MP Adala Prabhakar Reddy: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. పాదయాత్ర అంటే ప్రజా సమస్యలు తెలుసుకోవడం.. ప్రజాప్రతినిధులపై విమర్శలు చేయడం కాదన్నారు. రాజకీయాల్లో లోకేష్ పిల్లోడు.. టీడీపీకి సరైన అభ్యర్థులు కూడా లేరన్నారు. అభ్యర్థలు లేక వైసీపీలో ఉండే స్క్రాప్ ను టీడీపీలోకి తీసుకుంటున్నారని దుయ్యబట్టారు. మూడు సార్లు ఓడిపోయిన వారికి టికెట్ ఇవ్వడం కుదరని లోకేష్ చెప్పాడని.. సోమిరెడ్డి నా దగ్గర ఫీల్ అయ్యాడు.. వరుస ఓటములతో నెల్లూరు జిల్లాలో సోమిరెడ్డి రికార్డ్ సృష్టించాడు అంటూ విమర్శలు గుప్పించారు. అయితే, నేను పార్టీ మారే ప్రసక్తే లేదు.. వైసీపీ రూరల్ నుంచే బరిలో దిగుతానంటూ క్లారిటీ ఇచ్చారు.
Read Also: Rohit Sharma: వన్డే ప్రపంచకప్ తర్వాత టీమిండియాలో రోహిత్ శర్మను కొనసాగిస్తారా..?
ఇక, మాజీ మంత్రి సోమిరెడ్డికి టికెట్ ఇస్తే మరోసారి ఓడిపోతాడంటూ జోస్యం చెప్పారు ఎంపీ ఆదాల.. నేను పార్టీ మారతాను అని టీడీపీ మైండ్ గేమ్ ఆడుతోందన్న ఆయన.. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జీవిత కాలం పోరాటాలు చేసుకోవాల్సిందే.. నాలుగేళ్లు అధికారంలో ఉన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి అభివృద్ది చెయ్యడంలో ఫెయిల్ అయ్యాడని మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్ ను నేను కోరిన తర్వాతే రూరల్ కి నిధులు మంజూరు అయ్యాయని చెప్పుకొచ్చారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి.