Botsa Jhansi: బొబ్బిలి, విజయనగరం ఎంపీగా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలపై స్పందించి, పరిష్కరించానని సగర్వంగా చెప్పగలనని విశాఖ పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ అన్నారు. ఒకప్పుడు రైల్వే గేట్లు సరిగ్గా ఉండేవి కాదని.. ఆ అంశాలన్నీ పార్లమెంట్‌లో ప్రస్తావించి పనులు చేయించానన్నారు. ఈ ప్రాంతంలోని సమస్యలు, వెనకబాటుతనం గురించి తెలుసు కాబట్టే దానిని పార్లమెంట్‌లో ప్రస్తావించి పనులు జరిగేలా చూశానన్నారు. తనను ప్రజలు ఎంపీగా గెలిపించడం వల్లే ఈ పనులన్నీ చేయించాగలిగానన్నారు.
Read Also: CM YS Jagan: ఏపీలో హీరో ఎవరో.. విలన్ ఎవరో.. ప్రజలు తెలుసుకోవాలి..
విశాఖ రాజధాని అంశంపై మరోసారి వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ కీలక వ్యాఖ్యలు చేసింది. మూడు రాజధానుల అంశాల్ని మేనిఫెస్టోలో పెట్టామని తెలిపారు. వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత విశాఖను మరింత అభివృద్ధి చేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పారు. విశాఖలో ఎన్నో సాఫ్ట్‌వేర్ కంపెనీలు కూడా ఏర్పాటు కానున్నాయని ఆమె వెల్లడించారు. మన ప్రాంతంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగేలా ముఖ్యమంత్రి సీఎం జగన్ చొరవ తీసుకుంటున్నాని ఆమె తెలిపారు. టీడీపీ ప్రభుత్వాన్ని, వైసీపీ సర్కారును ప్రజలు చూశారని.. ఏ పాలన బాగుందో ప్రజల మనస్సాక్షికి తెలుసన్నారు. సీఎం జగన్ ప్రతి పైసా ప్రజల సంక్షేమం కోసమే ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు. విశాఖ అభివృద్ధి జరిగితే రాష్ట్రానికి మణిహారంగా ఉంటుందన్నారు. విశాఖ అభివృద్ధికి సహకరిస్తోన్న సీఎం జగన్‌కు అండగా ఉండాలని ప్రజలను ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ కోరారుయ