Gannavaram Politics: నో డౌట్..! ఆయన సహకరిస్తారు.. గన్నవరంలో గెలుపు వైసీపీదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gannavaram Politics: గన్నవరంలో తాజా రాజకీయ పరిస్థితులతో అప్రమత్తమైన వైసీపీ.. ఆ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టింది.. వైసీపీ గుడ్‌బై చెప్పి యార్లగడ్డ వెంకట్రావ్.. తెలుగుదేశం పార్టీలో చేరాడు.. ఆయనతో పాటు మరికొంతమంది వైసీపీ నేతలు, క్యాడర్ కూడా సైకిల్ ఎక్కింది.. దీంతో.. దిద్దుబాటు చర్యలకు దిగింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం.. అందులో భాగంగా ఎంపీ బాలశౌరిని రంగంలోకి దించింది.. వైసీపీ అసంతృప్త నేత దుట్టా రామచంద్రరావుతో చర్చలు జరిపారు బాలశౌరి.. ఆయన కూడా టీడీపీలో చేరతారనే ప్రచారం ఓవైపు సాగుతుండగా.. ఆయన్ని బుజ్జగించి.. వైసీపీలో కొనసాగే దిశగా చూసేందుకు ఈ సమావేశం జరిగినట్టు ప్రచారం సాగుతోంది. ఇక, ఈ భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన ఎంపీ బాలశౌరి.. వైసీపీ గన్నవరంలో మళ్లీ బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
Read Also: Viral Video: దాహం వేసి నీటి కోసం కష్టపడుతున్న కుక్క.. ఓ మహిళ ఏం చేసిందంటే
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్‌కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
వచ్చే ఎన్నికల్లో గన్నవరంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవటానికి దుట్టా సహాయ, సహకారాలు ఉంటాయనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు ఎంపీ బాలశౌరి.. వైసీపీ పుట్టినప్పడే దుట్టా పార్టీలో చేరారని గుర్తుచేసిన ఆయన.. కార్యకర్తలు.. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కోసం పనిచేశారు.. వైఎస్‌కి రాష్ట్రంలో ఉన్న అత్యంత సన్నిహితుల్లో దుట్టా రామచంద్రరావు ఒకరు అని తెలిపారు. దుట్టా పార్టీకి విధేయులు.. సీఎం వైఎస్ జగన్, పార్టీ కోసం ఆయన పని చేస్తారు.. అందులో నో డౌట్ అనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. పార్టీ కోసం ఆయన చేయాల్సిన వరకు చేశారు. వేరే వాళ్లు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు.. పార్టీకి ఏ అవసరం, జగన్ కి ఏ అవసరం ఉన్నా పార్టీ కోసం ఆయన పనిచేస్తారని తెలిపారు. ఇక, ఎంపీగా నాకు 10 వేల మెజార్టీ వచ్చింది.. పార్టీ మళ్లీ ఇక్కడ గెలిచేలా పనిచేస్తామని తెలిపారు ఎంపీ బాలశౌరి.
తాజావార్తలు
-
Vastu Tips: బెడ్రూమ్లో అద్దం ఏ దిశలో ఉంటే మంచిది? చాలామంది చేసే ఈ పొరపాటు మీ ఇంట్లో కూడా ఉందా?
-
Philippines Earthquake: ఫిలిప్పీన్స్‌లో 7.8 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్‌కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!