు కోపం వచ్చింది.. గర్ల్ ఫ్రెండ్‌కు బుల్లెట్ దిగింది