Adala Prabhakar Reddy: ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో.. అన్ని పార్టీలు మత వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి.. అయితే, అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో మార్పులు, చేర్పులు సిట్టింగ్‌లను టెన్షన్ పెడుతున్నాయి.. ఈ సారి టికెట్ రాదని తేలిపోవడంతో.. కొందరు నేతలు పక్క పార్టీల వైపు చేస్తున్నారు.. మరికొందరు ఏది ఏమైనా పార్టీని వీడేది లేదు.. సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వెంటే మా ప్రయాణం అని ప్రకటిస్తున్నారు.. ఇక, నెల్లూరు ఎంపీ, నెల్లూరు రూరల్ వైసీపీ ఇంఛార్జ్‌గా ఉన్న ఆదాల ప్రభాకర్‌రెడ్డిపై కూడా ఇలాంటి ప్రచారమే సాగుతూ వస్తోంది.. ఎంపీగా ఉన్న ఆయనకు ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఇష్టంలేదని.. ఆయన టీడీపీతో టచ్‌లోకి వెళ్లాడని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.. దీనిపై మరోసారి క్లారిటీ ఇచ్చారు ఆదాల.. అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానేగానీ.. ఎట్టిపరిస్థితుల్లోనూ పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
Read Also: Mahua Moitra : త్వరగా బంగ్లా ఖాళీ చేయండి.. టీఎంసీ నేత మహువా మొయిత్రాకు అల్టిమేటం
తాను పార్టీ మారుతున్నట్లు విపక్షాలు, రాజకీయ ప్రత్యర్థులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి.. తాను టీడీపీ పెద్దలను కలిసినట్లు, ఆ పార్టీలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టారు.. తనకు వైసీపీలో ఎలాంటి ఇబ్బంది లేదన్న ఆయన.. వైఎస్ జగన్.. తనకు ఎంపీ టికెట్ ఇవ్వడంతో గెలిచి సేవలు అందించాను.. ఇప్పుడు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా నియమించి పార్టీ తనకు తగిన గుర్తింపునిచ్చిందన్నారు. ఇంత ప్రాధాన్యం ఇస్తున్న వైసీపీని వదిలి వెళ్లాల్సిన అవసరం తనకు ఏంటి? అని నిలదీశారు. రాజకీయంగా తనను ఎదుర్కొనే సత్తా లేక.. కొందరు కిరాయి మూకలను నియమించుకుని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైసీపీ బలంగా ఉండటంతో.. ప్రత్యర్థులు ఇలాంటి కుట్రలు పన్నుతున్నారని.. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా పార్టీ మారే ప్రసక్తే లేదు.. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేసి తీరుతానని స్పష్టం చేశారు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి.
